
ఆల్ రూమర్స్!
బాలీవుడ్‌లో ప్రతిదీ రూమర్స్‌తోనే షురూ అవుతుందేమో! మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్‌ఖాన్ లేటెస్ట్ మూవీ ‘దంగాల్’ షూటింగ్ ఆరంభానికి ముందే క్రేజీ టాక్ తెచ్చేసుకుంటోంది. ఇందులో రెజ్లర్ పాత్ర పోషించనున్న ఆమిర్ తన పుట్టిన రోజు సందర్భంగా చిత్రానికి సంబంధించి కొన్ని వివరాలు వెల్లడించాడు.
ఇది ‘అవుటాఫ్ ది బాక్స్’ స్టోరీ అని, డిఫరెంట్ లేయర్స్‌లో క్యారెక్టర్స్ ఉంటాయని చెప్పాడు. ‘ఈ చిత్రం కోసం నేనూ ఎంతో ఉత్సుకతో ఎదురు చూస్తున్నా. ఓ తండ్రి అతని ఇద్దరు కూతుళ్ల మధ్య నడిచే కథ ఇది’ అన్న ఆమిర్... ఇందులో తాప్సీ, కంగనా రనౌత్, అక్షర హాసన్‌లు తన కూతుళ్లుగా నటిస్తున్నారన్న వార్తలను ఖండించాడు. అవన్నీ రూమర్లనీ, ఇంకా కాస్టింగ్ ఫైనలైజ్ కాలేదని చెప్పాడు!