ట్రాన్సిస్టర్ ధరించి వచ్చేస్తున్నా: అనుష్క
పి.కె.... ఈ సినిమాకు సంబంధించి అమీర్ఖాన్ పోస్టర్ సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు. ఓ చిన్న ట్రాన్సిస్టర్ మాత్రమే ధరించి రైలు పట్టాల మీద అడ్డంగా.. నగ్నంగా నిలుచున్న అమీర్ఖాన్ పోస్టర్ ఎంత గందరగోళం సృష్టించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అందుకు రెట్టింపు లేదా ఎన్నోరెట్లు వివాదం సృష్టించడానికి అనుష్కాశర్మ సిద్ధమైపోయింది. ''ఇప్పటివరకు పి.కె.ను బాగా తేరిపార చూశారు కదా.. ఇప్పుడు నేను వచ్చేస్తున్నాను. సిద్ధంగా ఉండండి. ఓ ట్రాన్సిస్టర్ మాత్రమే ధరించి రాబోతున్నా. కాస్కోండి'' అంటూ ట్విట్టర్లో సంచలనాత్మక ప్రకటన చేసింది.
తనను కూడా తేరిపార చూసేందుకు గురువారం నాడు సిద్ధంగా ఉండాలని అభిమానులకు చెప్పింది. ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్లో తాను ట్రాన్సిస్టర్ ధరించి రాబోతున్నానని తెలిపింది. ఈ పోస్టర్ను వాట్సప్లో ఈనెల 16వ తేదీ.. గురువారం విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు వాట్సప్లో విడుదల చేసిన నాలుగో అధికారిక మోషన్ పోస్టర్ ఇది అవుతుంది.
కనీసం పది లేదా అంతకంటే ఎక్కువ మందితో వాట్సప్లో ఓ గ్రూప్ తయారుచేసుకుని, ఆ తర్వాత పికెను యాడ్ చేసుకోవాలని చెప్పింది. అలా యాడ్ చేసుకోవాల్సిన నంబర్ కూడా ఇచ్చింది. ఆ నంబర్.. 7710095890.
Mujhe tukur tukur dekhna hai? Toh pehle isse dekho: http://t.co/tXKwULTL38
— ANUSHKA SHARMA (@AnushkaSharma) October 14, 2014