
సాక్షి, ముంబై : దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్ చిత్రాలతో గుర్తింపు దక్కించుకున్న నటి జైరా వసీమ్(17) లైంగిక వేధింపులకు గురైంది. ఫ్లైట్‌లో ఆమెతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని ఫ్లైట్ దిగాక తన ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించింది. ఇలా జరగాల్సింది కాదు. నేను చాలా బాధతో ఉన్నా అని ఆమె ఆ పోస్టులో రోదిస్తూ తెలిపింది. శనివారం ఎయిర్ విస్తారాలో ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న క్రమంలో ఆమెకు ఈ అనుభవం ఎదురైంది. నిద్రిస్తున్న సమయంలో సదరు వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడంట. తన వెనకాల కూర్చున్న ఆ మధ్యవయస్కు వ్యక్తి ఆమె సీటుపై కాలు పెట్టిన వీడియోను ఆమె చిత్రీకరించింది. తర్వాత ఫ్లైట్ ప్రయాణిస్తున్న క్రమంలో ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడంట.
వెలుతురు సరిగ్గా లేకపోవటం ఆసరాగా చేసుకుని నిందితుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె అంటోంది. అమ్మాయిల భద్రత ఎలా ఉందో తెలిసిపోతోంది.. సాయం చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదని ఆమె వీడియోలో తెలిపింది. కాగా, ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment