‘‘నాన్నగారు (కన్నడ స్టార్ రాజ్‌కుమార్), ఎన్టీఆర్, నాగేశ్వర రావు, శివాజీ గణేశన్, ఎంజీఆర్‌సార్లు బ్రదర్స్‌లా ఉండేవాళ్లు. ఆ వారసత్వాన్ని తర్వాతి తరంలో మేం ముందుకు తీసుకెళుతున్నాం. తారకరత్నగారిని వెళ్లి చూశాను. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’’ అన్నారు కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్. ఆయన నటించిన 125వ కన్నడ చిత్రం ‘వేద’. ఎ. హర్ష దర్శకత్వంలో శివ రాజ్‌కుమార్ భార్య గీత నిర్మించిన ఈ సినిమాని ‘శివ వేద’ పేరుతో వీఆర్ కృష్ణ మండపాటి ఈ నెల 9న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్, మంచి సందేశం ఉన్నాయి. నా తర్వాతి చిత్రాలను కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనూ ఒకేసారి విడుదల చేస్తానని మాట ఇస్తున్నా’’ అన్నారు.
‘కన్నడలో విడుదలైన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఫిబ్రవరి 9న తెలుగులో వస్తున్న ఈ వేధ సినిమా పాన్ ఇండియా లెవల్ లో బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment