గల్ఫ్‌లో సందడి చేయనున్న ‘బబ్రువాహన’
బెంగళూరు: డాక్టర్ రాజ్‌కుమార్ ద్విపాత్రాభినయంలో నటించిన అలనాటి చిత్రం ‘బబ్రువాహన గల్ఫ్‌లో కూడా సందడి చేయనుంది. హుణసూరు కృష్టమూర్తి నిర్దేశకత్వంలో 70వ దశకంలో రూపొందించిన ఈ చిత్రం కన్నడ సినిమా రంగంలో కొత్త చరిత్రను సృష్టించిన విషయం విధితమే.
తిరిగి ఈ చిత్రాన్ని డిజిటల్ టెక్నాలజీ ద్వారా రంగుల్లోకి మార్చి కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 22న రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేసారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇప్పటి తరం అభిమానులు సైతం బ్రహ్మరథం పడుతున్నారు.
త్వరలో ఈ సినిమా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతుంది. విదేశాల్లో ఉన్న కన్నడ సినిమా అభిమానుల కోరిక మేరకు బబ్రువాహన సినిమాను గల్ఫ్ దేశాలైన దుబాయ్,షార్జా,అబుదాబి,ఓమన్,మస్కత్,సోహార్ తదితర దేశాలలో విడుదల చేయనున్నామని చిత్రవర్గాలు తెలిపాయి.