john mcafee
-
మియామీ బిల్డింగ్ దుర్ఘటనలో కుట్ర కోణం.. జాన్ మెక్‌అఫీతో లింక్!!
ఫ్లోరిడా: మియామీలో బహుళ అంతస్తుల భవనం అపార్ట్మెంట్లు కుప్పకూలడం పెనువిషాదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా.. ఇప్పటికే శకలాల నుంచి ఐదు మృతదేహాల్ని వెలికి తీశారు. మరో 156 మంది ఆచూకీని అధికారులు ధృవీకరించాల్సి ఉంది. అయితే ఈ విషాద ఘటనలో కుట్ర కోణం దాగుందని కొందరు భావిస్తున్నారు. టెక్ దిగ్గజం జాన్ మెక్‌అఫీతో ఈ ఘటనకు ముడిపెడుతూ.. పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మెక్అఫీ యాంటీ వైరస్ సృష్టికర్త జాన్ మెక్అఫీ ఈమధ్యే జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలిసిందే. అయితే చనిపోయే ముందు ఆయనొక ఇంపార్టెంట్ ట్వీట్ చేశాడని.. దానిని తెరమీదకు తెచ్చారు కొందరు. ‘‘నాకేదైనా జరిగితే.. ఫ్లోరిడా సర్ఫ్సైడ్ మియామీ బీచ్ కొల్లిన్స్ అవెన్యూలో ఉన్న కాంప్లెక్స్‌లో 31 టీబీ సైజులో ఉన్న ఫైల్స్ ఉన్నాయని, అందులో అమెరికా ప్రభుత్వపు అవినీతి సమాచారం ఉంద’ని ఆ ట్వీట్లో జూన్ 8న పేర్కొన్నాడాయన. ఆ తర్వాత వారానికి ఆయన చనిపోయాడు. మెక్అఫీ చనిపోయిన రెండు రోజులకే 55 అపార్ట్మెంట్లతో కూడిన మియామీ బిల్డింగ్‌లో 55 అపార్ట్మెంట్ల భాగం కుప్పకూలింది. దీంతో ఆయన చావుకి.. ఆ దుర్ఘటనకు సంబంధం ఉందనే వాదన తెరపైకి వచ్చింది. ట్వీట్ ఫేక్? డిలీట్ చేశారా? నిజానికి మెక్అఫీ ఆ ట్వీట్ 2019లో చేశాడనేది కొందరి వాదన. ‘ప్రభుత్వ అవినీతికి సంబంధించిన సమాచారం నా దగ్గర ఉంది. సీఐఏలో ఉన్న అవినీతి ఏజెంట్, ఇద్దరు బహైమన్ అధికారుల పేర్లతో ఆ చిట్టాను రిలీజ్ చేస్తా. నేను కనిపించకుండా పోయినా.. అరెస్టయినా 31 టెర్రాబైట్స్ ఉన్న డేట్.. మీడియాకు రిలీజ్ అవుతుందని చెబుతూ 2019లో ఓ ట్వీట్ చేశాడని కొందరు అంటున్నారు. ఈ విషయాన్ని జాన్ సిల్వా ఎన్బీసీటీ ట్విటర్ అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. అలాగే కుట్ర కోణంలో ఎలాంటి ధృవీకరణ లేదని, అసలు ఆ అపార్ట్మెంట్లో మెక్అఫీకి ఎలాంటి అపార్ట్మెంట్ లేదని వెల్లడించాడు. అయితే 2020కి ముందు మెక్అఫీ అకౌంట్లోని ట్వీట్లన్ని డిలీట్ అయ్యి ఉన్నాయి. మరి అవి ఆయన డిలీట్ చేశాడా? లేదంటే నిజంగానే ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా? నిజంగానే కుట్ర కోణం ఉందా? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. ఐదు మృతదేహాల వెలికితీత ఇక మియామీ అపార్ట్మెంట్లో ఓ పోర్షన్ కుప్పకూలిన ఘటనలో ఐదు మృతదేహాలను రెస్క్యూ టీంలు వెలికితీశాయి. మరో 156 మంది ఆచూకీని నిర్ధారించాల్సి ఉంది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేకపోయినా.. భూమిలో సముద్రపు అలల వల్ల పునాదులు కొట్టుకుపోయాయని గతంలో నివేదికలు ఇచ్చాయని పలువురు ప్రస్తావిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ప్రమాదపు కారణాల్ని దృవీకరించాల్సి ఉంది. చదవండి: మెక్అఫీ మరణం.. ముందే అనుమానించిన ఆమె -
70 ఏళ్ల వయసులో 17 ఏళ్ల అమ్మాయితో పారిపోయి..
ఆయన ప్రసిద్ధ కంప్యూటర్ సైంటిస్ట్. యాక్టివిస్ట్. వ్యాపార వేత్త. క్రిప్టో కరెన్సీ సమర్థకుడు. పుస్తక రచయిత. ఇన్ని కోణాలున్న ఆయన సృష్టించిన ‘మెకాఫే యాంటీ వైరస్’ సాఫ్ట్వేర్ పేరు కంప్యూటర్లు వాడే అందరికీ తెలుసు. అమెరికా అధ్యక్ష పదవికి రెండుసార్లు ఆరాటపడ్డ జాన్ మెకాఫేది చెప్పాలంటే చాలానే ఉన్న జీవితం. ఏకంగా చిత్రంగా తెరకెక్కిన జీవితం. ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్ ఈ స్థాయికి రావడం కనీవినీ ఎరుగని చరిత్ర. బార్సిలోనా జైలులో నవమాసాలుగా గడు పుతూ, డెబ్భై ఆరో ఏట ఈ జూన్ 23న నిర్జీవుడై కనిపించే వరకు మెకాఫే తనదైన పద్ధతిలో జీవించిన భోగి. ఆయన చేసిన ప్రతీదీ ఓ వార్తే. క్రిప్టో కరెన్సీని సమర్థించారు. పన్నులు చెల్లించేదేమిటని ధిక్కరించారు. డ్రగ్స్ తీసుకున్నారు. తుపాకీ చేతపట్టారు. వనితలతో కలసి విశృంఖలంగా విహరించారు. విగ్రహారాధనను వ్యతిరేకించారు. వివాదాలతో వీధికెక్కారు. చివరకు ఆత్మహత్య అంటున్న ఆయన అర్ధంతర మరణమూ సంచలన వార్తయింది. పన్ను ఎగవేత కేసుల్లో ఆయనను అమెరికాకు అప్పగించడానికి అనుమతిస్తూ స్పెయిన్ కోర్టు ఉత్తర్వు లిచ్చిన కాసేపటికే మెకాఫే జీవితం జైలులో ముగిసింది. సాహసాలన్నా, రహస్యాలన్నా ఇష్టమన్న ఆయన చాలా దుస్సాహసాలే చేశారు. సైద్ధాంతిక కారణాలతో 8 ఏళ్లుగా ఆదాయపు పన్ను ఎగ్గొట్టానని 2019లో ఆయనే చెప్పారు. అప్పటినుంచి అమెరికా న్యాయవిచారణను తప్పించుకోవడం కోసం కాందిశీకుడిగా కాలం గడిపారు. ఓ విలాసవంతమైన నౌకలో కాలక్షేపం చేశారు. భార్య, నాలుగు కుక్కలు, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, ఏడుగురు సిబ్బంది– ఇదే ఆ నౌకలో ఆయన ప్రపంచం. ‘‘స్త్రీలంటే పడిచచ్చే ప్రేమికుణ్ణి’’ అంటూ తనను అభివర్ణించుకున్న ఆయన కనీసం 47 మంది పిల్లల పుట్టుకకు కారణం. మూడేళ్ళ క్రితం ఆయనే ఆ మాట చెప్పు కున్నారు. తెర వెనుక కథలెన్నో ఒప్పుకున్నారు. ఏడు పదులు దాటిన వయసులో పదిహేడేళ్ళ అమ్మాయితో కలసి, ఇంటి నిండా ఆయుధాలతో పోలీసుల కంటపడి పారిపోయారు. డబ్బు, పేరుప్రతిష్ఠలు, వివాదాలు– మెకాఫే చుట్టూ వైఫైలా తిరిగాయి. 1987లో ప్రపంచంలో తొలి కమర్షియల్ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఆరంభించింది మెకాఫేనే! ఇవాళ్టికీ ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల పైచిలుకు మంది వాడుతున్న సాఫ్ట్వేర్ అది. పదేళ్ళ క్రితమే ఆ సంస్థను ‘ఇన్టెల్’కు అమ్మే సినా, ఆ సాఫ్ట్వేర్ మాత్రం ఇప్పటికీ మెకాఫే పేరుతోనే ప్రపంచ ప్రసిద్ధం. ఒకప్పుడు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ సహా జిరాక్స్ లాంటి సంస్థల్లో పనిచేశారీ బ్రిటిష్–అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్. కాలక్రమంలో ఆయన సంపాదన కూడా అపారమైంది. ‘క్రిప్టోకరెన్సీ గురు’గా మారిన ఆయన రోజుకు వేల డాలర్లు సంపాదించారు. ఈ క్రిప్టో కరెన్సీలు, కన్సల్టింగ్ పనులు, నిజ జీవితకథ హక్కుల విక్రయం– ఇలా అనేక విధాలుగా ఆయన లక్షల డాలర్లు ఆర్జిం చారు. చివరకొచ్చేసరికి జైలులోనే జీవిత చరమాంకం గడిచి పోతుందని భయపడి, జీవితం ముగించారు. వివాదాస్పద వ్యాఖ్యల మెకాఫేకు ట్విట్టర్లో ఏకంగా 10 లక్షలమంది ఫాలోయర్లున్నారు. దాన్నిబట్టి ఆయన పెంచు కున్న ప్రాచుర్యం అర్థం చేసుకోవచ్చు. మెకాఫే పుట్టింది బ్రిటన్‌లో అయినా, అమెరికా అధ్యక్ష పదవికి ఒకటికి రెండు సార్లు నామినీగా నిలబడాలని ప్రయత్నించడం మరో కథ. లిబర్టేరియన్ పార్టీ పక్షాన అధ్యక్ష పదవికి పోటీ చర్చల్లోనూ పాల్గొన్న గతం ఆయనది. ‘గంజాయి వాడకాన్ని నేరంగా పరిగణించరాదు... ప్రభుత్వం సైజు తగ్గించాలి... అహింసాత్మక నేరాలకు పాల్పడ్డ వారందరినీ జైలులో నుంచి విడుదల చేయాలి...’ ఇదీ అప్పట్లో ఆయన వాదన. అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడాలనుకొనే స్థాయికి వెళ్ళిన ఆ వ్యక్తి, ఇస్తాంబుల్‌కు పారిపోతుండగా బార్సి లోనా విమానాశ్రయంలో పట్టుబడి, జైలుగోడల మధ్య నిరాశలో మగ్గడం ఊహకందని జీవిత వైకుంఠపాళీ. (జాన్ మెకఫీ మృతి.. ముందే అనుమానించిన భార్య) మెకాఫే ఎంతో సంపాదించారు. రియల్ ఎస్టేట్ మొదలు హెర్బల్ యాంటీ బయాటిక్స్, బిట్‌కాయిన్ మైనింగ్– ఇలా ఎన్నో వ్యాపారాల్లో వేలుపెట్టారు. 2007 నాటి అమెరికా ఆర్థిక సంక్షోభంలో ఎంతో పోగొట్టుకున్నారు. జీవితం ఆఖరి ఘట్టంలో ఆయన ఆస్తులన్నీ జప్తయ్యాయి. ఏ తంటా వస్తుందో ఏమోనన్న భయంతో స్నేహితులు జారుకున్నారు. మెకాఫే చేతి కింద ఎవరూ, చేతిలో ఏమీ లేని ఒంటరి అయ్యారు. అయినా సరే జీవితంలో చేసిన తప్పొప్పులకు విచారం లేదనేవారు. ‘నాలో ఉదారతా ఉంది. అప్రమత్తతా ఉంది. హాస్యప్రియత్వమూ ఉంది. అన్నిటికీ మించి వేప కాయంత వెర్రీ ఉంది’ అనేవారు. జీవితంలోని విభిన్న రుచులు, అభిరుచుల మిశ్రమం కాబట్టే, మెకాఫే జీవితం ఓ సినిమాస్టోరీ. ఆయనపై ‘గ్రింగో: ది డేంజరస్ లైఫ్ ఆఫ్ జాన్ మెకాఫే’ అంటూ అయిదేళ్ళ క్రితం ఓ డాక్యుమెంటరీ చిత్రం వచ్చింది. అనేక ప్రభుత్వాలతో తలపడి, జీవిత చరమాంకంలో పారిపోతూ, ప్రవాసంలో గడిపిన మెకాఫే జీవితం ఎన్నో పాఠాలు చెబుతుంది. మెకాఫే మాటల్లోనే చెప్పాలంటే, 75 ఏళ్ళ ఆయన జీవితం ‘స్వర్గ నరకాల మధ్య సాగిన ఉత్థాన పతనాల ఉయ్యాల’! జైలు జీవితంతో విరాగిగా మారిన ఓ వివాదాస్పద భోగి ఆయన. – రెంటాల జయదేవ -
జాన్ మెకఫీ మృతి.. ముందే అనుమానించిన భార్య
వాషింగ్టన్: యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ ‘మెకఫీ’ సృష్టికర్త జాన్ మెకఫీ(75) బుధవారం స్పెయిన్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భార్య జానైస్ మెకఫీ కొన్ని రోజుల క్రితం చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది. ‘‘నా భర్త జైలులోనే మరణించాలని అమెరికా అధికారులు నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ ఏజెన్సీల్లో ఉన్న అవినీతి గురించి మాట్లాడితే.. ఏమవతుందో తెలిపేందుకు నా భర్త మృతిని ఉదాహరణగా చూపాలని భావిస్తున్నారు’’ అంటూ ఫాదర్స్ డే రోజున జానైస్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జానైస్ మెకఫీ ఫాదర్స్ డే సందర్భంగా జూన్ 20న చేసిన ట్వీట్లో ‘‘హ్యాపీ ఫాదర్స్ డే.. నీవు ఈ రోజును జైలులో గడుపుతున్నావు. నీ నిజాయతీ వల్లనే నీవు ఈ రోజు జైలులో ఉన్నావు. అవినీతి పరిపాలన సాగుతున్న చోట నీవు నిజాయతీగా ఉన్నావు. అదే నిన్ను ఇబ్బందుల్లో పడేసింది. అమెరికాలో నీకు న్యాయం జరుగుతుందని నేను భావించడం లేదు’’ అంటూ జానైస్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరలవుతోంది. జానైస్, జాన్‌లకు 2013లో వివాహం అయ్యింది. ఆమె వ్యక్తిగతం జీవితం గురించి ఎవరికి పెద్దగా తెలియదు. Happy Father's Day @officialmcafee. Though you are spending the day in prison know that you are loved and appreciated. #FreeJohnMcAfee #FreeMcAfee pic.twitter.com/YFmB36KWfb — Janice McAfee (@theemrsmcafee) June 20, 2021 -
యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ సృష్టికర్త మెకఫీ ఇకలేరు
మాడ్రిడ్: యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ ‘మెకఫీ’ సృష్టికర్త జాన్ మెకఫీ(75) బుధవారం స్పెయిన్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. బార్సిలోనా నగర సమీపంలోని జైలులో తన గదిలో మెకఫీ నిర్జీవంగా కనిపించారు. ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య సిబ్బంది ధ్రువీకరించారు. పన్నుల ఎగవేత కేసులో ఆయనను అమెరికాకు అప్పగించవచ్చని స్పెయిన్ నేషనల్ కోర్టు ఇటీవలే తీర్పునిచ్చింది. ఈ కేసులో నేరం రుజువైతే మెకఫీకి 30 ఏళ్లదాకా జైలు శిక్ష పడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని అధికారులు చెప్పారు. మెకఫీ మృతిపై న్యాయ విచారణ జరపనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే, ఇందులో మెకఫీ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ 75 ఏళ్ల అమెరికా పౌరుడు, పన్నుల ఎగవేత కేసులో నిందితుడు అని పేర్కొన్నారు. అమెరికా పౌరుడైన జాన్ మెకఫీ క్రిప్టోకరెన్సీ ప్రమోటర్‌గానూ వ్యవహరించారు. -
విషాదం.. జైల్లోనే ‘మెక్అఫీ’ ఆత్మహత్య!
మరో మేధావి జీవితం విషాదంగా ముగిసింది. మెక్అఫీ యాంటీ వైరస్ సృష్టికర్త జాన్ మెక్అఫీ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అమెరికాలో పన్నుల ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న మెక్అఫీ.. కిందటి ఏడాది అక్టోబర్ నుంచిస్పెయిన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. బుధవారం ఆయన తన గదిలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. బార్సిలోనా: డెబ్భై ఐదేళ్ల మెక్అఫీ.. అమెరికన్ టెక్నాలజీ ఎంట్రెప్రెన్యూర్‌గా పేరుగాంచాడు. 80వ దశకంలో యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ మెక్ అఫీని కనిపెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడాయన. అయితే టెన్నెస్సెలో పన్నుల ఎగవేత, న్యూయార్క్‌లో క్రిప్టో కరెన్సీ మోసాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి.ఈ ఆరోపణల కేసులో అమెరికా నుంచి పారిపోయిన ఆయన్ని.. కిందటి ఏడాది అక్టోబర్‌లో స్పెయిన్ పోలీసులు అరెస్ట్ చేసి బార్సిలోనా జైలుకి తరలించారు. ఇక పన్నుల ఎగవేత ఆరోపణల కేసులో మెక్అఫీని అమెరికాకు అప్పగించే స్పెయిన్ కోర్టు బుధవారం నాడే కీలక తీర్పు వెలువరించింది. ఆయన్ని అమెరికాకు అప్పగించాలని స్పెయిన్ పోలీసులను ఆదేశించింది. ఈ తరుణంలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ‘అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉన్నా.. జైల్లో మగ్గేందుకు ఆయన మనసు అంగీకరించలేదు. సొసైటీ ఆయన మీద పగ పట్టింది’ అని ఆయన తరపు లాయర్ జవెయిర్ మీడియా ముందు భావోద్వేగంగా మాట్లాడాడు. 2011లో తన కంపెనీని ఇంటెల్‌కు అమ్మిన మెక్అఫీ.. ఆ తర్వాత వ్యాపారాలకు దూరంగా ఉంటూ విలాసవంతమైన జీవితం అనుభవిస్తూ వచ్చాడు. లోగడ తాను 48 మంది పిల్లలకు తండ్రి చెప్పి పెద్ద షాక్ ఇచ్చాడు. 2012లో పొరుగింటి వ్యక్తి హత్య కేసులో పోలీసుల ఎంక్వైరీ నుంచి తప్పించుకునేందుకు పారిపోయాడు. తన సిద్ధాంతాలకు విరుద్ధంగా పన్నులు కట్టలేనని చెబుతూ.. కొన్ని ఏళ్లపాటు పన్నులు చెల్లించలేదు. ఒకానొక టైంలో క్యూబా సాయంతో అమెరికా అధ్యక్ష బరిలో పోటీ చేయాలనుకున్నా.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ట్విటర్లో ఆయన ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఒక మేధావి జీవితం ఇలా విషాదంగా ముగియడంపై ఆయన అభిమానులు కలత చెందుతున్నారు. చదవండి: ఒకప్పుడు విజేత.. ఇప్పుడు అవమానంతో వీడ్కోలు -
మోస్ట్ హాక్-ప్రూఫ్ స్మార్ట్‌పోన్ ఇదేనట!
హ్యాకింగ్ భయాలతో ఆందోళన చెందుతున్నస్మార్ట్ఫోన్ ప్రేమికులకు శుభవార్త. సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ కంపెనీ మెకఫే ఇంతకుముందెన్నడూ లేని ఒక సరికొత్త ప్రైవసీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. మోస్ట్ హాక్-ప్రూఫ్ స్మార్ట్‌పోన్‌ను తయారుచేసే ప్రణాళికలను ఆయన ఇటీవల ట్విట్టర్ లో వెల్లడించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాక్ చేయడం చాలా కష్టమని తెలిపారు. ‘న్యూస్‌వీక్’ వెబ్సైట్ తో మాట్లాడిన మెకఫే సంస్థ వ్యవస్థాపకుడు జాన్ మెకఫే ప్రపంచంలోనే తొలి పూర్తి ప్రైవేట్ స్మార్ట్‌ఫోన్ ఇదేనని కూడా ప్రకటించారు. ‘జాన్ మెకఫే ప్రైవసీ ఫోన్’ పేరుతో ఈ ఏడాదే ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుందని మెకఫే చెప్పారు. అయితే ఇది సాధారణ వినియోగదారుల కోసం కాదట... వ్యాపారవేత్తలు, సమాచార భద్రత కోరుకునే వారి కోసం దీన్ని తయారుచేశామన్నారు. ఇక ధర విషయానికి వస్తే సుమారు రూ. 65వేలు (1000 డాలర్లు) ఉంటుందని చెప్పారు. ‘ప్రపంచంలోనే తొలి ట్రూలీ ప్రైవేట్ స్మార్ట్‌ఫోన్ అని జాన్ ట్వీట్ చేశారు. దీంతోపాటు ప్రైవసీ స్మార్ట్‌ఫోన్ ఫొటోను షేర్ చేశారు. డెన్మార్క్‌లో డిజైన్ చేసి, అమెరికాలో డెవలప్ చేసి, యూరోప్‌లో అసెంబుల్డ్ చేసిన ఈ స్పెషల్ స్మార్ట్‌ఫోన్‌ను ఎంజీటీ, మెకఫే సంస్థలు సంయుక్తంగా తయారుచేస్తునట్టు వివరించారు. అయితే ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల గురించి మాత్రం వెల్లడించలేదు. దీని అఫీషియల్ లాంచింగ్ ముందు పూర్తి వివరాలు ప్రకటిస్తామన్నారు. ఈ డివైస్ హార్డ్‌వేర్ భద్రత అంశంలో కీలక ప్రాత పోషించనుందన్నారు. "హార్డ్‌వేర్ భద్రతకు మూలం..సాప్ట్వేర్ అభద్రతకు ఆధారం అన్నట్టుగా ట్వీట్ చేశారు. కాగా యూజర్ల డేటాను రక్షించేందుకు ఆపిల్, గూగల్ ఆపరేటింగ్ సిస్టం ప్రైవసీ పద్దతులను పాటిస్తోంటే..మరి ఈ మెకఫీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోనుందో ఇంకా రివీల్ కావల్సి ఉంది.