PK poster
-
ట్రాన్సిస్టర్ ధరించి వచ్చేస్తున్నా: అనుష్క
పి.కె.... ఈ సినిమాకు సంబంధించి అమీర్‌ఖాన్ పోస్టర్ సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు. ఓ చిన్న ట్రాన్సిస్టర్ మాత్రమే ధరించి రైలు పట్టాల మీద అడ్డంగా.. నగ్నంగా నిలుచున్న అమీర్‌ఖాన్ పోస్టర్ ఎంత గందరగోళం సృష్టించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అందుకు రెట్టింపు లేదా ఎన్నోరెట్లు వివాదం సృష్టించడానికి అనుష్కాశర్మ సిద్ధమైపోయింది. ''ఇప్పటివరకు పి.కె.ను బాగా తేరిపార చూశారు కదా.. ఇప్పుడు నేను వచ్చేస్తున్నాను. సిద్ధంగా ఉండండి. ఓ ట్రాన్సిస్టర్ మాత్రమే ధరించి రాబోతున్నా. కాస్కోండి'' అంటూ ట్విట్టర్లో సంచలనాత్మక ప్రకటన చేసింది. తనను కూడా తేరిపార చూసేందుకు గురువారం నాడు సిద్ధంగా ఉండాలని అభిమానులకు చెప్పింది. ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్లో తాను ట్రాన్సిస్టర్ ధరించి రాబోతున్నానని తెలిపింది. ఈ పోస్టర్‌ను వాట్సప్‌లో ఈనెల 16వ తేదీ.. గురువారం విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు వాట్సప్‌లో విడుదల చేసిన నాలుగో అధికారిక మోషన్ పోస్టర్ ఇది అవుతుంది. కనీసం పది లేదా అంతకంటే ఎక్కువ మందితో వాట్సప్‌లో ఓ గ్రూప్ తయారుచేసుకుని, ఆ తర్వాత పికెను యాడ్ చేసుకోవాలని చెప్పింది. అలా యాడ్ చేసుకోవాల్సిన నంబర్ కూడా ఇచ్చింది. ఆ నంబర్.. 7710095890. Mujhe tukur tukur dekhna hai? Toh pehle isse dekho: http://t.co/tXKwULTL38 — ANUSHKA SHARMA (@AnushkaSharma) October 14, 2014 -
నగ్నంగా కనిపించడం టాలెంటా?
అమీర్ ఖాన్, షారుక్ ఖాన్.. పరిచయమక్కర్లేని పేర్లివి. ఇద్దరూ సినీ పరిశ్రమలో గొప్ప నటులుగా పేరొందినవారే, స్టార్లుగా వెలుగొందుతున్నవారే, బయటెక్కడైనా కలిస్తే చక్కగా పలకరించుకునే వారే. ఇదంతా కనిపించే కోణంలో ఓ భాగం మాత్రమే. కనిపించని మరో కోణంలో ఇద్దరూ స్టార్ స్టేటస్ కోసం ఒకర్నొకరు విమర్శించుకుంటూ.. నువ్వా? నేనా? అన్నట్లు ఫీలయ్యే ఒక సాధారణ ఈగో జీవులు. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనేంత శత్రుత్వం ఉందనేది ఎప్పుడూ బయటకు కనిపించకపోయినా.. అదే నిజమని చెప్పే సంఘటన ఇది. ఈ మధ్యే విడుదలైన అమీర్ తాజా చిత్రం 'పీకే'కి సంబంధించిన న్యూడ్ పోస్టర్ సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఈ విషయంపైనే షారూక్ స్పందిస్తూ, 'నగ్నంగా నటించడం ఏమైనా గొప్ప విషయమా? దాన్ని టాలెంట్ అని ఎలా అంటాం?' అంటూ చురకలంటించారు. షారూఖ్, తన తాజా సినిమా 'హ్యాపీ న్యూ ఇయర్' ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఈ మాటలన్నారు. వీరిద్దరి మధ్య ఈ మాటల యుద్ధం ఇప్పటిదేం కాదు. ఓసారి ఆమీర్ తన బ్లాగులో, 'మా కుక్క పేరు షారుక్ ఖాన్' అంటూ పోస్ట్ చేయడంతో రేగిన దుమారం అప్పట్లో ఓ హాట్ టాపిక్. ఇక వీరిద్దరి మధ్యన జరిగే మాటల యుద్ధానికి సల్మాన్ ఖాన్ అప్పుడప్పుడూ కాస్త మసాలా జోడిస్తుండడం కొసమెరుపు! కాగా షారుక్ వ్యాఖ్యలను అమీర్ లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. తన మనసులో అనేక ఆలోచనలు ఉంటాయని, అయితే వాటన్నింటిని ఎప్పటికప్పుడూ వదిలించుకుంటానని తెలిపాడు. కొంతమంది ఎదుటవారిలో లోపాలు వెదికేందుకు ప్రయత్నిస్తారని, అలాంటివాటికి తాను దూరమని అమీర్ చెప్పుకొచ్చాడు. -
నకల కళా వల్లభులు
రోల్ మోడల్ అనుకుంటే, ఉన్నదాన్నే రీ మోడల్ చేసి గుట్టు చప్పుడు కాకుండా వదిలాడని ఫేస్బుక్, ట్విట్టర్లు నోళ్లు నొక్కుకుంటున్నాయి ఆమిర్‌ఖాన్ గురించి. ‘సత్యమేవ జయతే’ లాంటి సత్యమైన ప్రోగ్రాములు ఓ పక్క చేస్తూ, ఇంకో పక్క పరదేశీ పోస్టర్లని కాపీ కొట్టడమేంటని ఆమిర్‌ఖాన్ నగ్న ప్రయత్నం భగ్నం అవడం చూసి ఆశ్చర్యపోయింది బాలీవుడ్. ఆమిర్‌ఖాన్ ‘పీకే’ కాపీనా? కాదా? అనే విషయం సినిమా విడుదలయ్యేంతవరకూ తెలియదు కానీ... పోస్టర్లు కాపీ కొట్టడం అనే సబ్జెక్టు ఇండియన్ సినిమా సిలబస్‌కి కొత్తేం కాదు. సినిమా అయినా, పోస్టర్ అయినా ఒక ఆలోచన నుంచి పుట్టాల్సిందే. ఒక సూపర్ ఆలోచనను చూడగానే, మనం కూడా ఇలాంటిదే ఒకటి చెయ్యాలి అని ఆలోచించడం సినీమానవుల నైజం. దాని నుండి ఇన్స్పైర్ అయ్యి పోస్టర్ చేద్దామనుకుంటారు కానీ, చివరకు కాపీలు అయిపోతుంటాయి. ఒకరు పరభాషలోని సినిమా పోస్టర్ని చూసి కాపీ కొడితే, ఇంకొకరు దాన్నిచూసి కాపీ కొట్టిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడైతే బయటపడడం కష్టం కానీ, ఇప్పుడు అంతా ఇంటర్నెట్ జమానా అవడంతో... వరల్డ్ సినిమా అందరి హార్ట్డిస్క్ల్లో ఉంటుంది. కాపీ రాయుళ్ల కళా విలాసాలు తెల్లారేసరికి బట్టబయలైపోతాయి. అలా ఇంటర్నెంట్ తవ్వకాల్లో బయటపడ్డ కొన్ని కళాత్మక పోస్టర్లు, వాటి నుంచి చేయబడిన ‘నకలా’త్మక పోస్టర్లపై స్పెషల్ లుక్. -
అమీర్‌ఖాన్‌కు ఎట్టకేలకు 'వస్త్రదానం'
ఒంటిమీద నూలుపోగు కూడా లేకుండా ఒక చిన్న ట్రాన్సిస్టర్ మాత్రమే అడ్డుపెట్టుకుని దర్శనమిచ్చిన బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్‌కు ఎట్టకేలకు వస్త్రదానం జరిగింది. విలె పార్లె కాంగ్రెస్ ఎమ్మెల్యే కృష్ణ హెగ్డే ఇందుకు పూనుకున్నారు. ఓ భారీ కటౌట్, పోస్టర్ ఉన్నచోట ఆయన స్వయంగా అమీర్ బొమ్మకు దుస్తులు వేశారు. దాంతో పెద్ద సంఖ్యలో జనం అక్కడకు చేరుకుని చప్పట్లు కొడుతూ హెగ్డే చర్యను స్వాగతించారు. అమీర్ చర్య భారతీయ సంస్కృతికి విరుద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఆకుపచ్చ షార్ట్స్, బూడిద రంగు టీషర్టు అమీర్ బొమ్మకు అలంకరించారు. అమీర్ ఖాన్ చాలా మంచి నటుడని, ఆయన సత్యమేవ జయతే లాంటి మంచి కార్యక్రమాలు కూడా చేస్తారని, అయితే ఇలాంటి చర్యలు మాత్రం ఇన్నాళ్లూ ఆయనను ఆరాధిస్తున్న వాళ్ల మనసుల్లో తప్పుడు ముద్ర వేస్తాయని హెగ్డే అన్నారు. పీకే చిత్రం నుంచి ఈ అభ్యంతరకరమైన నగ్న ప్రదర్శనను ఉపసంహరించుకోవాలని అమీర్ ఖాన్‌ను కోరారు. అయితే, సినిమాలో చూస్తే ఈ దృశ్యం ప్రాధాన్యత ఏంటో తెలుస్తుందని అమీర్ అంటున్నాడు. -
వివాదంలో పీకే పోస్టర్!
విభిన్న తరహా చిత్రాలు చేయడం... అవసరమైతే విచిత్రమైన వేషాల్లో కనిపించడం ఆమిర్‌ఖాన్ స్టయిల్. అందుకు తాజా ఉదాహరణ ‘పీకే’. ఈ చిత్రకథ డిమాండ్ చేసిన మేరకు ఆమిర్‌ఖాన్ నగ్నంగా నటించిన విషయం, ఇటీవల ఆ లుక్ విడుదల కావడం తెలిసిందే. ఈ ప్రచార చిత్రం చూసి, ‘పీకే కోసం ఆమిర్‌ఖాన్ చాలా తెగించేశారు.. భేష్’ అన్నవాళ్లు చాలామందే ఉన్నారు. ‘అవసరమా? ఆమిర్ ఎందుకిలా చేయాల్సి వచ్చింది’ అని వ్యాఖ్యానించినవాళ్లూ లేకపోలేదు. అయితే ఎల్ఎల్బి చదువుతున్న అభిషేక్ భార్గవ అనే కుర్రాడు మాత్రం ఏకంగా కేసు పెట్టేశాడు. ‘ఆమిర్ నటిస్తున్న ‘పీకే’ చిత్రానికి సంబంధించిన న్యూడ్ పోస్టర్ అభ్యంతరకరంగా ఉంది. సమాజంలో అసభ్యతకు తగిన ప్రచారం కల్పించేట్లుగా’ ఉంది అని ఆ యువకుడు పేర్కొన్నాడు. అక్టోబర్ 15న ఈ కేసు విచారణ ఆరంభం కానుంది. ఆమిర్ కథానాయకునిగా ‘3 ఇడియట్స్’ వంటి ఘనవిజయాన్ని అందించిన రాజ్‌కుమార్ హిరానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. -
బట్టల్లేకుండా రైలు పట్టాలపై ఆమిర్ ఖాన్!
బాలీవుడ్ లో చొక్కాలు విప్పే హీరోలు అనగానే సల్మాన్‌ఖాన్, జాన్అబ్రహం, హృతిక్ రోషన్ గుర్తుకు వస్తారు. అయితే ఈ జాబితాలోకి మిస్టర్ పెర్పెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కూడా చేరాడు. సల్మాన్, జాన్, హృతిక్ చొక్కాలు మాత్రమే విప్పితే ఆమిర్ ఏకంగా ఒంటిమీదున్న బట్టలన్ని విప్పేసి అందరీని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న 'పీ.కే.' సినిమా కోసం ఈ ఫీట్ చేశాడు. దీంతో 'పీ.కే.' ఫస్ట్‌లుక్ చర్చనీయాంశంగా మారింది. ఒంటిమీద నూలు పోగులేకుండా రైలు పట్టాలపై నిలబడి కోపంగా చూస్తున్నట్టుగా పోస్టర్ లో ఉంది. ఆమిర్ ఖాన్ ఆచ్చాదనగా ఒక పాత టేప్ రికార్డర్ ను మాత్రమే అడ్డుపెట్టుకోవడం విశేషం. సినిమా ఇంట్రడక్షన్ సీన్ లోనే ఆమిర్ బేర్ బాడీతో కన్పించనున్నాడు. ఇంతకుముందెన్నడూ అతడు ఇలాంటి సీన్లు చేయలేదు. భూమిపైకి వచ్చిన గ్రహాంతరజీవి పాత్రను ఆమిర్ ఖాన్ ఈ సినిమాలో పోషించాడు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై వ్యంగాస్త్రంగా ఈ సినిమాను హిరానీ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందు ఆమిర్, హిరానీ కాంబినేషన్ లో వచ్చిన త్రీఇడియట్స్ ఘన విజయం సాధించింది. 'పీ.కే.' ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.