
నా భర్త జైలులోనే మరణించాలని అమెరికా అధికారులు భావస్తున్నారు
వాషింగ్టన్: యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ ‘మెకఫీ’ సృష్టికర్త జాన్ మెకఫీ(75) బుధవారం స్పెయిన్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భార్య జానైస్ మెకఫీ కొన్ని రోజుల క్రితం చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది. ‘‘నా భర్త జైలులోనే మరణించాలని అమెరికా అధికారులు నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ ఏజెన్సీల్లో ఉన్న అవినీతి గురించి మాట్లాడితే.. ఏమవతుందో తెలిపేందుకు నా భర్త మృతిని ఉదాహరణగా చూపాలని భావిస్తున్నారు’’ అంటూ ఫాదర్స్ డే రోజున జానైస్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
జానైస్ మెకఫీ ఫాదర్స్ డే సందర్భంగా జూన్ 20న చేసిన ట్వీట్‌లో ‘‘హ్యాపీ ఫాదర్స్ డే.. నీవు ఈ రోజును జైలులో గడుపుతున్నావు. నీ నిజాయతీ వల్లనే నీవు ఈ రోజు జైలులో ఉన్నావు. అవినీతి పరిపాలన సాగుతున్న చోట నీవు నిజాయతీగా ఉన్నావు. అదే నిన్ను ఇబ్బందుల్లో పడేసింది. అమెరికాలో నీకు న్యాయం జరుగుతుందని నేను భావించడం లేదు’’ అంటూ జానైస్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరలవుతోంది. జానైస్, జాన్‌లకు 2013లో వివాహం అయ్యింది. ఆమె వ్యక్తిగతం జీవితం గురించి ఎవరికి పెద్దగా తెలియదు.
Happy Father's Day @officialmcafee. Though you are spending the day in prison know that you are loved and appreciated. #FreeJohnMcAfee #FreeMcAfee pic.twitter.com/YFmB36KWfb
— Janice McAfee (@theemrsmcafee) June 20, 2021