Anti Virus
-
జాన్ మెకఫీ మృతి.. ముందే అనుమానించిన భార్య
వాషింగ్టన్: యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ ‘మెకఫీ’ సృష్టికర్త జాన్ మెకఫీ(75) బుధవారం స్పెయిన్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భార్య జానైస్ మెకఫీ కొన్ని రోజుల క్రితం చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది. ‘‘నా భర్త జైలులోనే మరణించాలని అమెరికా అధికారులు నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ ఏజెన్సీల్లో ఉన్న అవినీతి గురించి మాట్లాడితే.. ఏమవతుందో తెలిపేందుకు నా భర్త మృతిని ఉదాహరణగా చూపాలని భావిస్తున్నారు’’ అంటూ ఫాదర్స్ డే రోజున జానైస్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జానైస్ మెకఫీ ఫాదర్స్ డే సందర్భంగా జూన్ 20న చేసిన ట్వీట్లో ‘‘హ్యాపీ ఫాదర్స్ డే.. నీవు ఈ రోజును జైలులో గడుపుతున్నావు. నీ నిజాయతీ వల్లనే నీవు ఈ రోజు జైలులో ఉన్నావు. అవినీతి పరిపాలన సాగుతున్న చోట నీవు నిజాయతీగా ఉన్నావు. అదే నిన్ను ఇబ్బందుల్లో పడేసింది. అమెరికాలో నీకు న్యాయం జరుగుతుందని నేను భావించడం లేదు’’ అంటూ జానైస్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరలవుతోంది. జానైస్, జాన్‌లకు 2013లో వివాహం అయ్యింది. ఆమె వ్యక్తిగతం జీవితం గురించి ఎవరికి పెద్దగా తెలియదు. Happy Father's Day @officialmcafee. Though you are spending the day in prison know that you are loved and appreciated. #FreeJohnMcAfee #FreeMcAfee pic.twitter.com/YFmB36KWfb — Janice McAfee (@theemrsmcafee) June 20, 2021 -
విషాదం.. జైల్లోనే ‘మెక్అఫీ’ ఆత్మహత్య!
మరో మేధావి జీవితం విషాదంగా ముగిసింది. మెక్అఫీ యాంటీ వైరస్ సృష్టికర్త జాన్ మెక్అఫీ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అమెరికాలో పన్నుల ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న మెక్అఫీ.. కిందటి ఏడాది అక్టోబర్ నుంచిస్పెయిన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. బుధవారం ఆయన తన గదిలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. బార్సిలోనా: డెబ్భై ఐదేళ్ల మెక్అఫీ.. అమెరికన్ టెక్నాలజీ ఎంట్రెప్రెన్యూర్‌గా పేరుగాంచాడు. 80వ దశకంలో యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ మెక్ అఫీని కనిపెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడాయన. అయితే టెన్నెస్సెలో పన్నుల ఎగవేత, న్యూయార్క్‌లో క్రిప్టో కరెన్సీ మోసాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి.ఈ ఆరోపణల కేసులో అమెరికా నుంచి పారిపోయిన ఆయన్ని.. కిందటి ఏడాది అక్టోబర్‌లో స్పెయిన్ పోలీసులు అరెస్ట్ చేసి బార్సిలోనా జైలుకి తరలించారు. ఇక పన్నుల ఎగవేత ఆరోపణల కేసులో మెక్అఫీని అమెరికాకు అప్పగించే స్పెయిన్ కోర్టు బుధవారం నాడే కీలక తీర్పు వెలువరించింది. ఆయన్ని అమెరికాకు అప్పగించాలని స్పెయిన్ పోలీసులను ఆదేశించింది. ఈ తరుణంలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ‘అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉన్నా.. జైల్లో మగ్గేందుకు ఆయన మనసు అంగీకరించలేదు. సొసైటీ ఆయన మీద పగ పట్టింది’ అని ఆయన తరపు లాయర్ జవెయిర్ మీడియా ముందు భావోద్వేగంగా మాట్లాడాడు. 2011లో తన కంపెనీని ఇంటెల్‌కు అమ్మిన మెక్అఫీ.. ఆ తర్వాత వ్యాపారాలకు దూరంగా ఉంటూ విలాసవంతమైన జీవితం అనుభవిస్తూ వచ్చాడు. లోగడ తాను 48 మంది పిల్లలకు తండ్రి చెప్పి పెద్ద షాక్ ఇచ్చాడు. 2012లో పొరుగింటి వ్యక్తి హత్య కేసులో పోలీసుల ఎంక్వైరీ నుంచి తప్పించుకునేందుకు పారిపోయాడు. తన సిద్ధాంతాలకు విరుద్ధంగా పన్నులు కట్టలేనని చెబుతూ.. కొన్ని ఏళ్లపాటు పన్నులు చెల్లించలేదు. ఒకానొక టైంలో క్యూబా సాయంతో అమెరికా అధ్యక్ష బరిలో పోటీ చేయాలనుకున్నా.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ట్విటర్లో ఆయన ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఒక మేధావి జీవితం ఇలా విషాదంగా ముగియడంపై ఆయన అభిమానులు కలత చెందుతున్నారు. చదవండి: ఒకప్పుడు విజేత.. ఇప్పుడు అవమానంతో వీడ్కోలు -
యాంటీ వైరల్, ఫంగల్ డ్రగ్స్: ‘దొరికిన’వన్నీ డీఎంహెచ్‌ఓలకే!
సాక్షి, సిటీబ్యూరో: అసరమైన స్థాయిలో ఉత్పత్తి జరగట్లేదు... కేంద్రం ఇస్తున్న కోటా చాలట్లేదు... రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది... ఫలితంగా అనేక రకాలైన యాంటీ వైరల్, ఫంగల్ డ్రగ్స్‌కు భారీ డిమాండ్ వచ్చింది. దీన్ని సొమ్ము చేసుకోవడానికి అనేక మంది “బ్లాక్ దందాలు’ చేస్తున్నారు. వీరిపై నిఘా వేసి ఉంచుతున్న పోలీసులు పలువురిని అరెస్టు చేసి భారీగా ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకుంటున్నారు. వీటిని డీఎంహెచ్ఓల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా ఉండటంతోపాటు ఇటీవల కాలంలో బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఫలితంగా యాంటీ వైరల్, ఫంగల్ డ్రగ్స్‌తో కూడిన ఇంజెక్షన్లకు గతంలో ఎన్నడూ లేని విధంగా డిమాండ్ పెరిగింది. ఓపక్క ఇవి అవసరమైన వారిలో దాదాపు 90 శాతం మంది బ్లాక్‌లో పది నుంచి వంద రెట్లు ఎక్కువ ధరకు ఖరీదు చేస్తున్నారు. ఈ ఔషధాలను బ్లాక్ మార్కెట్ చేసే వాళ్లు మాత్రం వివిధ మార్గాల్లో తేలిగ్గా సమీకరించుకుంటున్నారు. ఇలాంటి దందా చేసే వారిపై ఇటు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, అటు సైబరాబాద్, రాచకొండకు చెందిన స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ (ఎస్వోటీ) నిఘా వేసి ఉంచుతున్నాయి. ఓ వైపు పక్కా సమాచారం, మరో వైపు డెకాయ్ ఆపరేషన్లు ద్వారా ఈ దందాలు చేసే వాళ్లను పట్టుకుంటున్నారు. రాజధానిలోని మూడు కమిషనరేట్లలో కలిపి సెకండ్ వేవ్ మొదలైన తర్వాత ఓ మహిళ సహా మొత్తం 86 మందిని పోలీసులు పట్టుకున్నారు. కీలక నిర్ణయం వీరి నుంచి 274 వరకు యాంటీ వైరల్, ఫంగల్ ఔషధాలతో కూడిన ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా ఏదైనా నేరానికి సంబంధించి పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసినప్పుడు వారి నుంచి సొత్తు లేదా వస్తువులు స్వాధీనం చేసుకుంటారు. నిబంధన ప్రకారం వీటిని సీజ్ చేసినట్లు పంచనామా రాసి రిమాండ్ రిపోర్టుతో సహా కోర్టుకు అప్పగిస్తారు. అయితే ఈ యాంటీ వైరల్, ఫంగల్ ఇంజెక్షన్ల విషయంలో మాత్రం పోలీసు విభాగం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయ శాఖ నుంచి అనుమతి తీసుకున్న అధికారులు ఇలా స్వాధీనం చేసుకున్న ఇంజెక్షన్లు ప్రభుత్వ ఆసుపత్రులకు చేరేలా కృషి చేస్తున్నారు. బ్లాక్ దందా చేస్తూ చిక్కిన నిందితులతో పాటు ఇంజెక్షన్లను టాస్క్‌ఫోర్స్, ఎస్వోటీలు స్థానిక పోలీసుస్టేషన్లకు అప్పగిస్తున్నారు. అప్పటి ఆ ఇంజెక్షన్లు పాడు కాకుండా ఫ్రిజ్‌లలో ఉంచి కాపాడుతున్నారు. పోలీసుస్టేషన్లో ఈ సీజ్ చేసి ఇంజెక్షన్లను ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. ఆ తర్వాత సదరు యాంటీ వైరల్, ఫంగల్ డ్రగ్స్‌ను స్థానికి డీఎంహెచ్ఓలకు అందించి రసీదు తీసుకుంటున్నారు. ఈ రసీదు, ఫొటోలు, వీడియోలు న్యాయమూర్తులకు అందిస్తున్నారు. ఆపై వీటిని జత చేస్తూ కోర్టుల్లో నిందితులపై అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. డీఎంహెచ్ఓలు ఈ ఇంజెక్షన్లను కోటా ప్రకారం ఆయా ప్రభుత్వ ఆసుపత్రులకు పంపి, అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు చేరుస్తున్నారు. దీనికి ముందు ఆ ఇంజెక్షన్ స్థితిగతులు, ఏ దశలో అయినా పాడైందా? తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ ఇంజెక్షన్లు నల్లబజారులోకి తరలకుండా ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని, అదే సమయంలో పట్టుబడిన వాటిలో కనీసం ఒక్కటి కూడా వృథా కాకుండా జాగ్రత్త పడుతున్నామని ఓ అధికారి తెలిపారు. స్వీధీనం చేసుకున్న వెంటనే వాటిని ఫ్రిజ్‌లలో అవసరమైన ఉష్టోగ్రతలో భద్రపరుస్తున్నామని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న ఇంజెక్షన్లను డీఎంహెచ్ఓలకు అందించే వరకు భద్రపరచడానికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఫ్రిజ్‌లను సమకూర్చుకున్నారు. వీటి బ్లాక్ మార్కెట్ దందాను కనిపెట్టడానికి సోషల్ మీడియా పైనా పోలీసులు నిఘా ఉంచారు. అలాంటి విక్రేతలపై సమాచారం ఉంటే తమకు తెలపాలని కోరుతున్నారు. బ్లాక్ ఫంగస్ బాధితులకు మందుల్లేవ్... సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ మహమ్మారిని జయించి బ్లాక్ ఫంగస్ బారిన పడిన రోగుల ప్రాణాలతో పలు కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు చెలగాటమాడుతున్నాయి. పైసలకు కక్కుర్తిపడి అడ్మిట్ చేసుకుని, సర్జరీలు చేస్తున్నాయి. ఆ తర్వాత చికిత్సకు అవ సరమైన లైపోజోమల్ ఆంపోటెరిసిన్–బీ ఇంజక్షన్లు లేవని చెప్పి బయటికి పంపుతున్నాయి. విధిలేని పరిస్థితుల్లో వారంతా చివరకు కోఠి ఈఎన్టీ, గాంధీ ఆçసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. నిజానికి చేర్చుకుని చికిత్సలు చేసిన ఆస్పత్రులే ఆయా రోగులకు అవసరమైన మందులను కూడా సమకూర్చాల్సి ఉంది. కేవలం సర్జరీలు చేసి, ఆ తర్వాత మీ చావు మీరు చావండంటూ పట్టించుకోకుండా వదిలేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో వీరంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి దరఖాస్తు చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 700 మందికిపైగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. నిత్యం 50 మందికిపైగా... ఈఎన్టీ అవుట్ పేషంట్ విభాగానికి రోజుకు సగటున 250 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు వస్తున్నారు. వీరిలో 50–60 మందికి ఇన్పేషెంట్లుగా అడ్మిషన్ అవసరమవుతుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో 240 మంది ఇన్పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. వీరిలో 25 మందికి సర్జరీ చేశారు. మరో 50 నుంచి 60 మంది వరకు అడ్మిషన్ కోసం ఎదురుచూస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో 102 మంది కోవిడ్ పాజిటివ్ బ్లాక్ ఫంగస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. -
ట్రెండింగ్‌లో యాంటీవైరస్ టిఫిన్ సెంటర్
భువనేశ్వర్: కరోనా వైరస్ మన జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. అతి శుభ్రత ప్రతి ఒక్కరి జీవితంలో భాగమయ్యింది. ఇందుకు అనుగుణంగానే నిత్యవసరాలన్ని యాంటీ వైరస్ ట్యాగ్ తగిలించుకుంటున్నాయి. పీల్చే గాలి, తినే తిండి, తాగే నీరు ఇలా ప్రతిదాన్ని వైరస్ ఫ్రీ అంటూ ప్రకటనలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ టిఫిన్ సెంటర్ తెగ వైరలవుతోంది. ఎందుకంటే దాని పేరు యాంటీ వైరస్ టిఫిన్ సెంటర్ కావడంతో అందరి దృష్టి ఆకర్షిస్తుంది. రెడిట్ యూజర్ ఒకరు ఇందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఓడిశా బెర్హంపూర్, గాంధీనగర్ మెయిన్ రోడ్డులో ఈ యాంటీవైరస్ టిఫిన్ సెంటర్ ఉంది. ఇక దీని మెను బోర్డు మీద ఇడ్లీ, దోశ, వడ, పూరి, పకోడా వంటి అన్ని రకాల టిఫిన్లు లభిస్తాయి అని ఉంది. లివ్ ఆప్ ద ట్రెండ్ అనే క్యాప్షన్ మెను బోర్డ్ మీద ఉంది. ఇక పలువురు అక్కడ నిల్చూని టిఫిన్ చేస్తున్నారు. కూర్చీలు వంటివి ఏం లేవు. ఇక ఈ ఫోటో చూసిన నెటిజనులు రకరకాలుగా కామెంట్ చేయడం ప్రారంభించారు. ఇక యాంటీ వైరస్ అనే పేరు వినగానే తాము ఇక్కడ ఎంతో శుభ్రంగా, శుచిగా ఉంటుందని భావించాము.. కానీ కనీసం కూర్చీలు కూడా లేవు ఇదేంటి అని కామెంట్ చేశారు. మరో సెక్షన్ మాత్రం ‘యాంటీ వైరస్ అంటే అతడు భోజనంలో శానిటైజర్ కలపడనే ఆశిస్తున్నాను’.. ‘ఇక్కడ కేవలం గ్రేడ్ ఏ బ్లీచ్ మాత్రమే కలుపుతారు’.. ‘వంట మాస్టర్ మూతికి మాస్క్, చేతులకు గ్లౌజులు లేకుండా వంట చేస్తే.. సర్వర్లు మాస్క్, గ్లౌజులు ధరించకుండా చాలా శుభ్రంగా తెచ్చి మనకు వడ్డిస్తారు’.. ‘అదృష్టం బాగుంటే వంట మాస్టర్ ఆహారాన్ని మరింత శుభ్రంగా మార్చడం కోసం తన వెంట్రుకలను కూడా త్యాగం చేయవచ్చు’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా యాంటీ వైరస్ పేరుతో ఉన్న ఈ హోటల్ పలువురి దృష్టిని ఆకర్షిస్తున్న మాట మాత్రం వాస్తవం. -
యాంటీ వైరస్
రాజ్‌కుమార్ హీరోగా నటìంచి, నిర్మించిన చిత్రం ‘యాంటీ వైరస్’. సుభాష్ దర్శకతంలో ఎమ్.కె. క్రియేష¯Œ ్స సంస్థ నిర్మించింది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. హీరో, నిర్మాత రాజ్ కుమార్ బర్త్ డే సందర్భంగా బుధవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత ప్రపంచ పరిస్థితికి అద్దం పట్టేలా మా సినిమా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుంది. అందరూ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు. మా సినిమా కథ కూడా ఇదే’’ అన్నారు. అనూషా, నందిత హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కెమెరా: సబ్బి శ్రీనివాస్, సంగీతం: మురళీ లియోన్. -
డ్రగ్ దందా: 30 వేల మందు లక్షకు అమ్మకం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో కలకలం రేపిన యాంటీ వైరల్ డ్రగ్స్ దందాపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఢిల్లీ, చెన్నై, గుజరాత్ల నుంచి అక్రమంగా డ్రగ్‌ను సరఫరా చేసినట్లు విచారణలో తెలిసింది. డీలర్లు నుంచి రూ.30 వేలకు కొనుగోలు చేసిన ముఠా ఆ డ్రగ్‌ను రూ.లక్షకు అమ్ముతున్నట్లు విచారణలో వెల్లడైంది. కరోనా యాంటీ వైరల్ మెడిసిన్ విక్రయించేందుకు ముఠా సభ్యులు విమానాల్లోను ప్రయాణం చేశారు. కాగా బ్లాక్ మార్కెట్లో కోవిడ్ డ్రగ్ విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఠా సభ్యుడు గగన్ ఖురానాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం విచారించగా పలు విషయాలను వెల్లడించాడు. ఆక్ట్‌మ్రా, కోవిఫర్ మందులను చెన్నై, హైదరాబాద్‌లో ముఠా అమ్మకాలు నిర్వహించింది. అంతేకాకుండా యాంటీవైరల్ డ్రగ్స్ మాఫియా వెనకాల రెండు ప్రైవేట్ ఆస్పత్రుల హస్తం ఉన్నట్లు సమాచారం. (బ్లాక్ మార్కెట్లో యాంటీ వైరల్ డ్రగ్స్) ఈ నేపథ్యంలో ముఠా సభ్యులు చెప్పిన రెండు ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. డాక్టర్ల పేరుపై కరోనా యాంటీవైరస్ డ్రగ్ తెప్పించి.. రూ.30 వేల విలువైన డ్రగ్‌ను లక్షా 20 వేలకు విక్రయిస్తున్నారు. అలాగే రూ.5 వేల విలువైన డ్రగ్‌ను 50 వేలకు అమ్ముతున్నట్లు తేలింది. ఆస్పత్రికి వచ్చిన డ్రగ్‌ను బ్రోకర్ల ద్వారా బ్లాక్ మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు నిందితులు చెబుతున్నారు. దీనిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు. ముఠా సభ్యుల నుంచి 35.5 లక్షల రూపాయల విలువ చేసే మెడిసిన్ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. మందుల విషయంలో ఫార్మ కంపెనీల డిస్టిబ్యూటర్స్, మెడికల్ రిప్రజెంటెటివ్స్, మెడికల్ షాపు యజమానులు జాగ్రత్తగా ఉండాలని పోలీసు కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు. -
కరోనాపై ఈ మందుల ప్రభావం ఎంత ?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ దేశంలో రోజు రోజుకు విస్తరిస్తుండడంతో మళ్లీ లాక్డౌన్ తప్పకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. కేసులు ఎక్కువగా ఉన్న చెన్నైలో మరోసారి లాక్డౌన్ విధించారు. కరోనా విరుగుడికి వ్యాక్సిన్ అందుబాటులోకిరాని ప్రస్తుత పరిస్థితుల్లో అత్యయిక పరిస్థితుల్లో ‘యాంటీ వైరస్’ మందుల ఉత్పత్తికి, వాడకానికి కేంద్రం అనుమతి ఇవ్వడం కొంతలో కొంత మంచిదే. సిప్లా లిమిటెడ్, హెటరోడ్రగ్స్కు యాంటీ వైరస్ డ్రగ్ ‘రెమ్‌డిసివర్, ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్క్ కంపెనీకి ‘ఫెవిపిరావిర్’ ఉత్పత్తి, మార్కెటింగ్‌లకు అనుమతి లభించింది. మరికొన్ని రోజుల్లో కరోనా వైరస్ చికిత్స కోసం ఈ మందులు వైద్యులకు అందుబాటులోకి రానున్నాయి. ఇంతకుముందు ఈ మందులను ఎందుకోసం వాడేవారు ? వాటి ఫలితాలేమిటీ ? కరోనా వైరస్ చికిత్సకు వాడితే ఫలితాలేమిటీ? అన్న అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. (‘కరోనా వైరస్ బలహీనపడుతోంది’) ఢిల్లీలోని మాక్స్ హెల్త్‌కేర్‌లో ఇంటర్నెల్ మెడిసిన్‌లో అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేస్తోన్న రొమ్మెల్ టికూ కథనం ప్రకారం జపాన్‌లో అనేక సంవత్సరాలపాటు ‘ఇన్‌ఫ్లూయెంజా’ చికిత్సకు ఫెవిపిరావర్ను వాడారు. ఆ తర్వాత ఎబోలా వైరస్ చికిత్సకు పలు దేశాల్లో వాడారు. భారత్, చైనా, జపాన్ దేశాల్లో ఈ మందు వినియోగంపై కనీసం 30 ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఈ డ్రగ్‌ను చైనా, జపాన్, రష్యా, యుఏఈ దేశాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వాటి ఫలితాలకు సంబంధించిన డేటా మాత్రం అందుబాటులో లేదు. ఫెవిపిరావర్ డ్రగ్‌పై మూడవ దశ పరీక్షలకు గ్లెన్‌మార్క్‌ను అనుమతి లభించినందున దాని ప్రయోగాలు ఆశాజనకంగానే ఉండవచ్చు. కోవిడ్ కేసుల్లో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఈ డ్రగ్‌ను వాడాలని డ్రగ్ కంట్రోలర్ విధించిన షరతు ఇక్కడ గమనార్హం. (దేశంలో కరోనా వైరస్ విజృంభణ) ఇక రెమ్‌డెసివర్ డ్రగ్‌ను కోవిడ్ రోగులపై ప్రయోగించిందీ ఎక్కువగా అమెరికాలో. ఆ మందు వాడడం వల్ల 15 రోజుల్లో కోలుకోవాల్సిన వారు 11 రోజుల్లో కోలుకున్నారని, ఈ మందు వాడక ముందు కరోనా రోగుల్లో 11 శాతం మరణించగా, ఈ మందును వాడడం మొదలు పెట్టాక మరణాల సంఖ్య 8 శాతానికి తగ్గింది. మరణాలను కనీసం సగానికి సగం తగ్గించడంలో విఫలమైన ఈ డ్రగ్ వల్ల ఆశించిన ఫలితాలు ఉండే అవకాశం లేదని డాక్టర్ రొమ్మెల్ టికూ అభిప్రాయపడ్డారు. (కరోనా ఔషధం : పతంజలి కొత్త ట్విస్టు) -
కరోనా కట్టడి: చిగురిస్తున్న ఆశలు
హ్యూస్టన్: ప్రాణాంతక ఎబోలా వైరస్ చికిత్సలో ఉపయోగించే రెమిడిస్‌విర్ మందు కోవిడ్ రోగులపై జరగుతున్న క్లినికల్ ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మరిన్ని ప్రయోగాలు పూర్తయితేగానీ ఈ మందును కోవిడ్ చికిత్సకు సిఫారసు చేసే అవకాశాల్లేవు. టెక్సస్‌లోని హ్యూస్టన్ మెథాడిస్ట్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు వెల్లడించిన దాని ప్రకారం.. అప్పుడప్పుడే వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న వారికి రెమిడిస్‌విర్ మందును ఇచ్చారు. రెమిడెస్‌విర్‌ను ఎబోలా వైరస్‌కు చికిత్స కల్పించేందుకు తయారు చేశారు. చైనాలో జరిగిన అధ్యయనంలోనూ ఈ మందు కోవిడ్ బాధితులకు సాంత్వన చేకూరుస్తున్నట్లు స్పష్టమైంది. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ఇటీవల ఒక పరిశోధన వ్యాసం ప్రచురిస్తూ రెమిడిస్‌విర్ తీసుకున్న కోవిడ్–19 బాధితుడు 24 గంటల్లోనే మెరుగైన ఆరోగ్య స్థితికి వెళ్లడాన్ని వివరించింది. కాగా, ఈ ఏడాది అక్టోబర్ నాటికి కోవిడ్-19కు వ్యాక్సిన్ వచ్చే అవకాశముందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సినోలజీ ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ ప్రకటించారు. వచ్చే నెలకల్లా 500 మందిపై కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. 18– 55 ఏళ్ల వారిని ఈ ప్రయోగం కోసం ఎంపిక చేసి, ప్రాథమికంగా పరీక్షిస్తారని బ్లూమ్‌బెర్గ్ సంస్థ తెలిపింది. 2020 అక్టోబర్ నాటికి అన్నీ అనుకూలిస్తే ఈ పరిశోధనల ద్వారా మంచి ఫలితాలు రావొచ్చనీ, భారీస్థాయిలో వ్యాక్సిన్‌ను తయారుచేసే సామర్థ్యాన్ని సాధిస్తామని గిల్బర్ట్ తెలిపారు. 1994 నుంచి యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లో గిల్బర్ట్ వ్యాక్సిన్లపై అధ్యయనం చేస్తున్నారు. మరోవైపు కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. తాజా సమాచారం కరోనా బాధితుల సంఖ్య 25 లక్షలు దాటగా, మృతుల సంఖ్య లక్షా 70 వేలు దాటింది. కోవిడ్ సోకి ఇప్పటివరకు 658,956 మంది కోలుకున్నారు. చదవండి: కరోనాకు ముందే దారుణ పరిస్థితులు! -
వెబ్ బ్రౌజర్లకు ‘ఫైర్‌బాల్’ ముప్పు
న్యూఢిల్లీ: ఫైర్‌బాల్ అనే వైరస్ వెబ్ బ్రౌజర్లపై దాడి చేసి సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తోందనీ, ఇంటర్నెట్ వాడకందార్లు జాగ్రత్తగా ఉండాలని సైబర్ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు పాతిక రూపాల్లో ఈ వైరస్ విస్తరిస్తోందని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సెర్ట్–ఇన్) తెలిపింది. సైబర్ నేరగాళ్లు వినియోగదారుడికి సంబంధించిన యూజర్‌నేమ్‌లు, పాస్వర్డ్లు తదితర సమాచారాన్ని చోరీ చేయడంతోపాటు వెబ్ ట్రాఫిక్‌ను తప్పుదారి పట్టించి ప్రకటనల ద్వారా ఆదాయం పొందుతున్నారని సెర్ట్–ఇన్ పేర్కొంది. సైబర్ భద్రత సంస్థ చెక్‌పాయింట్ ఈ యాడ్వేర్ వైరస్ గురించి వివరిస్తూ చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు దీనిని అభివృద్ధి చేశారనీ, బ్రౌజర్లలో నకిలీ సెర్చింజన్లను ప్రవేశపెట్టి వినియోగదారులు తప్పుడు వెబ్‌సైట్స్‌కు వెళ్లేలా చేస్తోందని తెలిపింది. ఈ వైరస్ ప్రభావం భారత్‌లోనే అత్యధికంగా ఉందనీ, మన దేశంలోని 2.53 కోట్ల కంప్యూటర్లు ఈ వైరస్ బారిన పడ్డాయని చెక్‌పాయింట్ వెల్లడించింది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలావరకు యాంటీ వైరస్ అప్లికేషన్లు ఫైర్‌బాల్‌ను గుర్తించి, సమర్థవంతంగా నిరోధించగలుగుతున్నాయనీ, వినియోగదారులందరూ యాంటీవైరస్ సాఫ్ట్వేర్లను అప్డేట్ చేసుకోవాలని సెర్ట్–ఇన్ సూచించింది. బ్రౌజర్లలో వినియోగదారుడి అనుమతి లేకుండానే వివిధ ప్లగిన్లు ఇన్స్టాల్ కావడం, హోం పేజీలు, సెర్చింజన్లు మారిపోవడం వంటివి జరుగుతుంటే జాగ్రత్తపడాలని పేర్కొంది. వెంటనే ఆ ప్లగిన్లను అన్ఇన్స్టాల్ చేయాలనీ, బ్యానర్లు, పాప్–అప్లు, యాడ్ నోటిఫికేషన్లపై క్లిక్ చేయకూడదని హెచ్చరించింది.