కార్మికులకు ద్రోహం చేసే చట్టాలు
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు అండగా నిలుస్తూ కార్మికులకు ద్రోహం చేసేలా చట్టాలను రూపొందిస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. మేడే సందర్భంగా శుక్రవారం గాంధీభవన్‌లో ఐఎన్‌టీయూ ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో ఉత్తమ్‌కుమార్ ఐఎన్‌టీయూసీ పతాకాన్ని ఎగరేశారు. ఈ కార్యక్రమాన్ని కార్మిక విభాగం అధ్యక్షుడు ప్రకాశ్‌గౌడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధి పథాన దేశ ం దూసుకుపోవాలంటే విదేశీ పెట్టుబడులు రావాలని, అయితే ఇందుకోసం ప్రజలను బానిసలుగా చేసే చట్టాలను రూపొందిస్తూ భూములను ధారాదత్తం చేస్తామంటే మాత్రం కాంగ్రెస్ ఊరుకోదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభను కనబరిచిన కార్మికులను ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో సన్మానించారు. మరోవైపు కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉండగా కార్మికుల కోసం అనేక విప్లవాత్మక చట్టాలు చేసిందని, ప్రతిపక్షంలో ఉన్నపుడు కార్మికుల సంక్షేమానికి పోరాటాలు చేసిందని టీపీసీసీ అధికార ప్రతినిధి మల్లురవి ఓప్రకటనలో పేర్కొన్నారు.