Prepare
-
ఇంట్లోనే హార్లిక్స్ ఇలా చేద్దామా!
బయట మార్కెట్లో దొరికే హార్లిక్స్ కొనాలంటే అందరి వల్ల కాకపోవచ్చు. ఎంత కొందామన్నా.. కనీసం వందల్లో.. ఉంటుంది దాని ధర. మరోవైపు పిల్లలుకు ఇలాంటి ఇవ్వలేకపోతున్నానే అనే బాధ కూడా ఉంటుంది. అలాంటి వారు చక్కగా కాస్త శ్రద్ధ పెట్టి ఇంట్లోనే హార్లిక్స్ చేసుకోండి ఇలా. అదీగాక మార్కెట్లో ఉండే హార్లిక్స్ రుచి కోసం ఏవేవో కలుపుతారనే పలు ఆరోపణలు ఉన్నాయి. అందులో కాస్త షుగర్, కోకో వంటి క్వాండెటీ ఎక్కువని రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. దాని బదులు ఇంట్లోనే హానికరం కానీ విధంగా మంచి హోం మేడ్ హార్లిక్స్ చేసుకోండి. అందుకు ఏం కావాలంటే.. హార్లిక్స్ తయారీకి ప్రధానంగా కావలసింది గోధుమలు. ముందుగా నాణ్యమైన గోధుమలను ఒకరోజు రాత్రి మొత్తం నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం కాటన్ వస్త్రంలో బాగా వడకట్టాలి. ఆ గోధుమలను చక్కగా ఆరబెట్టాలి. అనంతరం వాటిని దోరగా వేయించాలి. ఆ తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటిలో గుప్పెడు వేరుశనగలు, బాదం గింజలు జోడించాలి. అంటే వీటిని వేరువేరు పాత్రల్లో పోసుకొని దోరగా వేయించాలి. ఆ తర్వాత విడివిడిగా మిక్సీ పట్టాలి. ఇలా ఈ మూడింటి మిశ్రమాలను చక్కగా జల్లెడతో జల్లించుకోవాలి. జల్లించిన తర్వాత.. అందులో మెత్తటి చక్కెర పొడిని కలపాలి.. ఇలా అన్నింటిని కలిపిన పొడిని ఒక శుభ్రమైన గాజు గ్లాసులో పోసుకోవాలి. ప్రతిరోజు ఉదయం పాలల్లో ఒక స్పూన్ వేసుకుని తాగితే ఎంత హాయిగా అనిపిస్తుంది. ఇంట్లోనే మన చేత్తో తయారు చేసిన హార్లిక్స్ పిల్లలకు ఇస్తే ఆ ఫీలే వేరేలెవెల్. దీనివల్ల కృత్రిమ పదార్థాలు, కోకో పౌడర్ కలపని హార్లిక్స్ రుచిని మనం ఆస్వాదించవచ్చు. పైగా మన ఇంట్లో తయారు చేసుకున్నామనే సంతృప్తి ఉంటుంది. పోషకాహార నిపుణులు కూడా ఇలా ఇంట్లో చేసుకోవడమే మంచిదని చెబతున్నారు. మన ఆరోగ్యం కోసం ఈ మాత్రం కష్టపడలేమా? చెప్పండి!. (చదవండి: 90 శాతం మంది నీళ్లను తప్పుగానే తాగుతారు! అసలైన పద్ధతి ఇదే..!) -
ఆ పార్టీలు చేతులు కలిపేనా? కాంగ్రెస్‌లో కొరవడిన స్పష్టత
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తుపై కాంగ్రెస్ పార్టీలో స్పష్టత రావడం లేదు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పాటు తెలంగాణ జన సమితి (టీజేఎస్), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లతో ఈసారి పొత్తు కుదిరే అవకాశముందనే చర్చ జరుగుతోంది. కానీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే సమయం సమీపిస్తున్నా రాష్ట్రస్థాయిలో ఇంతవరకూ ఎలాంటి స్పష్టమైన ప్రతిపాదనలు లేకపోవడం, ఈ దిశగా ఎలాంటి తాజా కదలిక లేకపోవడంతో పొత్తు ఉంటుందా? ఉండదా? అనే అంశంపై పార్టీ కేడర్ గందరగోళానికి గురవుతోంది. ముఖ్యంగా సీపీఐ, సీపీఎంలతో పొత్తు విషయంలో అయోమయం నెలకొంది. వాస్తవానికి ఆ పార్టీలతో గతంలో ఢిల్లీ స్థాయిలో చర్చలు జరిగాయి. ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ హైదరాబాద్‌లో సీపీఐ నేత నారాయణతో మంతనాలు జరిపారు. కానీ ఇంతవరకు ఏమీ తేల్లేదు. కామ్రేడ్లు అడిగినట్టుగా భావిస్తున్న సీట్లపై ఎలాంటి స్పష్టత రాలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తును వేగవంతం చేయడంతో వామపక్షాలతో పొత్తు ఉంటుందా? ఉండదా? అన్న దానిపై రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.దీనిపై అధిష్టానం వీలున్నంత త్వరగా స్పష్టత ఇవ్వాలని, ఏదో ఒకటి త్వరగా తేల్చితేనే ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవడం సాధ్యమవుతుందని, లేదంటే గత ఎన్నికల్లో మహాకూటమి పొత్తు లాగానే విఫలమయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. ఆరు స్థానాలపై టీజేఎస్ దృష్టి విశ్వసనీయ సమాచారం ప్రకారం.. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను కూడా ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు సంప్రదించాయి. ఢిల్లీ నుంచి ఆయనతో మంతనాలు జరిగాయని, ఈ సందర్భంగా పార్టీ విలీనం ప్రస్తావన వచ్చిందని, ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన ప్రొఫెసర్.. పొత్తుకు మాత్రం అభ్యంతరం లేదని చెప్పారని తెలిసింది. అయితే ఈసారి ఆరు స్థానాలపై టీజేఎస్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సూర్యాపేట, జహీరాబాద్, నర్సంపేట, ఎల్లారెడ్డి, గద్వాల, కోరుట్లపై ప్రధానంగా దృష్టి సారించామని, ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే మిగిలిన చోట్లా తమకు అభ్యర్థులు ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక జాతీయ స్థాయిలో బీఎస్పీతో సంబంధాలు ఎలా ఉన్నా రాష్ట్ర స్థాయిలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రతిపాదన ఉందని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. అయితే ఇంతవరకూ ప్రాథమిక స్థాయిలో కూడా చర్చలు ప్రారంభం కాకపోవడం గమనార్హం. కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు ఈసారి పొత్తుల విషయమై కాంగ్రెస్ పార్టీలో రెండు అభిప్రాయాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇతర పార్టీలకు వీలున్నన్ని తక్కువ స్థానాలు ఇచ్చి పొత్తు కుదుర్చుకుంటే మంచి ఫలితం వస్తుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మరికొందరు మాత్రం ఏ పార్టీ తోనూ పొత్తు అవసరం లేదని, ఒంటరిగా ఎన్నికలకు వెళితేనే కచ్చితంగా మేలు జరుగుతుందని అంటున్నారు. అయితే పార్టీ అధిష్టానం రాష్ట్ర నాయకులకు సమాచారం లేకుండానే ఇతర పార్టీలతో చర్చలు జరుపుతుండటంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంటున్నారు. -
35 మందితో కాంగ్రెస్ తొలి జాబితా!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం వేగంగా సన్నద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ నెలాఖరులోగా అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తొలి విడతలో బలమైన, ముఖ్యమైన అభ్యర్థులతో ఏకాభిప్రాయం ఉన్న 30–35 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించినట్టు తెలిసింది. తొలి జాబితాలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీతక్క, పొదెం వీరయ్య, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ, జీవన్‌రెడ్డి, జి.వినోద్, షబ్బీర్‌అలీ, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, ఫిరోజ్‌ఖాన్, ప్రేమ్‌సాగర్‌రావు, అంజన్‌కుమార్ యాదవ్, పద్మావతిరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, విజయరమణారావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వంశీకృష్ణ తదితరులు పేర్లు ఉండొచ్చని భావిస్తున్నారు. అక్టోబర్ రెండో వారానికి పూర్తి జాబితా... అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇప్పటికే హైదరాబాద్‌లో తొలి భేటీ జరిపిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ.. గురువారం ఢిల్లీలోని కాంగ్రెస్ వార్‌రూమ్‌లో రెండో భేటీ నిర్వహించింది. కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు, ఇతర కార్యదర్శులు పాల్గొన్నారు. సుదీర్ఘంగా 8 గంటల పాటు జరిగిన ఈ భేటీలో 119 నియోజకవర్గాల నుంచి షార్ట్‌లిస్ట్ చేసిన 300 పేర్లపై చర్చించారు. అందులో ఒకే అభ్యర్థి ఉన్న స్థానాలు 30–35 వరకు ఉండగా.. రెండేసి పేర్లున్న స్థానాలు 20–30, ముగ్గురి చొప్పున ఉన్నవి 30–35, నలుగురు, ఆపైన పోటీపడుతున్న స్థానాలు 10–15 వరకు ఉన్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో ఒకే అభ్యర్థి ఉన్న జాబితాకు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తీసుకుని.. ఈ నెలాఖరులోగా ప్రకటించాలని నిర్ణయించినట్టు సమాచారం. అక్టోబర్ తొలివారంలో రెండో జాబితా, రెండో వారంలో తుది జాబితా ప్రకటించాలని యోచనకు వచ్చినట్టు తెలిసింది. వరుసగా మూడుసార్లు ఓడిన నేతలకు టికెట్లు ఇవ్వకూడదని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. ఇలాంటి నియోజకవర్గాలు 6 నుంచి 8 వరకు ఉన్నట్టు సమాచారం. సర్వేల ఆధారంగా.. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు తాము చేసిన సర్వేల నివేదికను అందజేసినట్టు తెలిసింది. ఇద్దరు, ముగ్గురు, అంతకన్నా ఎక్కువ మంది పోటీపడుతున్న స్థానాల్లో ఎవరెవరికి ఎంత శాతం గెలుపు అవకాశాలు ఉన్నాయ న్న వివరాలను అందజేసినట్టు సమాచారం. దీనిని పరిగణనలోకి తీసుకున్న కమిటీ నేతలు.. అందులో నియోజకవర్గాల వారీగా 35 శాతానికిపైగా గెలుపు అవకాశాలున్న నేతల పేర్లను పరిగణనలోకి తీసుకుంటూ షార్ట్ లిస్ట్ సిద్ధం చేసినట్టు తెలిసింది. మరోవైపు బీజేపీ నుంచి చేరికలు ఉంటాయన్న అంశం కూడా భేటీలో ప్రస్తావనకు వచ్చింది. అలా చేరే అవకాశమున్న స్థానాలకు అభ్యర్థుల ప్రకటనను వారం పాటు పెండింగ్‌లో పెట్టాలని అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. టికెట్ దక్కని నేతలకు హామీలు! టికెట్ ఆశించి దక్కని నేతలకు వారి ప్రాధాన్యాన్ని బట్టి నేరుగా హైకమాండ్ పెద్దలతో పార్టీ, ప్రభుత్వ పదవులపై హామీలు ఇప్పించాలని స్క్రీనింగ్ కమిటీ భేటీలో నిర్ణయించినట్టు తెలిసింది. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ పదవులతోపాటు పారీ్టలో ప్రాధాన్యం కలి్పంచే విషయాన్ని పార్టీ పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంకగాంధీలతో చెప్పించనున్నారని సమాచారం. కాగా, టికెట్ ఆశిస్తున్న కొందరు నేతలు ఢిల్లీకి వెళ్లి అక్కడే మకాం వేసి ముఖ్య నేతలను ప్రస న్నం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. 6 చోట్ల ప్రాధాన్యత కోరిన పొంగులేటి! స్క్రీనింగ్ కమిటీ భేటీ ముందు ఠాక్రే, రేవంత్, ఉత్తమ్, భట్టిలతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై తన అభి ప్రాయాలను నేతలకు పొంగు లేటి వివరించి నట్టు తెలిసింది. ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక నియోజ కవర్గాల్లో తన వర్గం నేతలకు అవకాశం ఇవ్వా లని ఆయన కోరినట్టు సమాచారం. తనతో పాటు పార్టీలో చేరిన తుడి మేఘారెడ్డికి వన పర్తిలో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతిపాదించి నట్టు తెలిసింది. సర్వేలతో పోల్చి చూసి ఖరారు చేస్తామని ఠాక్రే హామీ ఇచ్చినట్టు తెలిసింది. -
హైబ్రిడ్ వర్కే సో బెటరూ!
మూడేళ్ల క్రితం యావత్ ప్రపంచం కరోనా కోరల్లో చిక్కి అన్నిరంగాలు ప్రభావితమయ్యాక వర్క్ ఫ్రం హోం విధానం అమల్లోకి వచ్చింది.దీంతో ఇంటి నుంచి పనిచేసే పద్ధతికి పలు రంగాల ఉద్యోగులు అలవాటుపడ్డారు. కొంతకాలంగా పరిస్థితులు సద్దుమణగడంతో ఐటీతో సహా పలు కంపెనీలు, సంస్థలు ఉద్యోగులు ఆఫీసుల నుంచి పనిచేయడం తప్పనిసరి చేస్తున్నాయి. దీనిపై ఉద్యోగుల మనోగతం ఎలా ఉందో తెలుసుకునేందుకు ‘సీఐఈఎల్ హెచ్ఆర్’ సంస్థ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సాక్షి, హైదరాబాద్: వర్క్ ఫ్రం హోం, ఆఫీసులకు తిరిగి వెళ్లడంపై ఉద్యోగుల్లో పెద్ద చర్చే సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో హైబ్రిడ్ పనివిధానమే (ఆన్లైన్+ఆఫ్‌లైన్) మేలని అధికశాతం టెకీలు, ఇతర రంగాల ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. కంపెనీలు తప్పనిసరిగా ఆఫీసుల నుంచే పనిచేయాలని పట్టుబట్టకుండా వర్క్ ఫ్రం హోం లేదా వారానికి ఒకరోజు ఆఫీసుకు రావడం లాంటి పద్ధతులను అనుమతించాలనే డిమాండ్ పెరుగుతోంది. వర్క్ ఫ్రం హోం లేదా హైబ్రిడ్ విధానానికి అనుమతించకపోతే వేరే కంపెనీల్లోకి మారేందుకూ సిద్ధమని 73 శాతం టెకీలు, ఇతర ఉద్యోగులు చెప్పినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే, 35 శాతం మంది మాత్రం ఆఫీసుల నుంచి పనిచేసే రోజుల సంఖ్యను పెంచడాన్ని స్వాగతించారు. 26 శాతం మంది ఆఫీసు నుంచి పనిచేయడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఐటీ, ఇతర రంగాల్లో పనిచేస్తున్న 3,800 ఉద్యోగుల అభిప్రాయాలతో ఈ సర్వే నివేదిక రూపొందించారు. వర్క్ ఫ్రం ఆఫీసుకు కంపెనీల మొగ్గు ఇప్పటికే టీసీఎస్, మెటా, గోల్డ్‌మ్యాన్ సాక్స్, జేపీ మోర్గాన్ తదితర కంపెనీలు కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా తమ ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేసేలా ప్రోత్సహిస్తున్నాయి. గతంలో వర్క్ ఫ్రం హోంను పూర్తిస్థాయిలో ప్రోత్సహించిన ‘జూమ్’ సంస్థ కూడా తమ ఆఫీసులకు 50 మైళ్ల పరిధిలో ఉన్న వారు వారానికి రెండురోజులు ఆఫీసుకు రావాలని చెబుతోంది. రెండువందలకు పైగా కంపెనీల్లో డెలాయిట్ ఇండియా బెనిఫిట్స్ ట్రెండ్స్ 2023 నిర్వహించిన సర్వేలో... 88 శాతం ఉద్యోగులు ఏదో ఒక రూపంలో తమకు అనుకూలమైన పని పద్ధతులను మార్చుకున్నట్లు వెల్లడైంది. ఐటీసీ సంస్థ వర్క్ ఫ్రం ఆఫీస్‌ను పునఃప్రారంభించడంతోపాటు కొందరు ఎంపిక చేసిన ఉద్యోగులను వారానికి రెండురోజులు ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతిస్తోంది. డీబీఎస్ బ్యాంక్ ఇండియా నిర్వహించిన సర్వేలో హైబ్రిడ్ విధానానికి అత్యధికులు మొగ్గుచూపుతున్నట్టు తేలింది. దీనికి అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన హైబ్రిడ్ వర్క్మోడల్/ ఫ్లెక్సిబుల్ వర్క్ వసతులను రూపొందించినట్టు డీబీఎస్ బ్యాంక్ ఇండియా హెచ్ఆర్ కంట్రీ హెడ్ కిషోర్ పోడూరి తెలిపారు. హైబ్రిడ్ విధానంతో వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంతోపాటు ట్రాఫిక్రద్దీ, వాహన కాలుష్యం నుంచి ఉపశమనం దొరుకుతుందని ఉద్యోగులు భావిస్తున్నట్లు చెప్పారు. అనుకూలమైన పని గంటలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఉండే సంప్రదాయ ఆఫీసు పనివేళల విధానం కాకుండా నిర్దేశిత లక్ష్యాల సాధనకు ఉద్యోగులు తమకు అనుకూలమైన పని సమయాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. దీనివల్ల ఉత్పాదకత కూడా పెరుగుతోంది. దీంతో వారు వ్యక్తిగత, కుటుంబ బాధ్యతలను కూడా సరైన పద్ధతుల్లో నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. –నీలేశ్ గుప్తా, డైరెక్టర్, డెలాయిట్ ఇండియా వర్క్‌ఫోర్స్ ఉండేలా... ఉద్యోగుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పని ప్రదేశంలో చేపట్టాల్సిన చర్యలు, తీసుకురావాల్సిన మార్పులపై కంపెనీలు దృష్టి పెట్టాల్సిన అవసరముంది. వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఉత్పాదకతను పెంచే వర్క్‌ఫోర్స్, నైపుణ్య ఉద్యోగులు ఉండేలా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.–ఆదిత్య నారాయణ్ మిశ్రా, సీఈవో, సీఐఈఎల్ హెచ్ఆర్ హైబ్రిడ్ వర్కింగ్ మోడల్ అంటే... ఆఫీసు, ఇంటి నుంచి పనిచేయడాన్ని సమ్మిళితం చేస్తే హైబ్రిడ్ పనివిధానం అవుతుంది. ఇందులో వారంలో కొద్ది రోజులు ఆఫీసు నుంచి, కొద్దిరోజులు ఇంటి నుంచి పనిచేస్తారు. యాజమాన్యం, ఉద్యోగులకు అనుకూలంగా ఉండే పని విధానాన్ని, ఆఫీసు వేళలను నిర్ణయిస్తారు. ఇందులో భాగంగానే ఉద్యోగుల ఇళ్లకు దగ్గర్లోని లేదా ఉద్యోగులకు అనుకూలంగా ఉండే కో వర్కింగ్ ప్లేస్‌ల నుంచి పనిచేసే వీలు కూడా కల్పిస్తారు. దీంతో యాజమాన్యాలు, ఉద్యోగులకు అనువైన విధానాలను ఎంపిక చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వస్తుంది. -
‘ముందస్తు’కు మేం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరగదన్నదే తమ అభిప్రాయమన్నారు. బుధవారం గాంధీభవన్‌లో వారిద్దరూ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సమయం, ఇతర పరిస్థితుల దృష్ట్యా నియోజకవర్గాల పునర్విభజన సా ధ్యం కాదనుకుంటున్నట్లు చెప్పారు. ‘‘ఎన్నికల సమయంలో కూటముల ఏర్పాటు ప్రయత్నాలు సహజం. కూటమి ఏర్పాటుపై పార్టీలో ఏదైనా స్పష్టత వచ్చాక ప్రకటిస్తాం. వచ్చే ఎన్నికల్లో 102 సీట్లు గెలుస్తామని టీఆర్ఎస్ చెప్పుకోవడం మా పార్టీ శ్రేణులను బలహీన పరిచేందుకు ఆడుతున్న మైండ్‌గేమ్. రాష్ట్రంలో 62 శాతం మంది రైతులు రెండున్నర ఎకరాల లోపే భూమి కలిగి ఉన్నారు. ఈ లెక్కన మెజారిటీ రైతులకు రూ.2 వేల నుంచి రూ.3 వేల లోపే పెట్టుబడి సాయం అందుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల్లో క్వింటాలుకు రూ.100 తగ్గినా ఇచ్చే పెట్టుబడి సాయం చెల్లుకు చెల్లవుతుంది. అదనంగా రైతులకు ఒరిగేదేమీ ఉండదు’’అని పేర్కొన్నారు. తమ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధంగానే ఉన్నారని చెప్పారు. -
జిల్లా స్థాయి యువజనోత్సవాలకు సన్నాహాలు
అనంతపురం కల్చరల్: జిల్లాలోని అన్ని డివిజన్లలో విజేతలైన వారికి జిల్లా స్థాయి పోటీలను శుక్రవారం నిర్వహిస్తున్నట్లు యువజన సంక్షేమ శాఖాధికారి వెంకటేశం తెలిపారు. ఈ మేరకు గురువారం యువజన సంక్షేమ శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కళాకారుల్లోని ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా పోటీలు సాగుతాయన్నారు. స్థానిక కృష్ణకళామందిరంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 18 నుంచి 29 ఏళ్ల లోపు ఉన్న 5 డివిజన్లలోని 181 మంది పలు పోటీలు పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఆన్సెట్ మేనేజర్ సునీల్‌కుమార్‌రెడ్డి, ఇన్చార్జి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల షెడ్యూల్ కు సిద్ధం కండి!
-
ఎన్నికల షెడ్యూల్ కు సిద్ధంకండి!
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే నగరా మోగనుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ ఈ ఐదు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. తమ పోల్ షెడ్యూల్ ప్రకటనకు సిద్ధంగా ఉండాలని సూచించింది. షెడ్యూల్ ప్రకటన రాగానే ప్రవర్తన నియమావళి అమలుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఎన్నికలు జరగనున్నఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల కేబినెట్ కార్యదర్శులు, రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు ఈసీ లేఖ రాసింది. జనవరి 4వ తేదీన ఈ పోల్ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ లో ఏడు దశలుగా యూపీ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఒకరోజు ఎన్నికల జరగనున్నట్టు అధికారిక వర్గాల సమాచారం. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నిబంధనల జాబితాను జారీ చేసింది. ప్రచారం కోసం అధికారిక వాహనాల ఉపయోగాన్ని తొలగింపు, రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లు నుంచి రాజకీయ కార్యనిర్వాహకుల చిత్రాలు తొలగింపు, అధికారి పార్టీ ప్రకటనలకు ప్రజాధనం వాడకంపై నిషేధం తదితర నిబంధనలను పంపించింది. అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనల ప్రీ-యోగ్యతకు సంబంధించి, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నియమించుకోవాలని రాజకీయ పార్టీలకు గుర్తు చేసింది. కాగా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ మే 27తో, మిగిలిన నాలుగురాష్ట్రాల అసెంబ్లీ గుడువు మార్చితో ముగియనున్న సంగతి తెలిసిందే. -
మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలి
ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘిస్తుంది కంతనపల్లి ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలి కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి తేజావత్ బెల్లయ్య నాయక్ మహబూబాబాద్ : తెలంగాణ ప్రజలు మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తేజావత్ బెల్లయ్యనాయక్ పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ వ్య వస్థను విధ్వంసం చేసే పరిస్థితి నేడు ఏర్పడిం దన్నారు. ప్రజల ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రభుత్వం పాలన కొనసాగించకపో గా.. పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి అనుగుణంగా పనిచేస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ. 1.50 లక్షల కోట్లు కేటాయించిందన్నారు. భూసేకరణ చట్టాన్ని, అటవీహక్కుల చట్టాన్ని సైతం ప్రభుత్వం ఉల్లంఘిస్తుందన్నారు. ప్ర భుత్వం ఏర్పాటు చేసిన మొదటి సంవత్సరం లో రూ.85 వేల కోట్లు, రెండో సంవత్సరంలో రూ. 90 వేల కోట్ల ఆదాయం వచ్చిందని. ఈ నిధుల వ్యయంపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ముల్లంగి ప్రతాప్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు వెంకన్నతో పాటు యాళ్ల పుష్పలత, నాయకులు గిరిధర్ గుప్తా, అప్పె వేణు, ఖలీల్, రామగోని రాజు, ప్రసాద్, వెంకటేశ్వర్లు, వెంకట్, కిష¯ŒS పాల్గొన్నారు. -
ఎంసెట్–3కి అంతా సిద్ధం
నేడు పరీక్ష – హాజరు కానున్న 2160 మంది విద్యార్థులు – నిమిషం ఆలస్యం అయితే నో ఎంట్రీ నల్లగొండ టూటౌన్: జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించే మెడిసిన్, డెంటల్ ఎంసెట్–3కి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో ఏ, బీ పరీక్ష కేంద్రాలు, కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో, వృత్తి విద్యా కళాశాలలో ఏ, బీ కేంద్రాలు, రామగిరిలోని ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలలో ఒకటి చొప్పున మొత్తం 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు మొత్తం 2160 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది. ఎంసెట్ –2 రాసి హాల్ టికెట్లు ఉన్న విద్యార్థులందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. పరీక్ష కేంద్రాలను గంట ముందుగానే తెరిచి విద్యార్థులను అనుమతిస్తారు. విద్యార్థుల బయోమెట్రిక్ తీసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. శనివారం ఎన్జీ కళాశాలలో పరీక్ష ఏర్పాట్లను ఎంసెట్–3 ప్రత్యేక పరిశీలకుడు ధర్మానాయక్, ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. నాగేందర్‌రెడ్డి, ఇతర అధికారులు పరిశీలించారు. -
పూజలకు ఖైరతాబాద్ గణేష్ సిద్దం
-
మళ్లీ పోరుకు సిద్ధం
బాబు ఎన్నికల హామీని అమలు చేయాలి కమిషన్ నివేదికను బట్టి ఉద్యమ కార్యాచరణ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఖమ్మం అర్బన్: కాపులకు రిజర్వేషన్ల కోసం ఏపీలో అవసరమైతే మళ్లీ పోరాటానికి సిద్ధమవుతామని ఆంధ్రప్రదేశ్ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్ వెళుతూ ఖమ్మంలో కాసేపు ఆగారు. మున్నూరు కాపుసంఘం జిల్లా అధ్యక్షుడు పారా నాగేశ్వరరావు ఇంట్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రిజర్వేషన్ అమలుకావాల్సి ఉండగా..చివరిదశలో ఆగిందని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను గెలిచిన ఆరు నెలల్లో కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని ఎన్నికల హామీనిచ్చి విస్మరించారని ఆరోపించారు. అమలు కోసం గతంలో తాను పోరాడానని, పిభ్రవరి 2న కళా వెంకటరావు, మంత్రి అచ్చంనాయుడును పంపించి కమిషన్ ద్వారా న్యాయం చేస్తామని ఈనెల చివరివరకు గడువు పెట్టారని, నివేదిక అనుకూలంగా లేకుంటే మళ్లీ పోరాటం తప్పదని హెచ్చరించారు. సెప్టెంబర్ 11న అన్ని జిల్లాల కాపు నేతలతో సమావేశమై..భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు వివరించారు. పేద కాపులకు న్యాయం జరగాలన్నదే తమ ధ్యేయమని, కేసులు పెట్టి బెదిరించినా, జైల్లో పెట్టినా న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. తాను ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదని, గతంలో ప్రజా ప్రతినిధిగా నాలుగు సార్లు గెలిచినా..ఏనాడూ డబ్బు, సారా పంచలేదని తెలిపారు. పవన్ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారని, తాను మాత్రం ఉన్న రిజర్వేషన్ పునరుద్ధరించాలని పోరాడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు పారా నాగేశ్వరరావు, రాష< నాయకులు నల్లా విష్టు, ఆకుల రామకృష్ణ, జిల్లా నాయకులు శెట్టి రంగారావు, తోట రామారావు, కొత్తా సీతారాములు, ఆకుల గాంధీ, మాటేటి వీరభద్రం, పారా ఉదయ్, రాపర్తి శరత్ పాల్గొన్నారు. -
మళ్లీ పోరుకు సిద్ధం
బాబు ఎన్నికల హామీని అమలు చేయాలి కమిషన్ నివేదికను బట్టి ఉద్యమ కార్యాచరణ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఖమ్మం అర్బన్: కాపులకు రిజర్వేషన్ల కోసం ఏపీలో అవసరమైతే మళ్లీ పోరాటానికి సిద్ధమవుతామని ఆంధ్రప్రదేశ్ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్ వెళుతూ ఖమ్మంలో కాసేపు ఆగారు. మున్నూరు కాపుసంఘం జిల్లా అధ్యక్షుడు పారా నాగేశ్వరరావు ఇంట్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రిజర్వేషన్ అమలుకావాల్సి ఉండగా..చివరిదశలో ఆగిందని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను గెలిచిన ఆరు నెలల్లో కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని ఎన్నికల హామీనిచ్చి విస్మరించారని ఆరోపించారు. అమలు కోసం గతంలో తాను పోరాడానని, పిభ్రవరి 2న కళా వెంకటరావు, మంత్రి అచ్చంనాయుడును పంపించి కమిషన్ ద్వారా న్యాయం చేస్తామని ఈనెల చివరివరకు గడువు పెట్టారని, నివేదిక అనుకూలంగా లేకుంటే మళ్లీ పోరాటం తప్పదని హెచ్చరించారు. సెప్టెంబర్ 11న అన్ని జిల్లాల కాపు నేతలతో సమావేశమై..భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు వివరించారు. పేద కాపులకు న్యాయం జరగాలన్నదే తమ ధ్యేయమని, కేసులు పెట్టి బెదిరించినా, జైల్లో పెట్టినా న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. తాను ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదని, గతంలో ప్రజా ప్రతినిధిగా నాలుగు సార్లు గెలిచినా..ఏనాడూ డబ్బు, సారా పంచలేదని తెలిపారు. పవన్ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారని, తాను మాత్రం ఉన్న రిజర్వేషన్ పునరుద్ధరించాలని పోరాడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు పారా నాగేశ్వరరావు, రాష< నాయకులు నల్లా విష్టు, ఆకుల రామకృష్ణ, జిల్లా నాయకులు శెట్టి రంగారావు, తోట రామారావు, కొత్తా సీతారాములు, ఆకుల గాంధీ, మాటేటి వీరభద్రం, పారా ఉదయ్, రాపర్తి శరత్ పాల్గొన్నారు. పోటోరైటప్28సీకెఎం209: మాట్లాడుతున్న ముద్రగడ పద్మనాభం -
గీతాలాపానికి విద్యార్థులను సన్నద్ధం చేయండి డీఈఓ
అనంతపురం ఎడ్యుకేషన్ : కేంద్ర ప్రభుత్వం ‘ఆజాది 70–యాద్ కరో కురబానీ’గా నిర్ణయించిన నేపథ్యంలో మంగళవారం 11 గంటలకు విద్యార్థులతో ఒకేసారి జాతీయ గీతాలాపన చేయాలని నిర్ణయించిందని ఈ క్రమంలో విద్యార్థులను సన్నద్ధం చేయాలని డీఈఓ అంజయ్య ఉప, మండల విద్యాశాఖ అధికారులతో పాటు హెచ్ఎంలకు ఓ ప్రకటనలో సూచించారు. -
‘డ్రిప్’ అర్హత జాబితా సిద్ధం చేయండి
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా 51 వేల హెక్టార్లకు డ్రిప్ కావాలని రైతుల నుంచి దరఖాస్తులు వచ్చాయని, నెలలోగా క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హత జాబితా సిద్ధం చేయాలని ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) పీడీ ఎం.వెంకటేశ్వర్లు, ఏపీడీ ఆర్.విజయశంకరరెడ్డి ఆదేశించారు. ఆదివారం ఏపీఎంఐపీ కార్యాలయంలో ఎంఐడీసీ సత్యనారాయణమూర్తితో కలిసి ఇరిగేషన్ కంపెనీ జిల్లా ప్రతినిధులు (డీసీవో), ఎంఐ ఇంజనీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2016–17లో జిల్లాకు కేటాయించిన 35 వేల హెక్టార్లలో 4,100 హెక్టార్లకు సరిపడా యూనిట్లు మంజూరు చేశామన్నారు. ఇంకా లక్ష్యం ఎక్కువగా ఉండటం, అందుకు అనుగుణంగా రైతుల నుంచి రిజిషే్ట్రషన్లు కూడా భారీగా ఉండటంతో మొదట వాటిని పూర్తీస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హత ఉన్న వాటితో జాబితా తయారు చేస్తే మంజూరు చేయడానికి సులభంగా ఉంటుందని తెలిపారు. అలాగే వేరుశనగ పంటకు రక్షకతడి ఇచ్చేందుకు వీలుగా కేటాయింపుల మేరకు కంపెనీల ద్వారా వెంటనే రెయిన్గన్లు, స్ప్రింక్లర్సెట్లు, పైపులు మండలాల్లో నిల్వ చేయాలని ఆదేశించారు. -
ఆపరేషన్ తర్వాత... మర్చిపోతున్నాను...
సందేహం నా వయసు 22. నాకు నాలుగు నెలల బాబు ఉన్నాడు (ఆపరేషన్ అయింది). బ్యాంకు ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. కానీ ఆపరేషన్ తర్వాత ప్రతి చిన్న విషయం మరిచిపోతున్నాను. ఇలాంటి సమయంలో నేను ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవ్వచ్చా. దానికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నేను ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే... నాకు, మావారికి సరైన సెక్యూర్డ్ జాబ్ లేదు. అందుకే నా ఈ మతిమరుపు తగ్గడానికి పరిష్కారం చెప్పండి ప్లీజ్. - లక్ష్మీకాంతం, ఊరు పేరు రాయలేదు కాన్పు తర్వాత బాబు పనులు, ఇంటి పనులలో బిజీగా ఉండటం వల్ల ఏకాగ్రత సరిగా లేకపోవడంతో కొన్నిసార్లు జ్ఞాపకశక్తి తగ్గినట్లు అనిపిస్తుంది. బాబుకు పాలు ఇవ్వడం, మిగతా పనుల వల్ల నీరసించడం, బలం లేకపోవడం, విటమిన్స్ లోపం వల్ల కూడా కొద్దిగా తాత్కాలికంగా మతిమరుపు ఏర్పడవచ్చు. ఇద్దరికీ మంచి జాబ్ లేదనే అభద్రతా భావం వల్ల కూడా అన్నీ మరిచిపోయినట్లు అనిపించొచ్చు. అందుకే కంగారు పడకుండా... మొదట సరైన పౌష్టికాహారం, అవసరమైన విశ్రాంతి తీసుకుంటూ దృఢ నిశ్చయంతో మెల్లిగా పరీక్షకు ప్రిపేర్ అవ్వడం ప్రారంభించండి. అప్పుడు తప్పకుండా పరీక్షల్లో సఫలీకృతులవుతారు. బాబును చూసుకోవడంలో మీ వారిని కూడా సహాయం చేయమని చెప్పండి. దానివల్ల మీకు కొద్దిగా స్ట్రెస్ తగ్గుతుంది కాబట్టి పూర్తిగా చదువుకోవడంపై దృష్టి పెట్టవచ్చు. నా వయసు 36. ఒక బాబు ఉన్నాడు. వాడి వయసు పదకొండేళ్లు. పీరియడ్స్ రెగ్యులర్‌గానే వస్తాయి. కానీ మొదటి నుంచి రెండు మూడు రోజులకు మించి బ్లీడింగ్ అవ్వదు. బాబు పుట్టడానికి కూడా అది సమస్య కాలేదు. పీరియడ్స్ సమయంలో నాకెప్పుడూ నొప్పి కూడా ఉండేది కాదు. అయితే రెండు నెలల నుంచి పొత్తి కడుపులో బాగా నొప్పిగా ఉంటోంది. దాంతో డాక్టర్‌ను సంప్రదిస్తే స్కానింగ్ చేశారు. రిపోర్ట్‌లో నా గర్భాశయంలో 2 సె.మీ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ ఉందని చెప్పారు. ఆ రిపోర్ట్ చూశాక... మళ్లీ డాక్టర్‌ను కలవలేదు. ఎక్కడ ఆపరేషన్ చేయాలంటారేమోనని భయంగా ఉంది. దయచేసి పరిష్కారం చెప్పండి. - జయ, తెనాలి రెండు నెలల నుంచి పొత్తి కడుపులో నొప్పి రోజూ ఉంటుందా లేక పీరియడ్స్ సమయం లోనే ఉంటుందా అనే విషయాన్ని మీరు సరిగా రాయలేదు. 2 సె.మీ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్కి ఆపరేషన్ అవసరం లేదు. మీ కడుపులో నొప్పి తప్పనిసరిగా ఫైబ్రాయిడ్ వల్లే అవ్వాలని ఏమీ లేదు. మీకు పొత్తి కడుపులో నొప్పి కేవలం పీరియడ్స్ సమయంలోనే ఉంటే.. ఆ రెండు మూడు రోజులు నొప్పి నివారణ మాత్రలు వేసుకుంటే సరిపోతుంది. మిగతా రోజులు కూడా నొప్పి ఉంటే, మూత్రంలో ఇన్ఫెక్షన్, గర్భాశయంలో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఏమైనా ఉన్నాయేమో పరీక్షల ద్వారా తెలుసుకొని, తగిన చికిత్స తీసుకోండి. 6 నెలలకు ఒకసారి స్కానింగ్ చేయించుకొని ఫైబ్రాయిడ్ పరిమాణం ఇంకా పెరుగుతుందా లేదా అనేది తెలుసుకోవడం మంచిది. పరిమాణం బాగా ఎక్కువగా పెరుగుతూ, పీరియడ్స్ సమయంలో నొప్పి పెరుగుతూ, బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంటేనే ఆపరేషన్ గురించి ఆలోచించుకోవలసి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా విడుదలైన మందుల ద్వారా ఫైబ్రాయిడ్స్ పరిమాణం తగ్గే అవకాశం ఉంది. బాబుకు పాలు ఇవ్వడం, మిగతా పనుల వల్ల నీరసించడం, బలం లేకపోవడం, విటమిన్స్ లోపం వల్ల కూడా కొద్దిగా తాత్కాలికంగా మతిమరుపు ఏర్పడవచ్చు. డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్ మోతీనగర్, హైదరాబాద్ -
ఆస్పత్రి నిర్మాణానికి ప్లాన్ సిద్ధం చేయండి
అనంతపురం సిటీ: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో అత్యవసర విభాగానికి నూతన భవనం నిర్మించి ఇచ్చేందుకు ముందుకు వచ్చిన మెగా ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ నిర్వాహకులకు సూపరింటెండెంట్ జగన్నాథ్ గురువారం కృతజ్ఙతలు తెలిపారు. మూడు రోజులుగా సెలవులో ఉన్న ఆయన గురువారం విధుల్లో చేరారు. కలెక్టర్ కోన శశిధర్ సూచనల మేరకు ఇంజనీరింగ్ కంపెనీ వారికి భవన నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ సిద్ధం చేయాలని ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అధికారి నర్సయ్యకు సూచించారు. ప్లాన్‌ను జిల్లా కలెక్టర్‌కు చూపించి ఇంజనీరింగ్ కంపెనీ వారికి ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఈ మేరకు ప్లాన్‌ను నాలుగు రోజుల వ్యవధిలో అందజేస్తామని అధికారి నర్సయ్య తెలిపారు. -
వినాయక విగ్రహాల తయారీ షురూ..!
-
2018 నుంచివిస్తారా విదేశీ సర్వీసులు!
ముంబై : దేశీ విమానయాన సంస్థ ‘విస్తారా’ అంతర్జాతీయ విమాన సర్వీసులను నడపడానికి సర్వం సిద్ధం చేసుకుంటోంది. ఇది 2018 ప్రధమార్దంలో విదేశాలకు విమానాలను నడిపే అవకాశముంది. ‘ఇప్పటికిప్పుడే ఏదోరకంగా అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించాలని మేం ఊవ్విళ్లూరడం లేదు. కానీ కచ్చితంగా విదేశాలకు విమానాలను నడుపుతాం. దీనికి మేం పూర్తిగా సన్నద్ధం కావాల్సి ఉంది.’ అని విస్తారా చీఫ్ స్ట్రాటజీ, కమర్షియల్ ఆఫీసర్ సంజీవ్ కపూర్ తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ఇందులో ఆయన యాక్సిస్ బ్యాంక్‌తో కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రధమంగా సార్క్, గల్ఫ్ దేశాలకు విదేశీ సర్వీసులను నడుపుతామని సంజీవ్ తెలిపారు. తమ వద్ద ఉన్న విమానాలు ఈ ప్రాంతాలకు మాత్రమే రాకపోకలు నిర్వహించగలవని పేర్కొన్నారు. కాగా విస్తారా దేశంలో తన కార్యకలాపాలను గతేడాది జనవరి 9న ప్రారంభించింది. ప్రస్తుతం 17 గమ్యస్థానాలకు సర్వీసులను నడుపుతోంది. అక్టోబర్ నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు కూడా విమానాలు నడపనున్నది. ప్రస్తుతం విస్తారా వద్ద 11 విమానాలు ఉన్నాయి. సంస్థ అక్టోబర్‌లో మరో రెండింటిని డెలివరీ చేసుకోనున్నది. -
గెలుపెవరిదో?
♦ ఓటరన్న గుట్టు వీడేది నేడే ♦ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం ♦ ఓటరు తీర్పుపై నేతల్లో ఉత్కంఠ ♦ ఖేడ్ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ ♦ సీసీ కెమెరాల ఏర్పాటు పట్టణంలో 144 సెక్షన్ ♦ 9 చోట్ల పికెట్లు, 300 మందితో బందోబస్తు ♦ నిజాంపేట మీదుగా వాహనాల మళ్లింపు నారాయణఖేడ్: ఖేడ్ ఉప ఎన్నికల్లో భాగంగా ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటరు గుట్టు మరికొన్ని గంటల్లో వీడనుంది. తీర్పు ఎలా వస్తుందోనని అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఓటరు ఎవరిని కరుణిస్తాడో తెలియక ఆయా పార్టీల నేతల గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఈనెల 13న పోలింగ్ పూర్తికాగానే 286 ఈవీఎంలను నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోగల పాలిటెక్నిక్ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూంకు అధికారులు పటిష్టభద్రతను ఏర్పాటు చేశారు. అటువైపు ఎవరినీ అనుమతించడం లేదు. మొత్తం 9 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూం వద్ద 4 సీసీ కెమెరాలు, పాలిటెక్నిక్ కళాశాల, కౌంటింగ్ హాలులో మిగతా కెమెరాలు అమర్చారు. ఏర్పాట్లు పూర్తి... కౌంటింగ్ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పాలిటెక్నిక్ కళాశాల ఆవరణ, స్ట్రాంగ్ రూం పరిసరాలు, కౌంటింగ్ హాల్ సమీపాల్లో పోలీసులు జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. పాలిటెక్నిక్ కళాశాల ఆవరణ అంతా రిటర్నింగ్ అధికారి ఆధీనంలో ఉంది. పటిష్ట బందోబస్తు: డీఎస్పీ కౌంటింగ్ సందర్భంగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్టు మెదక్ డీఎస్పీ రాజారత్నం తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నారాయణఖేడ్ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగే కౌంటింగ్ హాలుతో పాటు పరిసరాలు, పట్టణంలోనూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీ బి.సుమతి, అదనపు ఎస్పీలు వెంకన్న, బాబూరావు, ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐ లు, 10 మంది ఎస్ఐలు, ఒక కంపెనీ సీఆర్పీఎఫ్ బలగాలను మొత్తం 300 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. కౌంటింగ్ సందర్భంగా అన్ని వాహనాలను నిజాంపేట మీదు గా మళ్లిస్తున్నట్టు చెప్పారు. ఖేడ్ వచ్చే క్రమంలో వెంకటాపూర్ క్రాస్ రోడ్డు, అటు నిజాంపేట నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించేది లేదన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో 144 సెక్షన్ విధించినట్టు తెలిపారు. గుర్తింపు కార్డులు లేకుండా ఎవరినీ అనుమతించేది లేదన్నారు. పట్టణంలో తొమ్మిది చోట్ల పోలీసు పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ సందర్భంగా పట్టణంలో అనుమతులు లేనిదే ర్యాలీలు చేపట్టరాదన్నారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా అన్ని పార్టీల నేతలు సహకరించాలని ఆయన కోరారు. -
పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి?
ఎగ్జామ్ టిప్స్ మైండ్ అనేది కంప్యూటర్లోని హార్డ్ డిస్క్ లాంటిది. అందులో మనం ఎంత సమాచారాన్ని అయినా నిల్వచేసుకోవచ్చు. ఫలానా దానిని మీరు గుర్తుంచుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకోకపోతే... అది మీ పరిశీలనకు అందడం గాని, గుర్తుండడం గాని కష్టం. కాబట్టి... ఆసక్తిగా, గుర్తుంచుకునేలా చదవడం ముఖ్యం. {పాక్టీస్ వల్లే ఏ హ్యాబిట్ అయినా పర్ఫెక్ట్ అవుతుంది. ఏ పని చేస్తుంటే దాని మీద దృష్టి కేంద్రీకరించడం అలవాటు చేసుకోవాలి. అపుడు చదువు విషయంలో కూడా అనుసరించడం తేలికవుతుంది. బ్రెయిన్‌కి ప్రశ్నలు వెళితే దానికి సమాధానం తెల్సుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అదే ఏకాగ్రత కుదరకపోవడం. ఎలాగంటే ఉదాహరణకు మీరు చదువుతున్నపుడు ఇంటి ముందుగా ఏదైనా బ్యాండ్‌మేళం శబ్దం వినపడిందనుకోండి... ‘‘అది పెళ్ళిదా లేకపోతే ఏదైనా దేవుడి ఊరేగింపా...’’ వగైరా ప్రశ్నలు మనకు తెలీకుండానే బ్రెయిన్‌కి చేరతాయి. వాటికి సమాధానాలు తెల్సుకోవాలని తహతహలాడుతుంది. దాంతో మీ ఏకాగ్రత చెదురుతుంది. అందుకే చదివేటప్పుడు చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. ఇలా జరగకుండా ఉండడానికి మార్గం ఏమిటంటే... బ్రెయిన్‌ను ఎప్పటికప్పుడు స్టడీస్‌కు, సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలతో నింపేస్తూ ఉండడం{బెయిన్‌కి టార్గెట్ ఫిక్స్ చేస్తే ఆటోమేటిగ్గా దాన్ని చేరుకునేందుకు సిద్ధపడుతుంది. లక్ష్యం లేకుండా చదవవద్దు. ‘‘ఈ గంటలో నేనీ చాప్టర్ ఫినిష్ చేయాలి. ఈ అరగంటలో ఈ రివిజన్ పూర్తయిపోవాలి’’ లాంటి లక్ష్యంతోనే చదవడం ప్రారంభించాలి. -
రెండు రోజుల్లో టీఆర్ఎస్ తొలి జాబితా
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నగర మేయర్ పదవిపై అధికార టీఆర్ఎస్లో జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. మేయర్ రేసులో సీనియర్ నేతలతో పాటు కొందరు కొత్త నేతల పేర్లు సైతం వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ మాత్రం ఎన్నికల అనంతరమే మేయర్ అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. పార్టీ తరపున బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను రెండు రోజుల్లో విడుదల చేయడానికి టీఆర్ఎస్ కసరత్తులు చేస్తోంది. తొలి జాబితాను 45 మంది అభ్యర్థులతో ప్రకటించనున్నట్లు సమాచారం. -
సర్వేకి సర్వం సిద్ధం
సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 19న గ్రేటర్లో నిర్వహించనున్న సమగ్ర కుటుంబ (సామాజిక, ఆర్థిక ఇంటింటి) సర్వేకు జీహెచ్ఎంసీ ప్రణాళికను సిద్ధం చేసింది. జనగణన సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్యూమరేషన్ బ్లాకుల వారీగా దీన్ని నిర్వహించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ఎన్యూమరేటర్లను నియమించనున్నారు. వీరి పనితీరును సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకునేందుకు వీరిపైన క్లస్టర్ సూపర్వైజర్లను..వారి పైన వార్డు సూపర్వైజర్లను నియమించాలని నిర్ణయించారు. వార్డు సూపర్వైజర్లే నోడల్ అధికారులుగానూ వ్యవహరించనున్నారు. వీరి వివరాలతో కూడిన జాబితాను సిద్ధం చేసే పనిని ఇప్పటికే ప్రారంభించారు. నోడల్ ఆఫీసర్లపైన డిప్యూటీ కమిషనర్లు/అడిషనల్ కమిషనర్లు/ జోనల్ స్థాయి కమిషనర్లు పూర్తి స్థాయిలో పర్యవేక్షించనున్నారు. వీరికి ఎప్పటికప్పుడు తగిన సూచనలిచ్చే బాధ్యతలను జీహెచ్ఎంసీ కమిషనర్ నిర్వర్తిస్తారు. శుక్రవారం నుంచి వివిధ స్థాయిల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్ 25-30 ఇళ్లను సర్వే చేయాల్సి ఉంటుంది. మొత్తం 20వేల మంది ఎన్యూమరేటర్ల సేవలను వినియోగించుకుంటారు. వీరు తమకు సహాయకులుగా ఎన్జీఓలు, కళాశాల విద్యార్థులు తదితరులను నియమించుకోవచ్చు. అవసరాన్ని బట్టి ఒక్కో ఎన్యూమరేటర్ ఐదుగురి వరకు నియమించుకోవచ్చు. వారికి తగిన శిక్షణనిచ్చి, సాయం తీసుకుంటారు. దాదాపు రెండువేల మంది క్లస్టర్ సూపర్వైజర్లుగా, 250 మంది నోడల్ అధికారులుగా విధులు నిర్వహించనున్నారు. కేంద్రం నుంచి సైన్యం వస్తే వారి సేవలనూ వినియోగించుకుంటారు. ఎన్యూమరేటర్లు.. వారి సహాయకులు వెరసి దాదాపు లక్షమంది విధుల్లో పాల్గొనే అవకాశం ఉంది. సర్వే 19వ తేదీన అయినప్పటికీ, 18వ తేదీ నుంచే ఎన్యూమరేటర్లు తమ పని ప్రారంభించాలని నిర్దేశించారు. తమకు కేటాయించిన ప్రాంతాలకు వెళ్లడం.. ప్రజలకు ముందస్తుగానే సమాచారం ఇవ్వడం తదితర పనులు చేయనున్నారు.ఈమేరకు సర్వేకు సంబంధించి వివిధ స్థాయిల్లోని అధికారులతో జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్లు గురువారం సమావేశం నిర్వహించారు. దీని నిర్వహణపై సూచనలిచ్చారు. -
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల బ్లాక్ మనీ జాబితా సిద్ధం
జురిచ్: నల్లధనం వెలికితీసేందుకు పోరాడుతున్న భారత్‌కు ఉపకరించేలా స్విట్జర్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లించకుండా స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్నట్టు భావిస్తున్న భారతీయుల జాబితాను స్విట్జర్లాండ్ ప్రభుత్వం తయారు చేసింది. ఈ వివరాలను భారత ప్రభుత్వానికి అందజేయనుంది. స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులకు నిజమైన యజమానులను గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా భారతీయ ఖాతాదారుల వివరాలపై నిఘా వేసినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. వ్యక్తిగత, ట్రస్టు, కంపెనీల పేరు మీద దాచిన డబ్బుకు పన్ను చెల్లించలేదని భావిస్తున్న వారి జాబితాను తయారు చేశారు. అయితే వారి వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. ఇరు దేశాల మధ్య ఉన్న సమాచార మార్పు దౌత్య ఒప్పందంలో భాగంగా గోప్యంగా ఉంచాలన్న నిబంధన ఉందని తెలిపారు. భారత ప్రభుత్వంలో కలసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని చెప్పారు. నల్లధనం వెలికితీసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)కు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. -
ఓటరు జాబితా సిద్ధం చేయండి
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: తాజా ఓటరు జాబితాను సిద్ధం చేయూలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఆర్.ఎస్.రాజ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితా తాజా పరుచుట, ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లపై ఓటరు నమోదు అధికారుల(ఈఆర్ఓ)తో కలెక్టర్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 22తో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ముగిసిందన్నారు. నేరుగా, ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. దరఖాస్తును తిరస్కరిస్తే... కారణాలను తెలియజేయాలన్నారు. వీఆర్వోలు తనిఖీలు చేసి సంబంధిత రిజిస్టర్లలో సంతకాలు చేయూలన్నారు. ఓటర్ల వివరాలు అప్డేట్ చేసేందుకు అవసరమైన కంప్యూటర్లను సమకూర్చుకుని డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించుకోవాలన్నారు. జనవరి 4 నాటికి దరఖాస్తులన్నింటినీ పరిష్కరించి ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఆన్లైన్ ద్వారా 62,290 దరఖాస్తులు అందాయని, వాటిలో పెండింగ్ ఉన్నవాటిని త్వరితగతిన పరి ష్కరించాలన్నారు. నవంబర్, డిసెంబర్ నెలలో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో ఫారం-6 లో 38,644, ఫారం-7లో 3,719, ఫారం-8లో 1353, ఫారం-8ఓలో 452 దరఖాస్తులు అందాయన్నారు. డూప్లికేట్, రీ డూప్లికేట్ దరఖాస్తులు అధికంగా ఉన్నాయని, వాటిని జాగ్రత్తగా గమనించాలన్నారు. పేరు, చిరునామా, ఫొటో తదితర వివరాల్లో ఎటువంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఓటర్ల కార్డుల్లో వివరాలు, ఫొటోలు వేర్వేరుగా ఉండడం వల్ల సమస్య లు తలెత్తుతాయన్నారు. జిల్లాకు చెందిన సీనియర్ రోల్ అబ్జర్వర్లు జాబితాలను పరిశీలిస్తారన్నారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి 1200 మంది ఓటర్లు దాటకుండా జాగ్రత్త వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు, పోలింగ్ సిబ్బంది శిక్షణకు, రిజర్వులో ఉంచేందుకు అవసరమైన ఈవీఎంల అంచనాలు తయూరుచేసి ప్రతిపాదనలు పంపించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో అవసరమైన సెక్షన్, రూట్ అధికారుల సంఖ్య, పోలింగ్‌కు అవసరమైన సిబ్బంది వివరాలు అందించాలన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్టు, వ్యయూన్ని పరిశీలించేందుకు మండలాల వారీగా బృందాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. అలాగే, వీడియోగ్రాఫర్ల్ సంఖ్యను తెలపాలన్నారు. సమావేశంలో డీఆర్వో నూర్‌బాషా ఖాసిం, జెడ్పీ సీఈవో టి.కైలాశ్గిరీశ్వర్, ఆర్టీవోలు జి.గణేష్‌కుమార్, వి.విశ్వేశ్వరరావు, ఎన్.తేజ్‌భరత్, డీఆర్డీఏ పీడీ పి.రజనీకాంతరావు, హెచ్.వరప్రసాదరావు, కె.వెంకటేశ్వర్లు, ఆర్.గున్నయ్య, కె.సాల్మన్‌రాజు పాల్గొన్నారు. -
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి : బీజేపీ
మిర్యాలగూడ టౌన్, న్యూస్‌లైన్ : త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతా సాంబమూర్తి పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. శనివారం బీజేపీ పట్టణ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ గుజరాత్ శాఖ తరహాలో బూత్ కమిటీలను వేయాలని అన్నారు. స్థానిక సమస్యలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ సమస్యల పరిష్కరించేందుకు ఉద్యమాలు నిర్వహించాలని అన్నారు. వార్డు ప్రజల సమస్యలను అధికారులకు వివరించి పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. హైదరాబాద్‌లో జరిగిన యువబేరి ఇతర పార్టీలలో గుబులు లేపుతోందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరేల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మిర్యాలగూడ, భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట మున్సిపల్ చైర్మన్లను బీజేపీ కైవసం చేసుకునేలా పాటుపడాలని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ దొండపాటి వెంకట్‌రెడ్డి, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు వనం మధన్మోహన్, రామచంద్రారెడ్డి, ఎడ్ల రమేష్, కమలాకర్‌రెడ్డి, సతీష్, అనిల్, పాపయ్య, నంద, అంకయ్య, శ్రీనివాస్, సైదులు పాల్గొన్నారు.