భోపాల్ : హత్యలు, అత్యాచారాలు చేసిన నేరస్తులు జైలులోపల శిక్ష అనుభవించాల్సింది పోయి శాసన సభ్యులుగా అవతారమెత్తుతున్నారు. అధికార బలంతో శిక్షలు తగ్గించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తుండగా, అండ బలంతో దందాలు చేసేవారు మరికొందరు. తాజాగా మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల ట్రాక్ రికార్డు చూస్తే ఇవే విషయాలు గుర్తుకువస్తున్నాయి. శాసనసభకు ఎన్నికైన 230 మంది సభ్యుల్లో 94 మంది ప్రమాదకరమైన క్రిమినల్, హత్య కేసులు ఎదుర్కొంటున్న వారే.
వీరిలో 47 మందిపై మర్డర్ కేసులు, మహిళలపై అత్యాచార కేసులు ఇదివరకే రుజువైనాయి. అసోషియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫార్మ్ (ఏడీబీ) అనే సంస్థ చేపట్టిన ఓ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన 56 మంది (49శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలగా, బీజేపీకి చెందిన 34 మంది నేర చరిత్ర ఉన్నవారే అసెంబ్లీలో అడుగుపెట్టారు.
కొందరు ఎమ్మెల్యేలు మహిళలపై అత్యాచారం (ఐపీసీ సెక్షన్ 354, మహిళలపై వేధింపులు సెక్షన్ 498ఏ) వంటి కేసులను ఎదురుక్కొంటున్నారు. అంతేగాకా అసెంబ్లీకి ఎన్నికైన 230 మందిలో 187 (81శాతం) సభ్యులపై అవినీతి అరోపణలు ఉన్నట్లు తెలింది. ఆస్తుల్లో తామేమీ తక్కువ కానట్లు 80శాతం పైగా సభ్యులు కోటికి పైగా ఆస్తులు ఉన్నవారు చట్టసభకు ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment