రేపు ముంబై కోర్టులో ఆమీర్ ఖాన్ పీకే వివాదం!
రేపు ముంబై కోర్టులో ఆమీర్ ఖాన్ పీకే వివాదం!
Published Mon, Aug 18 2014 6:27 PM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'పీ.కే' చిత్ర పోస్టర్ పై వివాదం కొనసాగుతునే ఉంది. పీకే చిత్ర పోస్టర్, అసభ్యత, అశ్లీల అంశాలపై ముంబై కోర్టులో ఇటీవల నమోదైన కేసు మంగళవారం విచారణకు రానుంది.
పీ.కే చిత్రంలో అశ్లీల పోస్టర్లు తొలగించాలని, దేశవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలను ఆపివేయాలని సామాజిక కార్యకర్త హేమంత్ పాటిల్ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారించనుంది. ఈ కేసులో నటుడు అమీర్ ఖాన్, నిర్మాత విదూ వినోద్ చోప్రా, దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ, సెన్సార్ బోర్డులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
అశ్లీలంగా, నగ్నంగా ఉన్న అమీర్ ఖాన్ పోస్టర్ తో దేశవ్యాప్తంగా ప్రచారం చేశారని, ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని పిటిషన్ దాఖలు చేశారు. సత్యమేవ జయతే లాంటి టెలివిజన్ కార్యక్రమాన్ని నిర్వహించి క్లీన్ ఇమేజ్ సంపాదించుకున్న అమీర్ నటుడు నగ్నంగా ఉండే పోస్టర్ ను పబ్లిసిటీ వినియోగించుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement