బట్టల్లేకుండా రైలు పట్టాలపై ఆమిర్ ఖాన్! | Aamir Khan goes completely nude in PK poster! | Sakshi
Sakshi News home page

బట్టల్లేకుండా రైలు పట్టాలపై ఆమిర్ ఖాన్!

Aug 1 2014 11:39 AM | Updated on Apr 3 2019 6:23 PM

సల్మాన్, జాన్, హృతిక్ చొక్కాలు మాత్రమే విప్పితే ఆమిర్ ఖాన్ ఏకంగా ఒంటిమీదున్న బట్టలన్ని విప్పేసి అందరీని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు.

బాలీవుడ్ లో చొక్కాలు విప్పే హీరోలు అనగానే సల్మాన్ఖాన్, జాన్అబ్రహం, హృతిక్ రోషన్ గుర్తుకు వస్తారు. అయితే ఈ జాబితాలోకి మిస్టర్ పెర్పెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కూడా చేరాడు. సల్మాన్, జాన్, హృతిక్ చొక్కాలు మాత్రమే విప్పితే ఆమిర్ ఏకంగా ఒంటిమీదున్న బట్టలన్ని విప్పేసి అందరీని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. రాజ్కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న 'పీ.కే.' సినిమా కోసం ఈ ఫీట్ చేశాడు. దీంతో 'పీ.కే.' ఫస్ట్లుక్ చర్చనీయాంశంగా మారింది.

ఒంటిమీద నూలు పోగులేకుండా రైలు పట్టాలపై నిలబడి కోపంగా చూస్తున్నట్టుగా పోస్టర్ లో ఉంది. ఆమిర్ ఖాన్ ఆచ్చాదనగా ఒక పాత టేప్ రికార్డర్ ను మాత్రమే అడ్డుపెట్టుకోవడం విశేషం. సినిమా ఇంట్రడక్షన్ సీన్ లోనే ఆమిర్ బేర్ బాడీతో కన్పించనున్నాడు. ఇంతకుముందెన్నడూ అతడు ఇలాంటి సీన్లు చేయలేదు.

భూమిపైకి వచ్చిన గ్రహాంతరజీవి పాత్రను ఆమిర్ ఖాన్ ఈ సినిమాలో పోషించాడు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై వ్యంగాస్త్రంగా ఈ సినిమాను హిరానీ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందు ఆమిర్, హిరానీ కాంబినేషన్ లో వచ్చిన త్రీఇడియట్స్ ఘన విజయం సాధించింది. 'పీ.కే.' ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement