
రాజ్‌కుమార్ హీరోగా నటìంచి, నిర్మించిన చిత్రం ‘యాంటీ వైరస్’. సుభాష్ దర్శకతంలో ఎమ్.కె. క్రియేష¯Œ ్స సంస్థ నిర్మించింది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. హీరో, నిర్మాత రాజ్ కుమార్ బర్త్ డే సందర్భంగా బుధవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత ప్రపంచ పరిస్థితికి అద్దం పట్టేలా మా సినిమా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుంది. అందరూ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు. మా సినిమా కథ కూడా ఇదే’’ అన్నారు. అనూషా, నందిత హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కెమెరా: సబ్బి శ్రీనివాస్, సంగీతం: మురళీ లియోన్.
Comments
Please login to add a commentAdd a comment