
'అమిర్ పీకే చిత్రం అద్భుతంగా ఉంది'
న్యూఢిల్లీ:బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ నటించిన 'పీకే'చిత్రం సర్వత్రా ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా ఆ సినిమాను ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ వీక్షించారు. 'నేను పీకే చిత్రాన్ని పార్టీ సభ్యులతో కలిసి షహీబాబాద్ లో చూశాను. నిజంగా పీకే ఒక అద్భుతమైన చిత్రం'అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.
ఈ సందర్భంగా ఆ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకు, హీరో అమిర్ కు అభినందనలు తెలియజేశారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో బయట విందులతో పాటు సినిమాలకు కూడా దూరమైన సంగతి తెలిసిందే.ప్రస్తుతం కాస్త వెసులుబాటు దొరకడంతో కేజ్రీవాల్ మూవీలను వీక్షిస్తున్నారు.