భారత దిగ్గజ స్క్వాష్ క్రీడాకారుడు బ్రిగేడియర్ రాజ్‌కుమార్ మన్‌చందా కన్నుమూశారు. ఆయన వయస్సు 79 ఏళ్లు కాగా... అనారోగ్య కారణాలతో ఢిల్లీలో మృతి చెందినట్లు మంగళవారం కుటుంబ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. రాజ్ మన్‌చందా మృతిపట్ల క్రీడాభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కాగా జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో విశేషంగా రాణించి భారత్‌కు పతకాలు అందించిన ఆయన స్క్వాష్‌లో విఖ్యాత ఆటగాడిగా ఎదిగారు. 33 ఏళ్ల వయసులో తొలిసారి జాతీయ చాంపియన్‌గా నిలిచిన ఆయన 1977 నుంచి 1982 వరకు వరుసగా టైటిళ్లను నిలబెట్టుకున్నారు.
రాజ్ తన కెరీర్‌లో ఓవరాల్‌గా 11 టైటిళ్లు సాధించారు. ఆసియా చాంపియన్‌షిప్ సహా పలు అంతర్జాతీయ టోర్నీలలో సత్తా చాటుకున్నారు. ఆయన ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 1983లో ‘అర్జున అవార్డు’ను అందజేసింది. 1980 దశకాన్ని శాసించిన జహంగీర్ ఖాన్‌ను 1981లో ఎదుర్కొన్న ఆయన పలు అంతర్జాతీయ టోర్నీలకు భారత స్క్వాష్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించారు.
కరాచీలో 1981లో జరిగిన ఆసియా టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ రజత పతకం సాధించింది. 1984 ఆసియా చాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానంలో నిలవడం ఆయన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కాగా... ఆ ఈవెంట్‌లో టీమ్ ఈవెంట్‌లో భారత్ కాంస్య పతకం గెలుచుకుంది.
ఆస్ట్రేలియాతోన్ టెన్నిస్ గ్రేట్ ఫ్రేజర్ మృతి
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో టెన్నిస్ దిగ్గజం నీల్ ఫ్రేజర్ మంగళవారం కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో 91 ఏళ్ల ఫ్రేజర్ మృతి చెందారు. తమ దేశం ఓ మేటి దిగ్గజాన్ని కోల్పోయిందని టెన్నిస్ ఆ్రస్టేలియా (టీఏ) తెలిపింది. 24 ఏళ్ల సుదీర్ఘ టెన్నిస్ కెరీర్‌లో ఫ్రేజర్ మూడు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లతో పాటు ప్రతిష్టాత్మక డేవిస్ కప్ టోర్నీలో వరుసగా నాలుగుసార్లు ఆస్ట్రేలియాను గెలిపించాడు.
1960లో జరిగిన వింబుల్డన్ ఫైనల్లో తమ దేశానికే చెందిన దిగ్గజం రాడ్ లేవర్‌ను ఓడించి టైటిల్ చేజిక్కించుకున్నారు. ఆ ఏడాది ఏకంగా 11 మేజర్ టైటిల్స్ (పురుషుల డబుల్స్) సాధించారు. అంతకుముందు ఏడాది (1959) యూఎస్ ఓపెన్‌లో టైటిళ్ల క్లీన్‌స్వీప్ చేశారు. సింగిల్స్, పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ మూడు ట్రోఫీలు కైవసం చేసుకున్నారు.
టెన్నిస్‌లో విజయవంతమైన, విశేష కృషి చేసిన ఆయన్ని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) 1984లో ‘టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్’లో చేర్చింది. 2008లో టెన్నిస్‌లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుగా అభివరి్ణంచే ‘ఫిలిప్ చాట్రియెర్’ అవార్డును ఫ్రేజర్‌కు ప్రదానం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment