'క్రాస్ ఓటింగ్ జరగనివ్వం' | we try to stop cross-voting during mlc elections | Sakshi
Sakshi News home page

'క్రాస్ ఓటింగ్ జరగనివ్వం'

Published Thu, May 21 2015 3:18 PM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

'క్రాస్ ఓటింగ్ జరగనివ్వం' - Sakshi

'క్రాస్ ఓటింగ్ జరగనివ్వం'

హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీ ఏ ఉద్దేశంతో ఐదో అభ్యర్థిని ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దింపుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. శాసనసభ్యుల కోటా నుంచి శాసనమండలికి కాంగ్రెస్ అభ్యర్థిగా బీసీ మహిళ అయిన ఆకుల లలితకు అవకాశం ఇచ్చామన్నారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించి, ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకోవాలని టీఆర్ఎస్ చూస్తోందని విమర్శించారు.


'అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు  22 మంది ఉన్నారు, వారంతా మా పార్టీకే ఓటేస్తారు. క్రాస్ ఓటింగ్ జరగకుండా సుప్రింకోర్టు నుంచి డైరెక్షన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము' అని తెలంగాణ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement