
పాఠశాల విద్యార్థినిలతో కిరణ్ రావు
శ్రీనగర్(జమ్మూకశ్మీర్): బాలనటి జైరా వాసిం చదువుతున్న సెయింట్ పాల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ భార్య కిరణ్ రావు సందర్శించారు. జైరాను తమ సినిమా 'దంగల్'లో నటించేందుకు అనుమతి ఇచ్చినందుకు ప్రిన్సిపాల్ కు ధన్యవాదాలు తెలిపారు. జైరాకు సెలవులు మంజూరు చేయడమే కాకుండా, ఆమెకు చదువుకోసం పర్సనల్ ట్యూటర్ ను ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. అంతకుముందు కిరణ్ రావుకు పాఠశాల విద్యార్థులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు.
'దంగల్' సినిమాలో గీతా పొగట్ చిన్ననాటి పాత్రలో జైరా నటిస్తోంది. యూటీవీ మోషన్స్, ఆమీర్ ఖాన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది క్రిస్ మస్ కు ఈ సినిమా విడుదలకానుంది.