ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరగదన్నదే తమ అభిప్రాయమన్నారు. బుధవారం గాంధీభవన్‌లో వారిద్దరూ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సమయం, ఇతర పరిస్థితుల దృష్ట్యా నియోజకవర్గాల పునర్విభజన సా ధ్యం కాదనుకుంటున్నట్లు చెప్పారు. ‘‘ఎన్నికల సమయంలో కూటముల ఏర్పాటు ప్రయత్నాలు సహజం.
కూటమి ఏర్పాటుపై పార్టీలో ఏదైనా స్పష్టత వచ్చాక ప్రకటిస్తాం. వచ్చే ఎన్నికల్లో 102 సీట్లు గెలుస్తామని టీఆర్‌ఎస్ చెప్పుకోవడం మా పార్టీ శ్రేణులను బలహీన పరిచేందుకు ఆడుతున్న మైండ్‌గేమ్. రాష్ట్రంలో 62 శాతం మంది రైతులు రెండున్నర ఎకరాల లోపే భూమి కలిగి ఉన్నారు. ఈ లెక్కన మెజారిటీ రైతులకు రూ.2 వేల నుంచి రూ.3 వేల లోపే పెట్టుబడి సాయం అందుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల్లో క్వింటాలుకు రూ.100 తగ్గినా ఇచ్చే పెట్టుబడి సాయం చెల్లుకు చెల్లవుతుంది. అదనంగా రైతులకు ఒరిగేదేమీ ఉండదు’’అని పేర్కొన్నారు. తమ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధంగానే ఉన్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment