ఓటరు జాబితా సిద్ధం చేయండి
Published Fri, Dec 27 2013 3:21 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: తాజా ఓటరు జాబితాను సిద్ధం చేయూలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఆర్.ఎస్.రాజ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితా తాజా పరుచుట, ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లపై ఓటరు నమోదు అధికారుల(ఈఆర్‌ఓ)తో కలెక్టర్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 22తో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ముగిసిందన్నారు. నేరుగా, ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. దరఖాస్తును తిరస్కరిస్తే... కారణాలను తెలియజేయాలన్నారు. వీఆర్వోలు తనిఖీలు చేసి సంబంధిత రిజిస్టర్లలో సంతకాలు చేయూలన్నారు. ఓటర్ల వివరాలు అప్‌డేట్ చేసేందుకు అవసరమైన కంప్యూటర్లను సమకూర్చుకుని డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించుకోవాలన్నారు.
జనవరి 4 నాటికి దరఖాస్తులన్నింటినీ పరిష్కరించి ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ ద్వారా 62,290 దరఖాస్తులు అందాయని, వాటిలో పెండింగ్ ఉన్నవాటిని త్వరితగతిన పరి ష్కరించాలన్నారు. నవంబర్, డిసెంబర్ నెలలో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో ఫారం-6 లో 38,644, ఫారం-7లో 3,719, ఫారం-8లో 1353, ఫారం-8ఓలో 452 దరఖాస్తులు అందాయన్నారు. డూప్లికేట్, రీ డూప్లికేట్ దరఖాస్తులు అధికంగా ఉన్నాయని, వాటిని జాగ్రత్తగా గమనించాలన్నారు. పేరు, చిరునామా, ఫొటో తదితర వివరాల్లో ఎటువంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఓటర్ల కార్డుల్లో వివరాలు, ఫొటోలు వేర్వేరుగా ఉండడం వల్ల సమస్య లు తలెత్తుతాయన్నారు. జిల్లాకు చెందిన సీనియర్ రోల్ అబ్జర్వర్లు జాబితాలను పరిశీలిస్తారన్నారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి 1200 మంది ఓటర్లు దాటకుండా జాగ్రత్త వహించాలన్నారు.
పోలింగ్ కేంద్రాలకు, పోలింగ్ సిబ్బంది శిక్షణకు, రిజర్వులో ఉంచేందుకు అవసరమైన ఈవీఎంల అంచనాలు తయూరుచేసి ప్రతిపాదనలు పంపించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో అవసరమైన సెక్షన్, రూట్ అధికారుల సంఖ్య, పోలింగ్‌కు అవసరమైన సిబ్బంది వివరాలు అందించాలన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్టు, వ్యయూన్ని పరిశీలించేందుకు మండలాల వారీగా బృందాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. అలాగే, వీడియోగ్రాఫర్ల్ సంఖ్యను తెలపాలన్నారు. సమావేశంలో డీఆర్‌వో నూర్‌బాషా ఖాసిం, జెడ్పీ సీఈవో టి.కైలాశ్‌గిరీశ్వర్, ఆర్టీవోలు జి.గణేష్‌కుమార్, వి.విశ్వేశ్వరరావు, ఎన్.తేజ్‌భరత్, డీఆర్‌డీఏ పీడీ పి.రజనీకాంతరావు, హెచ్.వరప్రసాదరావు, కె.వెంకటేశ్వర్లు, ఆర్.గున్నయ్య, కె.సాల్మన్‌రాజు పాల్గొన్నారు.
Advertisement
Advertisement