
ట్రాన్సిస్టర్.. పీకే!
‘అందం చూడవయా... ఆనందించవయా’ అంటూ ఆమిర్‌ఖాన్ ‘పీకే’ పోస్టర్‌లో నగ్నంగా కనిపించి పిచ్చెక్కిస్తుంటే... దానిపై సెటైర్లు పేల్చి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు అతడి థిక్ దోస్త్ సల్మాన్‌ఖాన్. ‘ఈ మధ్య ఆమిర్ తన ట్రాన్సిస్టర్ అమ్మేసి ఐప్యాడ్‌తో తిరుగుతున్నాడు’ అంటూ బిగ్‌బాస్ షోలో నర్మగర్భంగా కామెంట్ చేశాడు కండల వీరుడు. ‘దూమ్ 3లో నేను ధరించినలాంటి హ్యాట్ పెట్టుకున్న సల్మాన్... మరి ఇప్పుడు పీకే పోస్టర్‌లో నాలా మారిపోతాడా’ అంటూ నవ్వుతూనే అడిగిన ఆమిర్‌కు కౌంటరే సల్మాన్ తాజా కామెంట్. ఇంతకీ ట్రాన్సిస్టర్ ట్విస్ట్ అర్థమైందా..! ‘పీకే’ పోస్టర్‌లో ఆమిర్ ఆచ్ఛాదనగా వాడుకున్నది.