సాక్షి, మంచిర్యాల : రాజీవ్ యువకిరణాలు అక్రమాలకు చిరునామాగా మారాయి. పలు ఏజెన్సీలు నిరుద్యోగులకు ఓ రంగంలో శిక్షణ ఇచ్చి.. మరో రం గంలో కిందిస్థాయి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఇంకొన్ని ఏజెన్సీలైతే ఉద్యోగాలు కల్పించకు న్నా, కల్పించినట్టు అధికారులను నమ్మంచి నిధులు పక్కదారి పట్టిస్తున్నాయి. ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం శిక్షణ కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తెచ్చినా నిర్వాహకులు అడ్డదారులు తొక్కుతున్నారు. శిక్షణ తీసుకున్న వారికి ఎక్కడ ఉపాధి కల్పించారో వివరాలు ఏజెన్సీలు సమర్పించడం లేదు. ఈ అవినీతిలో అధికారుల పా త్ర ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పేరు మారిన.. తీరు మార లేదు..
కుటుంబానికో ఉద్యోగం, వార్షికాదాయం రూ.60వేల నుంచి రూ.లక్ష వరకు పెంచాలనే లక్ష్యంతో 2005-06లోనే ప్రభుత్వం ఎంప్లాయీమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం) పథకం ప్రవేశపెట్టింది. పద్దెనిమిదేళ్ల నుంచి 30 ఏళ్ల వయస్సు ఉన్న నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగవకాశాలు కల్పిచాలని నిర్ణయించింది. కానీ ఆశించిన లక్ష్యం నెరవేరకపోవడంతో దీనిస్థానంలో 2011లో రాజీవ్ యువ కిరణాలు పథకాన్ని అమలు చేసింది. గ్రామీణ విద్యార్థుల కోసం నిర్వహించే కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతను డీఆర్‌డీఏ- ఐకేపీకు, అర్బన్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మోప్మాకు అప్పగించింది. కానీ, పథక నిర్వహణపై పర్యవేక్షణ లేకపోవడం, మెరుగైన శిక్షణ అందకపోవడంతో నిరుద్యోగులు ఉపాధి అవకాశాలకు నోచుకోవడం లేదు. అధికారుల అసమర్థతను ఆసరాగా చేసుకుని, పలు ఏజెన్సీలు బోగస్ విద్యార్థులను సృష్టించి డబ్బులు కాజేస్తున్నారు. గత నెలలో నిర్మల్‌లోని ఓ ఏజెన్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన పథక రాష్ట్ర క్వాలిటీ కం ట్రోల్ సెల్ బృందం ఈ అక్రమాన్ని గుర్తించిం ది. ఇతరుల వేలిముద్రలు, విద్యార్థుల సంఖ్య ఎక్కువ చూపుతూ డబ్బులు కాజేస్తునృ్నట్లు నిర్ధారించింది. దీంతో సదరు ఏజెన్సీకి బిల్లులు నిలిపేయాలని అధికారులను ఆదేశించింది.
16 కేంద్రాలు.. 641 మంది..
పస్తుతం డీఆర్‌డీఏ ఆధ్వరృ్యంలో జిల్లా పరిధిలోని పశ్చిమ ప్రాంతంలో ఆదిలాబాద్ న్యాక్‌లో ఫ్లంబింగ్, సానిటేషన్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, జనరల్ వర్క్స్ సూపర్‌వైజర్, నిర్మల్‌లోని సీఎంసీలో కంప్యూటర్ మెన్‌టేషన్, హార్డ్‌వేర్, టెలిసెల్స్, శ్రీ టెక్‌లో అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, స్కిల్‌ప్రోలో సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్, భైంసాలోని సింక్‌సర్వో, అపెక్‌లలో కంప్యూటర్ మెన్‌టేషన్, హార్డ్‌వేర్ రంగాల్లో 361 మంది నిరుద్యోగులు శిక్షణ పొందుతున్నారు. తూర్పు జిల్లా మంచిర్యాలలోని సాహితీ, డాటా ప్రో ఏజెన్సీలలో కంప్యూటర్ మెన్‌టేషన్, హార్డ్‌వేర్, ఐఐహెచ్‌ఎంలో హోటల్ మేనేజ్‌మెంట్, శ్రీటెక్‌లో అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, సీఎంసీ లో టెలిసెల్స్, కాగజ్‌నగర్ సీఎంసీలో టెలిసెల్స్ రంగాల్లో 280 మంది శిక్షణ పొందుతున్నారు. వీటితోపాటు ఐటీడీఏ పరిధిలో మరో మూడు కేంద్రాలున్నాయి. ఒక్కో కోర్సు కాలపరిమితి ఒక్కో విధంగా ఉంటుంది. కనీస కాలపరిమితి సెక్యూరిటీగార్డు శిక్షణకు 15 రోజులుంటే, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కోర్సుకు గరిష్టంగా 75 రోజులుంటుంది. ప్రతి విద్యార్థికి కోర్సును బట్టి బోధన కోసం రూ.2 వేల నుంచి రూ.7 వేల వరకు కేటాయిస్తుంది. దీంతోపాటు వారికి ఉచితంగా వసతి, భోజనం కోసం ప్రతి నెలా రూ.2,400లు విడుదల చేస్తోంది.
పక్కదారి పట్టిన లక్ష్యం
నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్న ఏజెన్సీలు వారికి ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమవుతున్నాయి.ఆయా కంపెనీలు ఇచ్చే వేతనం రూ. 6వేల లోపు ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో విద్యార్థులు పని వదిలేసి ఇంటి కి చేరుకుంటున్నారు. మరోపక్క పొందిన శిక్షణతో సంబంధం లేని ఉద్యోగాలు కల్పించడంతో చాలా మంది వెనుదిరుగుతున్నారు. దీంతో ప్రభుత్వం విద్యార్థుల వసతి, భోజనం, శిక్షణ కోసం పెట్టిన ఖర్చంతా వృథా అవుతోంది.
కేంద్రాలు రద్దు
అక్టోబర్ 19న అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో శిక్షణ ఇచ్చిన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఏజెన్సీ నిర్వాహకుల వైఫల్యంపై కలెక్టర్ అహ్మద్ బాబు మండిపడ్డారు. పథక ం అమలు పర్యవేక్షణలో అలసత్వం ప్రదర్శించిన డీపీఎం(జాబ్స్) యాదగిరిని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డిని ఆదేశించారు. ఇకపై పథకాన్ని తానే పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తానని హెచ్చరించారు.
పస్తుతం కొనసాగుతున్న కేంద్రాల గడువు పూర్తయిన తర్వాత 15 మంది జిల్లా అధికారులతో ‘ప్రేరణ’ కమిటీ ఏర్పాటు చేసి శిక్షణతోపాటు ప్రతీ యువతీయువకుడికి ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే ఐటీడీఏ పరిధిలో కొనసాగుతున్న మూడు కేంద్రాలు రద్దయ్యాయి. కలెక్టర్ మార్గదర్శకాలు అందిన వెంటనే మళ్లీ పునఃప్రారంభిస్తామని ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్(జాబ్స్) రాజ్‌కుమార్ తెలిపారు.
నిరాశ కిరణాలు
Published Tue, Nov 5 2013 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 12:16 AM
Advertisement
Advertisement