uttham kumar reddy
-
తెలంగాణ భారీ అప్పులపై కేంద్రం ప్రకటన
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అప్పులు గణనీయంగా పెరిగాయని కేంద్రం వెల్లడించింది. అంతేకాదు.. ప్రతీ ఏటా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏటా పెరుగుతూనే ఉన్నాయని పూర్తి వివరాలు వెల్లడించిన కేంద్ర ఆర్ధిక శాఖ. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లోకసభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అయిన నాటికి అప్పు రూ. రూ. 75,577 కోట్లు. 2021-22 నాటికి అవి రూ. 2,83,452 కోట్లకు చేరాయి. 2022 అక్టోబర్ నాటికి తెలంగాణ మొత్తం అప్పులు.. రూ. 4,33,817.6 కోట్లు ఉందని కేంద్ర ఆర్ధిక శాఖ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కలిపి చేసిన అప్పుగా పేర్కొంది కేంద్రం. సంవత్సరాల వారీగా తెలంగాణ అప్పులు 2014-15లో రూ. 8,121 కోట్లు 2015-16లో రూ. 15,515 కోట్లు 2016-17లో రూ. 30,319 కోట్లు 2017-18లో రూ. 22,658 కోట్లు 2018-19లో రూ. 23,091 కోట్లు 2019-20లో రూ. 30,577 కోట్లు 2020-21లో రూ. 38,161 కోట్లు 2021-22లో రూ. 39,433 కోట్లు ఇవి కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చినట్లు కేంద్ర ఆర్ధిక శాఖకు నివేదించిన ప్రభుత్వ రంగ బ్యాంకులు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డు, ఇతర కార్పొరేషన్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు.. రూ. 1,50,365.60 కోట్లు తీసుకున్నట్లు వివరాల్లో పేర్కొంది కేంద్రం. దాదాపు 12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు.. రూ. 1,30,365.60 కోట్లు. రూరల్ ఇన్ఫ్రాస్టక్చర్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రూ. 8,871 కోట్లు మంజూరు కాగా.. రూ. 7,144 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్న కేంద్రం. వేర్ హౌస్ ఇన్ఫ్రాస్టక్చర్ ఫండ్ నుంచి రూ. 972 కోట్లు మంజూరు కాగా.. రూ. 852 కోట్లు విడుదల చేశారని, ఫుడ్ ప్రాసెసింగ్ ఫండ్ నుంచి 2015-16, 2016-17లో రూ. 28 కోట్లు మంజూరు కాగా.. రూ. 10 కోట్లు విడుదల అయ్యాయని నాబార్డ్ ఇన్ఫ్రాస్టక్చర్ డవలప్మెంట్ అసిస్టెన్స్ నుంచి వివిధ పథకాల అమలు కోసం రూ. 14,516.65 కోట్లు మంజూరు కాగా.. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 11,424.66 కోట్లు వినియోగించుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. -
సభ్యత్వం చేయకపోతే పదవులు రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేయాలని, సభ్యత్వ నమోదులో క్రియాశీలకంగా పనిచేయనివారికి పార్టీలో భవిష్యత్ ఉండదని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అలాంటి వారికి పదవులు రావడం కష్టమన్నారు. సభ్యత్వ నమోదును ఏఐసీసీ చాలా సీరియస్‌గా పరిగణిస్తోందని, రోజూ ఢిల్లీస్థాయిలో సమీక్షిస్తోందని చెప్పారు. పార్టీ నేతలు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, సమన్వయకర్తలు, బూత్‌స్థాయి ఎన్రోలర్లు సమష్టిగా పనిచేసి 30 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన గాం«దీభవన్‌లో డిజిటల్ సభ్యత్వ నమోదుపై పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. పార్టీ బలోపేతానికి, రానున్న ఎన్నికల్లో గెలుపునకు సభ్యత్వాలు చాలా కీలకమని, ప్రతి పోలింగ్ బూత్‌లో కనీసం 100 మందిని పార్టీ సభ్యులుగా చేర్పించాలని చెప్పారు. ఫిబ్రవరి 9న మళ్లీ దీనిపై సమీక్షించనున్నారు. 11 గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, డిజిటల్ సభ్యత్వ నమోదు రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త హర్కర వేణుగోపాల్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు అడిగితే దాడులా? రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఏడేళ్లుగా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఎన్నికల హామీ అయిన నిరుద్యోగ భృతిని మూడేళ్లయినా అమలుపర్చలేదని, ఈ విషయాలను అడిగేందుకు ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడికి వెళ్లిన యూత్ కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ నేతలు దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలో యూత్ కాంగ్రెస్ నేత రవికాంత్గౌడ్పై ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అనుచరులు దాడి చేశారని, జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిలో పోలీసుల అత్యుత్సాహం కారణంగా కార్యకర్త శ్రీనివాస్ నాయక్ కాలు విరిగిందని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యమం ఉధృతం చేస్తాం: శివసేనారెడ్డి ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడిలో భాగంగా వినతిపత్రాలు సమరి్పంచేందుకు వెళ్లిన యువజన కాంగ్రెస్ నేతలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఎమ్మెల్యేలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. దేశంలోనే నంబర్ 1 నల్లగొండ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పార్టీ సభ్యత్వ నమోదులో నల్లగొండ పార్లమెంటరీ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచిందని గాం«దీభవన్ వర్గాలు చెప్పాయి. ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో 3.50 లక్షల సభ్యత్వం నమోదైందన్నాయి. దీని పరిధిలోని హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 76,252, సూర్యాపేటలో 73,697, కోదాడలో 55,682, మిర్యాలగూడలో 38,456, దేవరకొండలో 38,380, నాగార్జునసాగర్‌లో 57,260, నల్లగొండలో 8,711 సభ్యత్వాలను ఈ నెల 29 నాటికి పూర్తి చేసినట్టు చెప్పాయి. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో భారీస్థాయిలో సభ్యత్వాలు నమోదయ్యాయి. -
టిఆర్ఎస్, బీజేపీ ఒక్కటే
-
రేపటి నుంచి దుబ్బాకలోనే ఉంటా : ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి దుబ్బాక ఎన్నికకు సంబంధించి మంగళవారం వీడియో కాన్ఫరరెన్స్ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..' దుబ్బాక అభ్యర్థి పేరు హైకమాండ్ పరిశీలనలో ఉంది.. అభ్యర్థి పేరు రేపు ప్రకటిస్తాం. యావత్ కాంగ్రెస్ కుటుంబ ఎన్నికగా దుబ్బాక ఎన్నికను నేతలు సహకరించాలి.7 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రపంచంలో ఎక్కడా లేని అవినీతి చోటుచేసుకుంది.సీఎం నుంచి వీఆర్వో వరకు ప్రతీ ఒక్కరూ దోచుకుంటున్నారు.కేసీఆర్ సీఎం అయ్యాక.. తెలంగాణను భ్రష్టు పట్టించాడు. ఎవరూ డబ్బు పంపిణీ చేసిన.. ఓట్లు మాత్రం కాంగ్రెస్‌కు వేయాలి. (చదవండి : సోలీపేట సుజాతను గెలిపిద్దాం : హరీష్ రావు) తెలంగాణ అమరవీరులకు న్యాయం చేశాడా.. అన్యాయం చేశాడా అనేది ఈ ఎన్నికతో తేలిపోవాలి. దుబ్బాక ఎన్నికల సందర్భంగా అధికార దుర్వినియోగం చేస్తే ఏ చేసేందుకైన సిద్ధం గా ఉన్నాం. రేపటి నుంచి నేను దుబ్బాక లో ఉంటా. గ్రాడ్యుయేట్ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేయించండి. ఎల్ఆర్ఎస్ స్కీం ద్వారా ప్రభుత్వం దోపిడీ చేస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాట ఇస్తున్న.. దయచేసి పైసలు కట్టొద్దు.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఫ్రీగా చేస్తాం.'అని పేర్కొన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ..' దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం నేతలందరూ కృషి చేయాలి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు కీలకం. నేతలందరూ ఓటు నమోదును సీరియస్‌గా తీసుకోవాలి. ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం డబ్బులు కొల్లగొట్టాలని చూస్తోంది.డబ్బులు చెల్లించవద్దని కాంగ్రెస్ కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలి. రెండున్నర ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అప్పుడు ఫ్రీగా రెగ్యులరైజ్ చేస్తాం.' అంటూ తెలిపారు. (చదవండి : దుబ్బాక ఉప ఎన్నికలు: కోవిడ్ నిబంధనలు) ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. దౌల్తాబాద్ మండలంలో 8వ తేదీన ఘనంగా మీటింగ్ నిర్వహించనున్నాం. బేషజాలకు వెళ్లకుండా ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని నా విజ్ఞప్తి. 2023 ఎన్నికలకు దుబ్బాక ఎన్నిక నాంది. కాంగ్రెస్ పార్టీకి గట్టి నాయకత్వం ఉంది. దుబ్బాకలో వచ్చే 15 రోజులు కష్టపడితే విజయం తధ్యం.నాకు కేటాయించిన ప్రాంతాల్లో ఇతర పార్టీల కంటే 5వందలు లేదా 1000 ఓట్లు అధికంగా తెచ్చే ప్రయత్నం చేస్తా. ' అంటూ వెల్లడించారు. -
భువనగిరి బరిలో కోమటిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బరిలోకిదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆయన చేసిన ప్రతిపాదనకు అధిష్టానం సమ్మతించినట్టు సమాచారం. నల్లగొండ నుంచి గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన వెంకటరెడ్డికి భువనగిరి నియోజకవర్గంతో విస్తృత సంబంధాలు ఉన్నాయి. నకిరేకల్, తుంగతుర్తి, మునుగోడు, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెంకటరెడ్డితోపాటు ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలతో సత్సంబంధాలు ఉన్నాయి. 2009లో ఇక్కడి నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన రాజగోపాల్‌రెడ్డి 2014లో సమీప ప్రత్యర్థి బూర నర్సయ్య గౌడ్ చేతిలో 30వేల పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు. ప్రస్తుతం మునుగోడు నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ అనుకూలతలను విశ్లేషించడంతో అధిష్టానం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యర్థిత్వంపై సుముఖత వ్యక్తం చేసినట్టు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. కాగా ఈ అంశంపై కోమటిరెడ్డి సోదరులు మీడియాతో మాట్లాడుతూ ‘పోటీలో నిలిపేందుకు పార్టీ సుముఖంగా ఉంది. రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటాం’అని పేర్కొన్నారు. నల్లగొండ నుంచి ఉత్తమ్? నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శాసనసభ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైనప్పటికీ తెలంగాణ నుంచి కొన్ని ఎంపీ స్థానాలను గెలుచుకోవడానికి వీలుగా గట్టి అభ్యర్థులను నిలబెట్టాలని అధిష్టానం చూస్తుండగా.. నల్లగొండ నుంచి తాను బరిలో ఉండేందుకు సిద్ధమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రతిపాదించినట్టు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన హుజూర్నగర్ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కోదాడలో ఆయన సతీమణి పద్మావతి రెడ్డి ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. నల్లగొండ లోక్‌సభ నుంచి ప్రస్తుతం లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి 2009లో, 2014లో కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. నల్లగొండ నుంచి 6 సార్లు సీపీఐ అభ్యర్థి గెలవగా, 6 సార్లు కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. రెండుసార్లు టీడీపీ అభ్యర్థి గెలిచారు. ఒకసారి సీపీఎం అభ్యర్థి, ఒకసారి తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థి గెలుపొందారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఊపుతో ఇక్కడ కూడా జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతోంది. ఈ లోక్‌సభ పరిధిలో దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, నల్లగొండ శాసనసభ స్థానాలు ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్ పార్టీకి విస్తృతంగా కార్యకర్తల బలం ఉండటంతో పా టు తన సామాజిక వర్గ ఓటుపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విశ్వాసంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇవే అంశాలను ఏఐసీసీ కూడా పరిగణనలోకి తీ సుకుని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. -
సరైన కారణం లేకుండా అసెంబ్లీని రద్దు చేశారు
-
తన గొయ్యి తానే తవ్వుకున్నాడు : ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్ : నియంతృత్వ, నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడిన ఉత్తమ్... సరైన కారణం లేకుండా అసెంబ్లీని రద్దు చేశారని మండిపడ్డారు. గడువు ముగియకముందే అసెంబ్లీని రద్దు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర్ రావు తన గొయ్యి తానే తవ్వుకున్నారని వ్యాఖ్యానించారు. ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగానే ఉందని, తాము క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
ఏం చేద్దాం... ఎలా వెళ్దాం?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ రద్దు అవుతుందని, డిసెంబర్లో ఎన్నికలు వస్తాయనే సంకేతాలతో టీపీసీసీ ముఖ్యులు మరోమారు భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం జాంబాగ్‌లోని మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ నివాసంలో సమావేశమై రాజకీయ పరిణామాలను బట్టి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. సమావేశంలో భాగంగా గురువారం కేసీఆర్ తీసుకునే నిర్ణయం వెలువడిన అనంతరం తాము ఏం చేయాలనే దానిపై చర్చించినట్టు తెలుస్తోంది. సీఎం ఏ నిర్ణయం తీసుకున్నా తాము ఎన్నికలకు సిద్ధమైపోవాలని, కార్యక్రమాలను ముమ్మరం చేయాలని నిర్ణయించినట్టు సమావేశంలో పాల్గొన్న సీనియర్ నేత ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం, శ్రీనివాస కృష్ణన్, మధుయాష్కీ, దామోదర రాజనర్సింహ, డీకే.అరుణ, శ్రీధర్‌బాబు, రేవంత్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి, పటోళ్ల శశిధర్‌రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, భిక్షపతియాదవ్, విష్ణు, విక్రంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. డీఎస్‌ను ఆహ్వానిస్తాం: రాజనర్సింహ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానిస్తామని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడుతూ డీఎస్ రాకను తాము స్వాగతిస్తామని, అయితే పదవులు, సీట్ల విషయం పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. తమ పార్టీని ఎవరూ విడచివెళ్లరని, అన్నీ ఊహాగానాలేనన్నారు. తెలుగుదేశం ఓ రాజకీయ పార్టీ అని, మరో రాజకీయ పార్టీగా దానితో కలసి వెళ్లడంలో తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. ఏదైనా పొత్తుల విషయం హైకమాండ్ చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. -
పీసీసీ అధికార ప్రతినిధిగా అర్జున్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధికార ప్రతినిధిగా బానోతు అర్జున్ బాబు నియమితులయ్యారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కస్నాతండాకు చెందిన అర్జున్.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా క్రియాశీలకంగా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
ఉత్తమ్‌వి ఉత్తర కుమార ప్రగల్భాలు
సాక్షి, హైదరాబాద్: తమ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. అయినా ఈ విషయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసాలతో ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కల్ల అని, అందుకే ఆ పార్టీ నేతలు నోటికొచ్చిన హామీలిస్తున్నారని విమర్శించారు. బుధవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో కలసి జూపల్లి విలేకరులతో మాట్లాడారు. పింఛన్లు, మహిళా సంఘాలకు రుణాలు, అభయహస్తం, సెర్ప్ ఉద్యోగుల విషయంలో ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలను జూపల్లి ఖండించారు. తెలంగాణ రాకముందు రాష్ట్రవ్యాప్తంగా రూ. 835.64 కోట్ల పింఛన్లు ఇస్తే, తాము ఏటా రూ. 5,301.83 కోట్ల ఆసరా పింఛన్లుగా ఇస్తున్నామని మంత్రి చెప్పారు. అలాగే 1998–2014 మధ్య మహిళా సంఘాలకు రూ. 16 వేల కోట్ల రుణాలు అందగా గత మూడున్నరేళ్లలోనే తాము రూ. 22,301 కోట్ల రుణాలిచ్చామన్నారు. దీనికి అదనంగా రూ. 4,555 కోట్లను స్త్రీనిధి ద్వారా అందించామని చెప్పారు. అభయహస్తం కింద లబ్ధి పొందేవారిలో 1,16,848 మందికి ఆసరా కింద పింఛన్లు ఇస్తున్నామని, వారి కోసం ప్రత్యేక పథకానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. వారి ద్వారా కట్ చేసుకునే బీమా మొత్తాన్ని తీసుకోవడం లేదని, అయినా సహజ మరణం పొందితే రూ. 75 వేలు, ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ. 4 లక్షలు అందేలా రాష్ట్రంలోని 78 లక్షల మందికి వర్తింపజేసే పథకాన్ని త్వరలోనే ప్రవేశపెడతామని జూపల్లి చెప్పారు. సెర్ప్ ఉద్యోగుల వేతనాలను గణనీయంగా పెంచిన ఘనత తమదేనన్నారు. ఈ విషయాలన్నింటినీ ప్రజలు అర్థం చేసుకోవాలని, మేనిఫెస్టోలో ఇస్తామని చెప్పకుండానే తాము ఇస్తున్నామని, అదే కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్పి కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేదని ఆయన ఎద్దేవా చేశారు. పింఛన్లలో జాప్యం నిజమే... రిజర్వు బ్యాంకు నుంచి రాష్ట్రానికి నగదు రావడంలో సమన్య వచ్చినందున గత నెలలో పింఛన్ల విషయంలో ఇబ్బంది వచ్చిన మాట వాస్తవమేనని మంత్రి జూపల్లి తెలిపారు. అలాగే అభయహస్తం పింఛన్ల కింద 2017 ఫిబ్రవరి నుంచి బకాయి ఉన్నమాట కూడా నిజమేనని చెప్పారు. ఉపాధి హామీ వేతనాల కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సరిగా రావడం లేదని, అయినా రాష్ట్ర బడ్జెట్ నుంచి తీసి ఇస్తున్నామని, అందుకే కొంత జాప్యం జరుగుతోందన్నారు. ఏదిఏమైనా పథకాల అమల్లో ఉన్న ఇబ్బందులు తొలగించుకుని ముందుకెళుతున్న తమను విపక్షాలు విమర్శించడం సరికాదన్నారు. -
‘ముందస్తు’కు మేం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరగదన్నదే తమ అభిప్రాయమన్నారు. బుధవారం గాంధీభవన్‌లో వారిద్దరూ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సమయం, ఇతర పరిస్థితుల దృష్ట్యా నియోజకవర్గాల పునర్విభజన సా ధ్యం కాదనుకుంటున్నట్లు చెప్పారు. ‘‘ఎన్నికల సమయంలో కూటముల ఏర్పాటు ప్రయత్నాలు సహజం. కూటమి ఏర్పాటుపై పార్టీలో ఏదైనా స్పష్టత వచ్చాక ప్రకటిస్తాం. వచ్చే ఎన్నికల్లో 102 సీట్లు గెలుస్తామని టీఆర్ఎస్ చెప్పుకోవడం మా పార్టీ శ్రేణులను బలహీన పరిచేందుకు ఆడుతున్న మైండ్‌గేమ్. రాష్ట్రంలో 62 శాతం మంది రైతులు రెండున్నర ఎకరాల లోపే భూమి కలిగి ఉన్నారు. ఈ లెక్కన మెజారిటీ రైతులకు రూ.2 వేల నుంచి రూ.3 వేల లోపే పెట్టుబడి సాయం అందుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల్లో క్వింటాలుకు రూ.100 తగ్గినా ఇచ్చే పెట్టుబడి సాయం చెల్లుకు చెల్లవుతుంది. అదనంగా రైతులకు ఒరిగేదేమీ ఉండదు’’అని పేర్కొన్నారు. తమ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధంగానే ఉన్నారని చెప్పారు. -
దేశానికి, కాంగ్రెస్‌కు శుభపరిణామం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టనుండటం పార్టీకే కాకుండా యావత్ దేశానికి కూడా శుభ పరిణామమని తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. సోమవారం ఢిల్లీలోని ఏఐ సీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌గాంధీ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా టీకాంగ్రెస్ నేతలు కూడా రాహుల్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ నామి నేషన్ పత్రాలను పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. సోమవారం గడువు ముగిసే సమయానికి ఇతర నేతలెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ ఎన్నిక లాంఛన ప్రాయమేనని నేతలు పేర్కొన్నారు. కాగా కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి నామినేషన్‌కు ముందు రాహుల్ గాంధీని కలసి శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అధికారంలోకి వస్తాం.. రాహుల్ నామినేషన్ కార్యక్రమం అనంతరం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర నేతలు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని రాహుల్‌గాంధీ చేపట్ట నుండటం పార్టీతో పాటు దేశానికి శుభపరిణామమని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర కాంగ్రెస్ తరఫున రాహుల్ అభ్యర్థి త్వాన్ని ప్రతిపాదిస్తూ 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశామన్నారు. కింది స్థాయి కార్యకర్త నుంచి నాయకుల వరకు అందరికీ రాహుల్ ఎన్నిక ఉత్తేజాన్ని కలిగిస్తోందని.. రాహుల్ నాయకత్వంపై అందరికీ పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఇప్పటిదాకా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలను రాహుల్‌గాంధీకి ఆపాదించడం సరికాదన్నారు. 2019 ఎన్నికల్లో రాహుల్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అభ్యుదయ భావాలతో దేశాన్ని ముందుకు నడపగలిగే సత్తా ఉన్న నేత రాహుల్ అని సీనియర్ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాహుల్ నాయ కత్వంలో పార్టీ ముందుముందు అత్యున్నత శిఖరాలకు చేరుకుంటుందని షబ్బీర్ అలీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ రాక కోసం పార్టీలోని యువత ఎంతగానో ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే గీతారెడ్డి అన్నారు. వారసత్వ రాజకీయంగా రాహుల్‌గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని చేపడుతున్నారన్న బీజేపీ విమర్శలను రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఖండించారు. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబం నుంచి రాహుల్‌గాంధీ పార్టీ అధ్యక్ష పీఠానికి అర్హుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
'అనాలోచిత నిర్ణయం.. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం'
హైదరాబాద్: నోట్ల రద్దు చర్య మోదీ అనాలోచిత నిర్ణయమని, దీని వలన దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని టీసీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. శనివారం గాంధీభవన్‌లో నిర్వహించిన టీపీసీసీ సమావేశంలో.. నోట్ల రద్దు విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణను ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. జనవరి రెండో తేదీన జిల్లా కేంద్రాల్లో ప్రెస్మీట్లు, 5,6,7వ తేదీల్లో కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే జనవరి 9న మహిళలతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 11వ తేదీన ఏఐసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో భారీ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
జీహెచ్ఎంసీ ఎన్నికల భయంతోనే చట్ట సవరణ
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎలక్షన్ యాక్ట్‌ను సవరించడం చట్ట వ్యతిరేకం అని టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల చట్టాన్ని సవరించిదన్నారు. ఉన్నతాధికారులంతా సీఎం కేసీఆర్‌కు తొత్తులుగా మారారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. చట్ట సవరణను కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. -
'క్రాస్ ఓటింగ్ జరగనివ్వం'
హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీ ఏ ఉద్దేశంతో ఐదో అభ్యర్థిని ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దింపుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. శాసనసభ్యుల కోటా నుంచి శాసనమండలికి కాంగ్రెస్ అభ్యర్థిగా బీసీ మహిళ అయిన ఆకుల లలితకు అవకాశం ఇచ్చామన్నారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించి, ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకోవాలని టీఆర్ఎస్ చూస్తోందని విమర్శించారు. 'అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు 22 మంది ఉన్నారు, వారంతా మా పార్టీకే ఓటేస్తారు. క్రాస్ ఓటింగ్ జరగకుండా సుప్రింకోర్టు నుంచి డైరెక్షన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము' అని తెలంగాణ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి అన్నారు. -
కార్మికులకు ద్రోహం చేసే చట్టాలు
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు అండగా నిలుస్తూ కార్మికులకు ద్రోహం చేసేలా చట్టాలను రూపొందిస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. మేడే సందర్భంగా శుక్రవారం గాంధీభవన్‌లో ఐఎన్టీయూ ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో ఉత్తమ్‌కుమార్ ఐఎన్టీయూసీ పతాకాన్ని ఎగరేశారు. ఈ కార్యక్రమాన్ని కార్మిక విభాగం అధ్యక్షుడు ప్రకాశ్‌గౌడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి పథాన దేశ ం దూసుకుపోవాలంటే విదేశీ పెట్టుబడులు రావాలని, అయితే ఇందుకోసం ప్రజలను బానిసలుగా చేసే చట్టాలను రూపొందిస్తూ భూములను ధారాదత్తం చేస్తామంటే మాత్రం కాంగ్రెస్ ఊరుకోదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభను కనబరిచిన కార్మికులను ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో సన్మానించారు. మరోవైపు కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉండగా కార్మికుల కోసం అనేక విప్లవాత్మక చట్టాలు చేసిందని, ప్రతిపక్షంలో ఉన్నపుడు కార్మికుల సంక్షేమానికి పోరాటాలు చేసిందని టీపీసీసీ అధికార ప్రతినిధి మల్లురవి ఓప్రకటనలో పేర్కొన్నారు. -
ప్రజలకు ఎందుకు దూరమయ్యాం
కాంగ్రెస్ బలోపేతంపై డీఎస్ కమిటీ సమాలోచనలు సంప్రదాయ ఓటు బ్యాంకుకు గండిపడిందని అభిప్రాయం హైదరాబాద్: కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటుబ్యాంకుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, యువత, రైతులు, మహిళలు దూరమవడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని టీపీసీసీ హైపవర్ కమిటీ అభిప్రాయపడింది. రాష్ర్టంలో వైఎస్సార్సీపీ పోటీ చేయడం వల్ల కూడా కాంగ్రెస్‌కు నష్టం జరిగిందని భావిస్తోంది. కన్వీనర్ డి.శ్రీనివాస్ అధ్యక్షతన కమిటీ సభ్యులు సోమవారం గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నందు వల్ల సెటిలర్లు పార్టీని దెబ్బతీశారని, ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేశారని, మైనారిటీలు కూడా పార్టీకి వ్యతిరేకంగా తీర్పునివ్వడంతో ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని ఈ సందర్భంగా కమిటీ అంచనాకు వచ్చింది. అనంతరం డి.శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ వచ్చేనెల రెండో వారంకల్లా పార్టీ సభ్యత్వ కార్యక్రమం ముగియగానే జిల్లా పర్యటనలను ప్రారంభిస్తామని, పార్టీ నాయకత్వానికి వంద రోజుల్లో నివేదికను అందజేస్తామని తెలిపారు. వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు వారానికి రెండు జిల్లాల చొప్పున పర్యటనలు చేపడతామన్నారు. సమస్యలు పట్టని సీఎం: ఉత్తమ్ సీఎం కేసీఆర్‌కు ప్రజల సమస్యలు పట్టడం లేదని, ఆయన ధ్యాసంతా పార్టీ ఫిరాయింపులపైనేనని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. సోమవారం రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌లో చెత్తపోయిందని, నిఖార్సైన కార్యకర్తలు మిగిలారన్నారు. కార్యకర్తలకు అన్యాయం జరిగితే నాయకత్వం అండగా ఉంటుందని, ఇందుకోసం గాంధీభవన్‌లో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి.కుంతియా మాట్లాడుతూ సభ్యత్వాన్ని సత్వరమే పూర్తిచేసి, పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క పాల్గొన్నారు. ఇదిలాఉండగా, రంగారెడ్డి జిల్లా నేతల సమావేశంలో మాజీమంత్రి మల్రెడ్డి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌లు ముఖ్యనేతల మధ్యే పరోక్షంగా పరస్పర విమర్శలు చేసుకోవడం జిల్లా కాంగ్రెస్‌లో విభేదాలను బట్టబయలు చేసింది. -
పొన్నాల.. నెరవేరిన కల
సాక్షి, హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడిగా పనిచేయాలనేది పొన్నాల లక్ష్మయ్య చిరకాల వాంఛ. గత దశాబ్ద కాలంగా పొన్నాల పీసీసీ పీఠం కోసం ఢిల్లీలో ఎక్కని గడప లేదు. కలవని నేత లేరు. నాలుగోసారి తన ప్రయత్నాన్ని సఫలం చేసుకున్నారు.2003 నుంచి ఇప్పటి వరకు ఐదుసార్లు పీసీసీ అధ్యక్ష నియామకం చేపట్టారు. 2003లో డి.శ్రీనివాస్, 2005లో కె.కేశవరావు, 2008లో మళ్లీ డి.శ్రీనివాస్ 2011లో బొత్స సత్యనారాయణ కు పీసీసీ పగ్గాలు అప్పగించారు. వీరంతా ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావటం విశేషం. బొత్స తూర్పుకాపు సామాజికవర్గ నేతకాగా, మిగిలిన ముగ్గురూ మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందినవారు. తాజాగా ఐదోసారి కూడా మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన పొన్నాల లక్ష్మయ్యను పీసీసీ అధ్యక్షుడిగా నియమించటం గమనార్హం. తెరపైకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి... విశ్వసనీయ సమాచారం మేరకు.. తొలుత జానారెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ మూడు రోజుల కిందటే నిర్ణయించింది. అయితే.. టీడీపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎంగా నియమిస్తానంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటన చేశారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలు దూరమవుతుండటాన్ని గమనించిన రాహుల్‌గాంధీ ఆయా వర్గాలకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే జానారెడ్డిని పక్కనపెట్టి పొన్నాలను నియమించినట్లు ఏఐసీసీ వర్గాలు చెప్తున్నాయి. అలాగే.. రెడ్డి సామాజికవర్గాన్ని పూర్తిగా పక్కనపెట్టారనే సంకేతాలు వెళితే తెలంగాణలో రాజకీయంగా పట్టున్న ఆ సామాజికవర్గమంతా కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసే ప్రమాదం ఉందని భావించిన అధిష్టానం పెద్దలు కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించి.. పార్టీకి విధేయుడైన కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఆ పదవిలో నియమించినట్లు తెలిసింది. కాగా తెలంగాణలో జరిగే ఎన్నికలకు పార్టీ పరంగా అయ్యే ఖర్చునంతా తానే భరిస్తానని పొన్నాల హైకమాండ్ పెద్దలకు ప్రతిపాదించినట్లు చెప్తున్నారు. -
ఫిబ్రవరి నెలాఖరులోగా.. తెలంగాణ ఏర్పాటు ఖాయం
హుజూర్నగర్, న్యూస్‌లైన్ వచ్చే ఫిబ్రవరి చివరి నాటికి ప్రత్యే క తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం ఖాయమని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. హుజూర్‌నగర్‌లోని ఇందిరాభవన్‌లో ఐఎన్టీయూసీ అనుబంధ విద్యుత్ ఉద్యోగుల 327 యూనియన్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను గురువారం సాయంత్రం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విద్యుత్ ఉద్యోగుల పాత్ర కీలకమైందన్నారు. నూతన రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రత్యేక కృషి చేయనున్నట్లు తెలిపారు. విద్యుత్‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కేంద్రం నుంచి వేల మెగావాట్ల విద్యుత్ తెచ్చుకునేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి నివేదించేందుకు తెలంగాణ మంత్రులం సిద్ధమయ్యామన్నారు. సమర్థవంతమైన విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగులను ప్రత్యేక రాష్ట్రంలో పర్మనెంట్ చేస్తామని, తక్కువ వేతనాలున్న వారికి పెంచుతామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఇప్పటికే 15 సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తికాగా మరో 5 నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. అంతేగాక దిర్శించర్లలో రూ.10 కోట్లతో 120 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయించడంతో పాటు మరో రూ.65 కోట్లతో 220 కేవీ సబ్‌స్టేషన్‌ను ముత్యాలనగర్ వద్ద నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్ ఉద్యోగులకు ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ముందుగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి విద్యుత్ ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు యరగాని నాగన్నగౌడ్, ఎన్డీసీఎంఎస్ చైర్మన్ జిల్లేపల్లి వెంకటేశ్వర్లు, ఏపీఎస్ఐడీసీ డెరైక్టర్ సాముల శివారెడ్డి, యూనియన్ నాయకులు వెంకటేశ్వరరావు, ముత్తయ్య, సురేష్, నర్సిం హారెడ్డి, రాంరెడ్డి, సైదులు, ధర్మారావు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.