
'పీకే'కు వినోద పన్ను మినహాయింపు
ఆగ్రా: ఆమిర్ఖాన్ 'పీకే' సినిమాకు ఉత్తరప్రదేశ్ పభుత్వం వినోదపన్ను మినహాయింపు ఇవ్వడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించారని విశ్వహిందూ పరిషత్, హిందూ జాగరణ మంచ్, భజరంగ్ దళ్ ధ్వజమెత్తాయి. వినోద పన్ను మినహాయింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి.
సమాజ్వాదీ పార్టీ నాయకులు, సామాజిక కార్యకర్తలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే 'పీకే' సినిమాలో ఎటువంటి తప్పులు లేవని, మతాన్ని దుర్వినియోగం చేస్తున్న వారిని గురించి ఇందులో చూపించారని బాబా రాందేవ్ అనుచరుడు వేద్ ప్రతాప్ వైదిక్ వ్యాఖ్యానించారు.