
'పీకే' సినిమా పోస్టర్లు దగ్ధం
భోపాల్: బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్‌ఖాన్ నటించిన 'పీకే' సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. హిందూ మతాన్ని,ఆచారాలను కించపరిచారనే ఆరోపణలతో కాషాయ సంస్థలు మంగళవారం కూడా ఆందోళనలు చేపట్టాయి.
మధ్యప్రదేశ్ మాల్వా ప్రాంతంలోని నీముచ్ లో పీకే సినిమా ప్రదర్శనను నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు పోస్టర్లను చించేసి తగులబెట్టారు. కాషాయ జెండాలు చేబూని సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్ వద్దకు చేరుకున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. సినిమా ప్రదర్శనకు అంతరాయం కలగకుండా చూశారు.