
ఇటీవల విమాన ప్రయాణంలో వేధింపులకు గురైన బాలీవుడ్ నటి జైరా వసీం తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో కొంత మంది జైరా ను నిందించటంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పందించారు. విమానంలోనే గట్టిగా నిలదీయకుండా ప్రయాణం అయిపోయిన తరువాత జైరా స్పందించటం పబ్లిసిటీ స్టంట్ అంటూ కొందరు ఆరోపించారు.
ఈ విషయంపై స్పందించిన కంగనా.. పదిహేడేళ్ల అమ్మాయి తనకు జరిగిన వేధింపులకు సంబంధించి మాట్లాడిందంటే ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అంతేగాని ఆమెనే విమర్శించటం కరెక్ట్ కాదని తెలిపారు. ప‍్రముఖ రచయిత్రి శోభాడే రాసిన ‘70 అండ్ టు హెల్ విత్ ఇట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కంగనా, జైరాకు జరిగిన వేధింపులపై స్పందించారు. వీడియోలో ఆ వ్యక్తి జైరా చైర్ పై కాలు పెట్టినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. అయినా ఆమెను ఎందుకు నిందిస్తున్నారని ప్రశ‍్నించింది. అదే నేను ఆ పరిస్థితుల్లో ఉంటే అతని కాలు విరగొట్టేదాన‍్నన్నారు.
Comments
Please login to add a commentAdd a comment