వివాదంలో పీకే పోస్టర్! | Complaint against Aamir Khan over 'PK' poster | Sakshi
Sakshi News home page

వివాదంలో పీకే పోస్టర్!

Published Mon, Aug 4 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM

వివాదంలో పీకే పోస్టర్!

వివాదంలో పీకే పోస్టర్!

 విభిన్న తరహా చిత్రాలు చేయడం... అవసరమైతే విచిత్రమైన వేషాల్లో కనిపించడం ఆమిర్‌ఖాన్ స్టయిల్. అందుకు తాజా ఉదాహరణ ‘పీకే’. ఈ చిత్రకథ డిమాండ్ చేసిన మేరకు ఆమిర్‌ఖాన్ నగ్నంగా నటించిన విషయం, ఇటీవల ఆ లుక్ విడుదల కావడం తెలిసిందే. ఈ ప్రచార చిత్రం చూసి, ‘పీకే కోసం ఆమిర్‌ఖాన్ చాలా తెగించేశారు.. భేష్’ అన్నవాళ్లు చాలామందే ఉన్నారు. ‘అవసరమా? ఆమిర్ ఎందుకిలా చేయాల్సి వచ్చింది’ అని వ్యాఖ్యానించినవాళ్లూ లేకపోలేదు.
 
 అయితే ఎల్‌ఎల్‌బి చదువుతున్న అభిషేక్ భార్గవ అనే కుర్రాడు మాత్రం ఏకంగా కేసు పెట్టేశాడు. ‘ఆమిర్ నటిస్తున్న ‘పీకే’ చిత్రానికి సంబంధించిన న్యూడ్ పోస్టర్ అభ్యంతరకరంగా ఉంది. సమాజంలో అసభ్యతకు తగిన ప్రచారం కల్పించేట్లుగా’ ఉంది అని ఆ యువకుడు పేర్కొన్నాడు. అక్టోబర్ 15న ఈ కేసు విచారణ ఆరంభం కానుంది. ఆమిర్ కథానాయకునిగా ‘3 ఇడియట్స్’ వంటి ఘనవిజయాన్ని అందించిన రాజ్‌కుమార్ హిరానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement