చైనాలోనూ... 100 కోట్లు పీకేశారు! | Aamir Khan's PK Makes History With Rs 100 Crore in China | Sakshi
Sakshi News home page

చైనాలోనూ... 100 కోట్లు పీకేశారు!

Published Tue, Jun 9 2015 12:13 AM | Last Updated on Sun, Sep 3 2017 3:26 AM

చైనాలోనూ... 100 కోట్లు పీకేశారు!

చైనాలోనూ... 100 కోట్లు పీకేశారు!

ఆమిర్ ఖాన్ నటించిన ‘పీకే’ చిత్రం మనదేశంలోనే కాదు... ఇప్పుడు విదేశంలోనూ సంచలనం రేపుతోంది. చైనాలో ఏకంగా రూ. 100 కోట్ల వసూళ్ళు సాధించి, కొత్త చరిత్ర సృష్టించింది. గత ఏడాది మన దగ్గర వసూళ్ళ వర్షం కురిపించిన ‘పీకె’ ఆలస్యంగా ఈ మధ్యే చైనాలో రిలీజైంది. కేవలం పదహారు రోజుల్లో అక్కడ ‘ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్’ భారతీయ సినిమాగా నిలిచింది. మన కరెన్సీ లెక్క ప్రకారం వంద కోట్ల పైగా వసూలు చేసింది. మన దేశంలో పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్న గాడ్‌మెన్ సంస్కృతిపై వ్యంగ్యబాణాలు విసురుతూ, రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన ‘పీకే’ ఎన్నో నిరసనలు తట్టుకొని, మన దేశంలోని భారీ కమర్షియల్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు చైనాలోనూ కాసులు కురిపిస్తూ, ఆ ఘనత సాధించిన అతి కొద్ది హిందీ చిత్రాల్లో ఒకటైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement