గల్ఫ్‌లో సందడి చేయనున్న ‘బబ్రువాహన’ | babruvahana film released in gulf | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌లో సందడి చేయనున్న ‘బబ్రువాహన’

Published Thu, May 5 2016 3:08 PM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM

babruvahana film released in gulf

బెంగళూరు: డాక్టర్ రాజ్‌కుమార్ ద్విపాత్రాభినయంలో నటించిన అలనాటి చిత్రం ‘బబ్రువాహన గల్ఫ్‌లో కూడా సందడి చేయనుంది.  హుణసూరు కృష్టమూర్తి నిర్దేశకత్వంలో 70వ దశకంలో రూపొందించిన ఈ చిత్రం కన్నడ సినిమా రంగంలో కొత్త చరిత్రను సృష్టించిన విషయం విధితమే.

తిరిగి ఈ చిత్రాన్ని డిజిటల్ టెక్నాలజీ ద్వారా రంగుల్లోకి మార్చి కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 22న రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేసారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇప్పటి తరం అభిమానులు సైతం బ్రహ్మరథం పడుతున్నారు.

త్వరలో ఈ సినిమా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతుంది. విదేశాల్లో ఉన్న కన్నడ సినిమా అభిమానుల కోరిక మేరకు బబ్రువాహన సినిమాను గల్ఫ్ దేశాలైన దుబాయ్,షార్జా,అబుదాబి,ఓమన్,మస్కత్,సోహార్ తదితర దేశాలలో విడుదల చేయనున్నామని చిత్రవర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement