
ప్రియంకా చోప్రా హిందీ సినిమాల్లో కనిపించి సుమారు రెండేళ్లు అయిపోయింది. అయితే ఈ గ్యాప్‌ని మర్చిపోయేంత స్పెషల్‌గా తనతాజా చిత్రం ఉండేలా చూసుకుంటున్నారామె. ఈ సినిమాలో 21ఏళ్ల కూతురున్న తల్లి పాత్రలో కనిపించడమే కాకుండా సినిమా మొత్తం మీద నాలుగు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారట. ప్రియాంకా చోప్రా, ఫర్హాన్ అక్తర్, జైరా వసీమ్ ముఖ్య పాత్రల్లో సోనాలి బోస్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘స్కై ఈజ్ పింక్’. ఈ సినిమాలో జరీనా తల్లిగా ప్రియాంక కనిపించనున్న సంగతి తెలిసిందే.
చిన్న వయసులో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్నప్పటికీ, అసలు బ్రతకడమే కష్టమని డాక్టర్స్ చెప్పినా మోటివేషనల్ స్పీకర్‌గా, ఒక పుస్తక రచయితగా కూడా తన ప్రతిభ చాటుకున్న అయేషా చౌదరి కథనే ఈ చిత్రానికి మూలం. ఇందులో అయేషా పాత్రలో జైరా కనిపిస్తారు. ఈ చిత్రం ఉద్వేగంగాను, స్ఫూర్తినిచ్చే విధంగానూ ఉంటుందట. 30 ఏళ్ల కాలంలో జరిగే కథ కావడంతో వయసులోని వివిధ దశల వారీగా ప్రియాంకా లుక్స్ ఉండనున్నాయట.
Comments
Please login to add a commentAdd a comment