Cross-voting
-
దళం... విచ్ఛిన్నం
పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఎనిమిది మందిపై వేటు కార్యకర్తల సమావేశంలో జేడీఎస్ అధిష్టానం నిర్ణయం క్రాస్ ఓటింగ్ ఎమ్మెల్యేలపై కార్యకర్తల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం దిష్టి బొమ్మల దహనం = కార్యకర్తలను శాంతింపజేసిన దేవెగౌడ ఆ ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేయాలని నేడు స్పీకర్‌కు ఫిర్యాదు బెంగళూరు : రాజ్యసభ ఎన్నికలు జేడీఎస్ పార్టీలో చిచ్చురేపాయి. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటాన్ని అధిష్టానం జీర్ణించుకోలేకపోతోంది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసిన ఎనిమిది మంది జేడీఎస్ పార్టీ శాసనసభ్యులపై సస్పెన్షన్ వేటు వేస్తూ జేడీఎస్ అధినాయకత్వం ఆదివారం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని దళం నాయకులు స్పీకర్ కాగోడు తిమ్మప్పను సోమవారం కోరనున్నట్లు సమాచారం. రాష్ట్ర శాసనసభ నుంచి శాసనమండలి, రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ అభ్యర్థులైన వెంకటపతి, ఫారూక్‌లు ఓటమి పొందిన విషయం తెలిసిందే. ఇందుకు జమీర్ అహ్మద్‌ఖాన్ నేతృత్వంలోని ఎనిమిది మంది శాసనసభ్యులు క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడటమే కారణమని జేడీఎస్ అధినాయకులు భావించారు. దీంతో చామరాజపేట నియోజకవర్గ శాసనసభ్యుడు జమీర్ అహ్మద్‌ఖాన్‌తో పాటు చలువరాయస్వామి (నాగమంగల), హెచ్.సీ బాలకృష్ణ(మాగడి), గోపాలయ్య (మహాలక్ష్మీ లేఅవుట్), ఇక్బాల్ అన్సారి (గంగావతి), రమేష్ బండి సిద్దేగౌడ (శ్రీరంగపట్టణ), భీమానాయక్ (అగరిబొమ్మనహళ్లి), అఖండ శ్రీనివాస్ మూర్తి (పులకేశినగర)లను పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తూ జేడీఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో ఆదివారం జరిగిన జేడీఎస్ కార్యకర్తలు, పదాధికారుల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి వై.ఎస్.వీ దత్త సస్పెన్షన్ తీర్మానాన్ని చదవి వినిపించారు. కార్యకర్తల, అధినాయకుల ఆక్రోశం... బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో ఆదివారం జేడీఎస్ పార్టీ కార్యకర్తల బహిరంగ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేక నినాదాలు చేశారు. వారి ఫెక్సీలను, దిష్టిబొమ్మలను తగుల బెట్టారు. వెంటనే ఎనిమిది మంది ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో పార్టీ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ కలుగజేసుకుని వారిని శాంతింపజేశారు. మరికాసేపట్లో జరిగే పార్టీ పదాధికారుల సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ...‘జమీర్ అహ్మద్‌ఖాన్ తనకు ఉన్న ధనబలం వల్ల విర్రవీగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ డబ్బే అతన్ని గెలిపిస్తుందేమో చూస్తా. 2007 అక్టోబర్‌లోనే జమీర్ అహ్మద్‌ఖాన్, చలువరాయస్వామి, బాలకృష్ణలు కుమారస్వామికి విరుద్ధంగా కుతంత్రాలు పన్నారు. అప్పుడే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉండాల్సింది. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇక వారు మన పార్టీ సభ్యులు కాదు.’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ధైర్యముంటే శాసనమండలి, రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు జేడీఎస్ పార్టీకి రాజీనామ చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని బృహత్ సమావేశంలో పాల్గొన్న పార్టీ శాసనసభ్యుడు రేవణ్ణ సవాలు విసిరారు. -
ఎమ్మెల్యేలకు రహస్య కోడ్?
పార్టీ నుంచి క్రాస్ ఓటింగ్ జరగకుండా ఒక్కో ఎమ్మెల్యేకు రహస్య కోడ్‌ను ఇవ్వాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. శని ఆది వారాల్లో మాక్ ఓటింగ్ నిర్వహించి, నాయకత్వం సూచించిన తరహాలో సభ్యులు ఓటు వేస్తారా అన్నది పరీక్షించడంతో పాటు వారికి తగిన శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇందుకుగాను, టీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఎవరికి ఎవరెవరు మొదటి, రెండో ప్రాధాన్యత ఓటు వేయాలో ముందుగానే నిర్ణయించి తదనుగుణంగా ఎమ్మెల్యేలకు కోడ్లను కేటాయిస్తారు. ఒక్కో ఎమ్మెల్సీని గెలిపించుకోవడానికి 18 ఓట్లు అవసరమైనపుడు, అంత సంఖ్యలో సభ్యులు లేకుంటే, అంతకన్నా తక్కువ సంఖ్య సభ్యుల్ని బృందంగా ఖరారు చేస్తారు. వారంతా ఒక అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసేందుకు నిర్ణయించి, వారి రెండో ప్రాధాన్యత ఓటును మాత్రం వేర్వేరు అభ్యర్థులకు కేటాయిస్తారు. ఎమ్మెల్యేలను ఐదు గ్రూపులుగా విభజించి, అదే పద్ధతిన ఐదు ఎమ్మెల్సీ అభ్యర్థులకు విడగొట్టి, అందులో ఒక్కో గ్రూపులోని రెండో ప్రాధాన్యత ఓట్లను ఇతర గ్రూపుల్లోని అభ్యర్థులకు వేసేలా రహస్య కోడ్లు జారీ చేస్తారని చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించే వారికి మాత్రమే ఐదు గ్రూపుల్లోని మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరెవరికి పడ్డాయో తెలుస్తుంది. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడితే వెంటనే గుర్తించవచ్చు. నిజానికి టీఆర్ఎస్ ఏ విధానాన్ని అనుసరించాలనుకుంటున్నది ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నారు. మాక్ ఎలా నిర్వహిస్తారు, అసలు ఎన్నికకు ఏ విధానాన్ని అనుసరిస్తారు అన్నది శనివారం నాటికి ఓ స్పష్టత వచ్చే ఆస్కారముంది. ఇటువంటి సందర్భాల్లో అయిదుగురిని గెలిపించుకోవాలనుకుంటున్నపుడు, మొదటి ముగ్గురు అభ్యర్థులకి ప్రథమ ప్రాధాన్యత ఓట్లు అవసరమైన కనీస సంఖ్యకు తగ్గకుండా కేటాయిస్తారు. నాలుగు, ఐదవ అభ్యర్థులకు మాత్రం ప్రథమ ప్రాధాన్యత ఓట్లు ఒకటి, రెండు తగ్గించి (అందుబాటులో ఉన్న మొత్తం సంఖ్య ప్రకారం) కేటాయిస్తారు. మొత్తం సభ్యులు జాగ్రత్తగా రెండో ప్రాధాన్యత ఓటును వీరికే వేసేలా వ్యూహరచన చేస్తారు. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడకుండా, పార్టీ నాయకత్వం చెప్పినట్టే అనుసరించిందీ లేనిదీ నిర్దారించుకోవడానికి, మూడో, నాలుగో ప్రాధాన్యతా ఓటును కూడా వ్యూహం ప్రకారమే ఒక్కో సభ్యునికి ఒక్కో విధంగా నిర్ణయించి, ఫలితాల అనంతరం విశ్లేషిస్తారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ కసరత్తు
ఐదుగురు అభ్యర్థులనూ గెలిపించుకునే యత్నాలు క్రాస్ ఓటింగ్ జరగకుండా చర్యలు మాక్ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయం కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించే కార్యక్రమం హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార టీఆర్ఎస్ దృష్టిసారించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ క్రాస్ ఓటింగ్ జరగకుండా సకల జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం జూన్ ఒకటో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఐదు స్థానాలకు పోటీ పడుతున్న అధికార టీఆర్ఎస్ ఎలాగైనా అన్నింటినీ దక్కించుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఆధారంగా టీఆర్ఎస్కు నాలుగు ఎమ్మెల్సీలు ఖాయంగా వస్తాయి. కానీ ‘అంకెల గారడి’తో ఐదో స్థానాన్ని దక్కించుకోవచ్చునని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ముఖ్యంగా తమ ఎమ్మెల్యేలు గట్టు దాటకుండా చూసుకుంటోంది. ఏమాత్రం పొరపాటు జరిగి తప్పుగా ఓట్లేసినా, ఉద్దేశపూర్వకంగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినా అనుకున్నన్ని సీట్లు రావు. టీడీపీ సైతం తమ అభ్యర్థి గెలుపును సవాలుగా తీసుకుని పెద్ద మొత్తంలో సొమ్ములు గుమ్మరించే యోచనలో ఉండడం, టీఆర్ఎస్లోని అసంతృప్త ఎమ్మెల్యేలపై దృష్టి పెట్టడంతో అధికార పార్టీ మరింత జాగ్రత్త పడుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో అత్యధికులు కొత్తగా గెలిచిన వారు కావడం, తొలిసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొంటున్నందున వారికి అవగాహన కల్పించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. శుక్రవారం(29న) టీఆర్ఎస్ శాసనసభాపక్షం(టీఆర్ఎస్ఎల్పీ) సమావేశంకానుంది. ఈ సమావేశంలోనే ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను కేటాయిస్తారని చెబుతున్నారు. ఎమ్మెల్యేలు ఎవరెవరికి ఏ ఏ ప్రాధాన్య ఓటు వేయాలో వివరిస్తారు. ఈ కేటాయింపు పూర్తయ్యాక, మాక్ పోలింగ్ కూడా నిర్వహిస్తారని సమాచారం. సీఎం కేసీఆర్ స్వయంగా ఎమ్మెల్యేలకు ఓటింగ్‌పై అవగాహన కల్పిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓట్ల విభజనపై తర్జనభర్జన.. టీఆర్ఎస్ చేతిలో ఉన్న 76 ఓట్లతో నాలుగు స్థానాలు మాత్రమే గెలుచుకోవచ్చు. ఐదో అభ్యర్థి కోసం ఎంఐఎం మద్దతు తీసుకున్నా మరో ఏడు ఓట్లు అవసరం. ఇతర పార్టీల నుంచి ఓట్లను క్రాస్ చేయించడం తప్పనిసరి అన్న ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీకున్న ఓట్లతోనే జాగ్రత్తగా ప్లాన్ చేస్తే ఐదుగురు అభ్యర్థులను గెలిపించుకోవచ్చని సోమవారం నాటి కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ మంత్రులతో అన్నట్లు సమాచారం. దీంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఒక్కో ఎమ్మెల్సీకి ఎన్ని ఓట్లు అవసరమన్న సందేహం తలెత్తుతోంది. అధికారులు చెబుతున్న సాధారణ లెక్కల ప్రకారమైతే ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం సాధించడానికి 18 ఓట్లు అవసరం. దీని ప్రకారమే ఎమ్మెల్యేలను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. టీఆర్ఎస్లో ప్రస్తుతం ఇదే తర్జనభర్జన జరుగుతోందని చెబుతున్నారు. -
'క్రాస్ ఓటింగ్ జరగనివ్వం'
హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీ ఏ ఉద్దేశంతో ఐదో అభ్యర్థిని ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దింపుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. శాసనసభ్యుల కోటా నుంచి శాసనమండలికి కాంగ్రెస్ అభ్యర్థిగా బీసీ మహిళ అయిన ఆకుల లలితకు అవకాశం ఇచ్చామన్నారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించి, ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకోవాలని టీఆర్ఎస్ చూస్తోందని విమర్శించారు. 'అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు 22 మంది ఉన్నారు, వారంతా మా పార్టీకే ఓటేస్తారు. క్రాస్ ఓటింగ్ జరగకుండా సుప్రింకోర్టు నుంచి డైరెక్షన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము' అని తెలంగాణ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి అన్నారు. -
తిరక్రాసు
గేటర్ క్రాస్ ఓటింగ్ ఒక్క పార్టీకే పరిమితం కాని ఓటరు లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల మధ్య ఓట్లలో వ్యత్యాసం సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ ఓటర్లు తమ తీర్పును ఏ ఒక్క పార్టీకో పరిమితం చేయలేదు. ఒకే ఓటరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పార్టీకి ఓటు వేస్తే.. లోక్‌సభ నియోజకవర్గంలో మరో పార్టీకి ఓటేశారు. ఇందుకు కారణాలనేకం. కేంద్రంలో ఒక పార్టీ ఉంటే బాగుంటుందని ఆలోచించిన ఓటరే.. రాష్ట్రానికి వచ్చేటప్పటికి మరోపార్టీపై మొగ్గు చూపాడు. అలాగే.. నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థిని సైతం పరిగణనలోకి తీసుకున్నాడు. అభ్యర్థుల పనితీరు.. అందుబాటులో ఉండే తీరు.. తదితర అంశాలతో ఒకే ఓటరు భిన్నమైన పార్టీలకు ఓటేశాడు. దీంతో పార్లమెంట్-అసెంబ్లీ స్థానాలకు క్రాస్ ఓటింగ్ జరిగింది. మిత్రపక్షాల పొత్తులోనూ ఇది కనిపించింది. టీడీపీ-బీజేపీల మధ్య పొత్తు ఉన్నప్పటికీ ఓట్లలో అన్ని చోట్లా అది కనిపించలేదు. ఎంపీగా బీజేపీకి ఓటేసిన ఓటరు ఎమ్మెల్యేగా టీడీపీకి ఓటు వేయని పరిస్థితి ఉంది. ఉదాహరణకు.. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ నుంచి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థికి 65,355 ఓట్లు రాగా, అసెంబ్లీ అభ్యర్థికి 50,898 ఓట్లు మాత్రమే లభించాయి. అంటే.. బీజేపీ ఎంపీ అభ్యర్థికి పడినన్ని ఓట్లు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థికి లభించలేదు. ఇలా.. పలు సెగ్మెంట్లలో పలు వ్యత్యాసాలున్నాయి. ఎంఐఎంకు యాకుత్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పార్లమెంట్ అభ్యర్థికి 83,081 ఓట్లు రాగా, అసెంబ్లీ అభ్యర్థికి కేవలం 66,843 ఓట్లు మాత్రమే లభించాయి. అంటే దాదాదపు 16 వేల ఓట్లకు పైగా క్రాస్ ఓటింగ్ జరిగింది. అలాగే బీజేపీకి మలక్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఎంపీ అభ్యర్థికి 41,825 ఓట్లు రాగా, అసెంబ్లీ అభ్యర్థికి 35,713 ఓట్లు మాత్రమే దక్కాయి. అంటే ఆరువేల ఓట్లకు పైగా క్రాస్ ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి గోషామహల్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎంపీ అభ్యర్థికి 16,912 ఓట్లు మాత్రమే రాగా, అదే అసెంబ్లీ అభ్యర్థికి 45,964 ఓట్లు లభించాయి. అంటే.. దాదాపు 29 వేల ఓట్లు క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థికి ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెం ట్లో 37,823 ఓట్లు రాగా, అదే సెగ్మెంట్ నుంచి ఎంపీ అభ్యర్థికి 27,226 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే దాదాపు 10 వేల తేడా. ఇలా పలు సెగ్మెంట్లలో క్రాస్ ఓటింగ్ జరిగింది.. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలు.. వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో (సెగ్మెంట్లలో) ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లు ఇలా ఉన్నాయి. ఒకే పార్టీకి అసెంబ్లీలో తక్కువ ఓట్లు వచ్చిన చోట అదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు రావడాన్ని.. పార్లమెంట్ స్థానానికి ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తక్కువ ఓట్లు వచ్చిన చోట అదే పార్టీ అసెంబ్లీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు రావడాన్నీ దిగువ పట్టికల ద్వారా గమనించవచ్చు. -
ఆదిలాబాద్‌లో భారీగా క్రాస్ ఓటింగ్
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మినహాయించి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నగేష్‌కు నియోజకవర్గంలో 72,673 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ అభ్యర్థికి 56,906 ఓట్లు మాత్రమే వచ్చాయి. నగేష్‌కు ఓటు వేసిన వారిలో 15,767 మంది అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్నకు ఓటు వేయలేదు. ఆ ఓట్లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మళ్లాయి. క్రాస్ ఓటింగ్ కానిపక్షంలో ఆ ఓట్లతో కలుపుకుంటే సుమారు 30 వేల మెజార్టీ రామన్నకు దక్కేది. గత ఉప ఎన్నికల్లో 33 వేల మెజార్టీ సాధించిన రామన్న 14,711 మాత్రమే సాధించడం గమనార్హం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా ఆదిలాబాద్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి పాయల శంకర్, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి రాథోడ్ రమేశ్(టీడీపీ) పోటీ చేశారు. పాయల శంకర్‌కు 43,664, రాథోడ్ రమేశ్‌కు 21,555 ఓట్లు మాత్రమే వచ్చాయి. శంకర్‌కు పడిన ఓట్ల నుంచి 22,109 ఓట్లు టీడీపీకి కాకుండా ఇతరులకు మళ్లాయి. టీఆర్ఎస్ ఈ ఓట్లు భారీగా దక్కించుకుంది. కాంగ్రెస్ నుంచి ఆదిలాబాద్ నియోజకవర్గ అభ్యర్థి భార్గవ్‌దేశ్‌పాండేకు 29,964 ఓట్లు రాగా అదే పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థి నరేష్ జాదవ్‌కు 37,488 ఓట్లు పడ్డాయి. భార్గవ్ కంటే 7,524 ఓట్లు నరేష్‌కు అధికంగా వచ్చాయి. ఈ ఓట్లు కూడా టీఆర్ఎస్కే మళ్లాయి. -
నేడు ‘సార్వత్రిక’ ఓట్ల లెక్కింపు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రోజుకో సమీకరణ.. సమీక్ష, కొంతసేపు ఉత్సాహం... ఆ వెంటనే నిరుత్సాహం. గతం లో ఎన్నడూ లేని విధంగా తిరిగాం... డబ్బు ఖ ర్చు పెట్టాం కదా! అన్న ధీమా. ఆ కొద్దిసేపటికే ఎన్నికల నిధులు నేరుగా ఓటర్లుకు చేరాయా? ద్వితీయ శ్రేణి నాయకుల వద్ద ఆగిపోయాయా? ఓ సర్వేలో అనుకూలం.. మరోటి ప్రతికూలం.. ఇలా సార్వత్రి క ఎన్నికలలో పోటీ చేసిన లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులలో సాగిన ఉత్కంఠకు శుక్రవా రం తెరపడనుంది. సర్వేలు, సొంత లెక్కలను కట్టిపెట్టి ‘గుబులు గుబులుగా గుండెల దడగా’ అభ్యర్థులు, వారి అనుచరులు ఓట్ల లెక్కింపు కేంద్రాలకు హాజరుకానున్నారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల ఫలితాలు ప్రధాన పార్టీలకు కొంత మోదం, ఇంకొంత ఖేదం కలిగించగా.. ఆ ఎన్నికలు ఫలితాలు సైతం ప్రధాన పార్టీల నేతలను ఆందోళనకు గురి చేశాయి. ఏదీ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్న నేతలను ఓ వైపు సర్వేలు.. మరో వైపు క్రాస్ ఓటింగ్ భయపెడుతుండగా వారి భవితవ్యం నేడు తేలనుంది. టెన్షన్.. టెన్షన్ ప్రధాన రాజకీయ పార్టీల నేతలలో శుక్రవారం మధ్యాహ్నం వరకు ఉత్కంఠ కొనసాగనుంది. ఏప్రిల్ 30న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో సుమారు 16 రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నవారిలో మళ్లీ నేడు వెలువడే ఫలితాలు గుబులు రేపుతున్నా యి. వరుసగా మూడు ఎన్నికలు, సుమారుగా రెండు నెలలపాటు విరామ మెరుగని ప్రచారంతో అలసిన నేతల భవితవ్యం తేలనుంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు ఇందూరు జిల్లాలో కీలకంగా మారాయి. రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా, నిజామాబాద్ పార్లమెంట్, కామారెడ్డి, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలపై అందరి దృష్టి నెల కొంది. పోటీ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ స్థానాలలో కాంగ్రెస్ ప్రముఖులు డీఎస్, షబ్బీర్‌అలీ, సుదర్శన్‌రెడ్డి, సురేష్‌రెడ్డిల గెలుపు ఓటములపై చర్చ ఆసక్తికరంగా మారింది. హోరాహోరిగా సాగిన పోరులో గెలుపుపై అందరూ ధీమా వ్యక్తం చేస్తుండటంతో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ఆసక్తికరం నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పోటీ చేయగా బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ, సిట్టింగ్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పోటీపై ఆసక్తి నెలకొంది. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, గంప గోవర్ధన్, హన్మంత్ సింధే, కొత్తగా వివిధ పార్టీల నుంచి బరిలో దిగిన సింగిరెడ్డి రవీం దర్‌రెడ్డి, అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పెద్దపట్లోళ్ల సిద్ధార్థరెడ్డి, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, నాయుడు ప్రకాశ్ తదితరుల గెలుపు ఓటములపై చర్చ జరుగుతోంది. అయితే పోలింగ్ శాతం, సరళిని అంచనా వేస్తూ పోటీలో ఉన్న అభ్యర్థులు మాత్రం ఎవరికీ వారే గెలుపు ధీమాను వ్యక్తం చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. డిచ్పల్లి సీఎంసీ వేదికగా నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి 16 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 101 మంది పోటీలో ఉన్నారు. మొత్తం తొమ్మిది నియోజకవర్గాలలోని 2,057 పోలింగ్ కేంద్రాలలో 5,332 ఈవీఎంలు ఏర్పాటు చేశారు. 18,52,970 మంది ఓటర్లకు 13,25,045 మంది (71.51 శాతం) తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. డిచ్పల్లి సమీపంలోని సీఎంసీ కళాశాలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భద్రపరిచారు. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవనుండగా, డిచ్పల్లి సీఎంసీ వేదిక అభ్యర్థుల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ డాక్టర్ తరుణ్‌జోషి భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, పారా మిలటరీ బలగాలను మోహరించిన అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల అనుమతి, కౌంటిం గ్ పాసులు ఉంటేనే ఎవరినైనా అనుమతించే అవకాశం ఉంది. -
‘అందోల్’ ఫలితాలపై ఆసక్తి
జోగిపేట, న్యూస్‌లైన్: అందోల్ నియోజకవర్గ విజేత ఎవరనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. దీనికి కారణం మాజీ డిప్యూటీ సీఎం ఇక్కడి నుంచి పోటీ చేయడమే. దామోదర్ రాజనర్సింహకు పోటీగా టీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ మంత్రి, సినీ నటుడు పి.బాబూమోహన్ బరి లో ఉన్నారు. గతంలో కూడా వీరిద్దరూ పోటీ పడగా నువ్వా? నేనా అన్నట్లు ఫలితాలు వ చ్చాయి. దీంతో ఈ సారి కూడా ఫలితాలు ఎలా ఉంటాయోనని అందరూ ఆత్రుతగా ఎ దురు చూస్తున్నారు. అయితే ఫలితాలపై ఇద్ద రు అభ్యర్థులు మాత్రం ధీమాతో ఉన్నారు. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో ఎ మ్మెల్యే సీటు కూడా తమదేనని ఆ పార్టీ కార్యకర్తలు ఆశతో ఉన్నారు. అయితే ఈ రెండు ఎన్నికలకు భిన్నంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ంటాయని టీఆర్ఎస్ నాయకులు భరోసాతో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సి.దామోదర్ రాజనర్సింహ సీఎం అభ్యర్థిగా ప్రచారం జరుగగా, టీఆర్ఎస్ను గెలిపిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. మెజార్టీపై ధీమాలు ఎన్నికల్లో 30వేల మెజార్టీతో గెలుపొందుతామంటూ మాజీ డిప్యూటీ సీఎం సి.దామోదర్ రాజనర్సింహ ధీమాతో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో ధీమా రెట్టింపయ్యింది. తాము చేపట్టిన అభివృద్దే తమకు ఓట్లు రాల్చిందని, రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా ప్రజలు గుర్తించారని ఆయన పేర్కొంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాబూమోహన్ మాత్రం 20వేల మెజార్టీతో విజయం సాధిస్తానని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ కీలకపాత్ర పోషించాడని, టీఆర్ఎస్ గాలితో తాను తప్పకుండా గెలుస్తామన్న ధీమాతో ఉన్నారు. భారీగా ఓట్లు సంపాదించనున్న వైఎస్ఆర్సీపీ అందోల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సంజీవరావు పోటీలో ఉండడంతో భారీగా ఓట్లు పొందే అవకాశం ఉంది. నియోజకవర్గంలో దివంగత నేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన అభివృద్ది పథకాలు చాలా ఉన్నాయి. సింగూరు కాలువల నిర్మాణానికి నిధులను, పెన్షన్లు, పెద్ద ఎత్తున పొందిన లబ్ధిదారులున్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ సీపీ తన ప్రచారంతో దూసుకుపోయారు. ఎంపీ అభ్యర్థుల క్రాస్ ఓటింగ్ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థుల మద్దతుదారులు భారీగా క్రాస్ ఓటింగ్ పాల్పడ్డట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ మద్దతుదారులు భారీ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. ఒక్కో మండలంలో ఒక్కోరకంగా పార్టీలకు మద్దతునిచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి బిబి పాటిల్ మద్దతుదారులు సైతం ఇలాంటి చర్యలకే పాల్పడ్డట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రాస్ ఓటింగ్ కారణంగా ఏ పార్టీకి అనుకూలం, ఏ పార్టీకి ప్రతి కూలంగా మారతాయన్నది తెలువాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. -
గుబులు రేపుతున్న తిరక్రాస్ ఓటింగ్!
సాక్షి ప్రతినిధి,విజయనగరం : బంధుత్వాలు, సన్నిహిత సంబంధాలు, మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలతో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన నాయకులు క్రాస్ ఓటింగ్‌కు పిలుపునిచ్చారు. ఒకటి అటు, ఒకటి ఇటు అంటూ లోపాయికారిగా విస్తృతంగా ప్రచారం చేశారు. ఓటు వేయడానికి వెళ్లే ముందు కూడా ఓటర్లకు ఇదే చెప్పారు. మొత్తానికి ఒత్తిళ్లు, ఇతరత్రా కారణాలతో చాలాచోట్ల క్రాస్ ఓటింగ్ పడినట్టు ప్రచారం జరుగుతోంది. కానీ ఈ క్రాస్ ఓటింగ్‌లో చాలా మంది తప్పులో కాలేసినట్టు తెలిసింది. పోలింగ్ బూత్‌లో ఎంపీకి ఒకటి, ఎమ్మెల్యే అభ్యర్థిని ఎన్నుకోడానికి మరొక ఈవీఎంను ఏర్పాటు చేశారు. క్రాస్ ఆలోచనలో తికమకకు గురై ఎంపీకి వేద్దామని ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యేకి వేద్దామనుకుని ఎంపీకి ఓటువేసిన వారు చాలామంది ఉన్నారు. బయటకొచ్చాక పక్కనున్న వారు చెప్పిన తర్వాత అసలు విషయాన్ని తెలుసుకుని నాలిక కరుచుకున్నారు. విజయనగరంలో మీసాల గీత అనుచరులు పలువురు ఎమ్మెల్యే ఓటు తమకి, ఎంపీ ఓటు బొత్స ఝాన్సీలక్ష్మీకి వేయాలని లోపాయికారీ పిలుపునివ్వడంతో పలువురు అదే తరహాలో ఓటేసినట్టు తెలిసింది. ఓటర్లు తడబడటంతో టీడీపీకీ రావాల్సిన ఓట్లు చాలావరకు ఆ పార్టీ కోల్పోయినట్టు సమాచారం. మీసాల గీత అనుచరుల నిర్వాకాన్ని పసిగట్టిన అశోక్ వర్గం టీడీపీ నాయకులు పలువురు అందుకు ప్రతీకారంగా ఎమ్మెల్యే ఓటు కోలగట్ల వీరభద్రస్వామికి, ఎంపీ ఓటు అశోక్‌గజపతిరాజుకు వేసినట్టు నగరంలో ఇప్పటికే విసృ్తతంగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నాయకులు కూడా లోపాయికారిగా క్రాస్ ఓటింగ్‌కు పిలుపునివ్వడంతో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి యడ్ల రమణమూర్తికి నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరంలో కూడా సామాజికవర్గం కోణంలో టీడీపీ నాయకులు పలువురు ఎంపీ ఓటు విషయంలో క్రాస్ ఓటింగ్‌కు పిలుపునిచ్చారు. దీంతో ఇక్కడ కూడా అశోక్ గజపతిరాజు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. చాలా మంది ఎమ్మెల్యేకి వేయవలసిన ఓటు ఎంపీకి, ఎంపీకి వేయవలసిన ఓటు ఎమ్మెల్యేకి వేశారు. దీంతో ఆ రెండు పార్టీలు నష్టపోయాయి. ఇక, బొబ్బిలిలో టీడీపీ నాయకులు ఎంపీ ఓటును కాంగ్రెస్‌కు వేయాలని పిలుపునిచ్చినట్టు తెలిసింది. ఇక్కడ కూడా అశోక్ ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. సాలూరు టీడీపీలో పలువురు ఎమ్మెల్యే ఓటు రాజన్నదొరకు, ఎంపీ ఓటు సంధ్యారాణికి వేయాలని పిలుపునివ్వడంతో ఆ ప్రక్రియ గుట్టుగా జరిగిపోయింది. దీంతో భంజ్‌దేవ్‌కు నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. కురుపాం టీడీపీలో ఎంపీ ఓటు వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్‌కు వేయాలన్న లోపాయికారీ పిలుపుతో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి అంచనాలు తలకిందులయ్యాయి. ఇదే తరహాలో కాంగ్రెస్‌లో కూడా క్రాస్ ఓటింగ్ జరగడంతో పరిస్థితి అయోమయంగా తయారైంది. క్రాస్ ఓటింగ్ విషయాన్ని తెలుసుకున్న ఆ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. క్రాస్ ఓటింగ్ పరిణామాల కారణంగా ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయన్న ఇషయాన్ని ఆయా పార్టీలు అంచనా వేసుకోలేకపోతున్నాయి. ఒక్క వైఎస్సార్సీపీ మాత్రం క్రాస్ ఓటింగ్ జోలికి పోకపోవడంతో ఆ పార్టీ అభ్యర్థులకు అటువంటి భయం లేకుండా పోయింది. ఈ క్రాస్ ఓటింగ్ తమకు కలిసొస్తుండడంతో మరింత మెజార్టీ పెరుగుతుందని ధీమాతో ఆ పార్టీ నేతలున్నారు. -
క్రాస్‌ఓటింగ్... గుబులు
ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు చతురత చూపారు. ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు కాకుండా వేర్వేరు పార్టీల అభ్యర్థులకు ఓట్లేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీల మధ్య జరిగినట్లుగా భావిస్తున్న క్రాస్ ఓటింగ్ ఇప్పుడు అభ్యర్థుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఓటరు ఏ పార్టీ వైపు మొగ్గుచూపాడో తేల్చుకోలేక ఆందోళన చెందుతున్నారు..!! సాక్షిప్రతినిధి, నల్లగొండ, ఈ ఎన్నికల్లో దాదాపు ప్రతి నియోజకవర్గంలో బహుముఖ పోటీలే జరిగాయి. దీంతో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయి...? గెలుపు ఎవరి ఖాతాలో పడుతుంది..? అన్న అంశాలు చర్చనీయాంశమయ్యాయి. ప్రధానంగా ఈ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ఓట్లు క్రాస్ అయినట్లు భావిస్తున్నారు. అభ్యర్థుల గుణగణాలు, సామాజిక నేపథ్యం, పార్టీ వ్యవహారశైలిపై ఒక అంచనాకు వచ్చిన ఓటర్లలో మెజారిటీ ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను కాకుండా వేర్వేరుగా ఎంచుకుని, క్రాస్ ఓటింగ్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ పరిణామమే అభ్యర్థులను కలవరపరుస్తోంది. అయితే, క్రాస్ ఓటింగులో ఓట్ల బదలాయింపు ఏ మేరకు జరిగిందనే అంశంపైనే అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మండలాలు, గ్రామాల వారీగా ఓటింగ్ సరళిపై సమాచారం సేకరించుకున్న ఆయా పార్టీల అభ్యర్థులు క్రాస్ ఓటింగ్‌పై బూత్‌ల వారీగా ఆరా తీస్తున్నారు. ఓటర్ల వ్యవహార శైలి లోక్‌సభ అభ్యర్థుల్లో గుబులు రేపుతోంది. ఒకే పార్టీకి అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీ అభ్యర్థులకు ఓటు వేస్తారని ఆశించిన అభ్యర్థులకు ఈ సారి ఎదురు దెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. శాసనసభలో ఒక అభ్యర్థికి మొగ్గుచూపిన ఓటర్లు, పార్లమెంట్ అభ్యర్థి విషయానికి వచ్చేసరికి మరో పార్టీని ఆదరించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల్లో ఇదే పరిణామం చోటు చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. టీడీపీ ఓట్లే ... భారీగా క్రాసింగ్ నల్లగొండ లోక్‌సభ స్థానం పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు, టీడీపీ, బీజేపీల నుంచి స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో ఈ ఓట్ల క్రాసింగ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్లగొండ నియోజకవవర్గంలో టీడీపీ ఓటర్లు స్వతంత్ర అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి వైపు మొగ్గుచూపినట్లు చెబుతున్నారు. కాగా, ఎంపీ అభ్యర్థి విషయంలో మరో పార్టీకి మొగ్గుచూపినట్లు ప్రచారం జరుగుతోంది. దేవరకొండ నియోజకవర్గంలో టీడీపీ అభిమాన ఓటర్లు, తమ ఎంపీ అభ్యర్థి వైపు నిలిచినా, ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో ప్రత్యామ్నాయం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మిర్యాలగూడ నియోజకవర్గంలో టీడీపీ అంచనాలు తారుమారయ్యాయి. ఎంపీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డికి జై కొట్టినవారే ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో మాత్రం మరో పార్టీ అభ్యర్థిని ఆదరించినట్లు సమాచారం. ఇదే పరిస్థితి నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కూడా టీడీపీ ఎదుర్కొంటోంది. ఎంపీ అభ్యర్థి చిన్నపరెడ్డి పక్షాన నిలబడినా, అసెంబ్లీ అభ్యర్థి విషయంలో టీడీపీని కాదనుకున్నారని వినికిడి. హుజూర్‌నగర్‌లో కూడా టీడీపీ ఓటర్లు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థికి మొగ్గుచూపినా, ఎమ్మెల్యే అభ్యర్థికి పడాల్సి ఓట్లు ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులకు స్థానిక పరిస్థితుల దృష్ట్యా చీలిపోయినట్లు సమాచారం. కాగా, కోదాడ నియోజకవర్గంలో దీనికి భిన్నంగా కాంగ్రెస్‌లోని ఓ వర్గం ఓట్లు టీడీపీకి క్రాస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో టీడీపీ ఓట్లు కూడా క్రాస్ అయినట్లు తెలుస్తోంది. భువనగిరి లోక్‌సభ స్థానంలోనూ ఇదే పరిస్థితి భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలో కూడా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు చెబుతున్నారు. ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల విషయంలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి ఓట్లేసిన ఆ పార్టీ అభిమాన ఓటర్లు, ఎమ్మెల్యే విషయంలో మాత్రం మరో పార్టీ అభ్యర్థి వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో టీ డీపీ అభిమాన ఓటర్లు ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా నిలిచినా, ఎంపీ అభ్యర్ధి బరిలో ఉన్న పార్టీ బీజేపీ కాదని, ఇతర పార్టీ ఎంపీ అభ్యర్థికి మొగ్గు చూపారని తెలుస్తోంది. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో లేకపోవడంతో ఆ పార్టీ ఓట్లు చిల్లంకల్లం అయినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి పడిన ఓట్లలో మెజారిటీ ఓట్లు అసెంబ్లీ అభ్యర్థి విషయానికి వచ్చే సరికి కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐని కాదని మరో పార్టీని ఎంచుకున్నట్లు సమాచారం. ఇలా, మొత్తంగా జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీల మధ్య ఓట్లు భారీగానే క్రాస్ అయినట్లు ప్రచారం జరుగుతుండడంతో ఎవరికి వారు ఆందోళనగానే గడుపుతున్నారు. దీనికి తెర దించాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి. -
క్రాస్ ఓటింగ్ కలవరం
సాక్షి, మంచిర్యాల : సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను క్రాస్ ఓటిం గ్ భయం పట్టుకుంది. తమకు పడాల్సిన ఓట్లు బరిలో నిలిచిన ఇతరుల ఖాతాలో చేరిపోయాయేమో అనే సందేహం వారి లో నెలకొంది. క్రాస్ ఓటింగ్ పెద్ద ఎత్తున జరిగితే అది తమ గెలుపునకే గండికొట్టే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ అండతోనే ఎన్నికలు జరిగాయి అనేది స్పష్టమైనా ఆ ఓట్లు త మకు ఏ మేరకు అండగా జత కూడాయో తేల్చుకునే పనిలో ఉన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారు రంగంలో ఉన్నా వారిపై ఉన్న వ్యతిరేకతతో ఇతరులకు ఓటువేస్తే అది అభ్యర్థుల భవితవ్యాన్నే మార్చనుంది. పొత్తులున్నా దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఇతర పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేసిన దాఖలాలు కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఈ విషయాన్ని బరిలో నిలిచిన కొందరు అభ్యర్థులతోపాటు ఆయా పార్టీలకు చెందిన పలువురు నాయకులు అంగీకరించడం గమనార్హం. అన్ని స్థానాల్లోనూ ఇదే పరిస్థితి.. బీజేపీ-టీడీపీ పొత్తుల్లో క్రాస్ ఓటింగ్ స్ప ష్టంగా కనిపించింది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లలోని బీజేపీ శ్రేణులు పార్లమెంట్ ఓటును మిత్రపక్షాల అభ్యర్థికి కాకుండా మరో ఉ ద్యమ పార్టీకి వేసినట్లు రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని జిల్లాలో ఉన్న మూడు అసెం బ్లీ నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెల కొంది. ఆయా చోట్ల బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఓటును తమ పార్టీ నేతకు వేసి ఎంపీ ఓటును మరో పార్టీకి వేసినట్లు సం బంధిత పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఒ క ఓటు అటు.. మరో ఓటు ఇటు అని లె క్కలు వేసుకుని వెళ్లినవారు పరిస్థితుల ప్రభావంతో కాస్త గందరగోళానికి గురైనట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి తాము ముందుగా వేసే ఓటు ఎంపీ అభ్యర్థికో లేదా ఎమ్మెల్యే అభ్యర్థికో స రైన అవగాహన లేదు. దీంతో వారు ఫలా నా పార్టీకి ఓటు వేస్తున్నాం అని భావించి ఇంకో పార్టీకి సై అన్నారేమో అనే భావన వ్యక్తమవుతోంది. తొలుత వేసే ఓటు ఎం పీకి, తర్వాతిది ఎమ్మెల్యే ఖాతాలోకి వె ళ్తుంది. ఈ విషయమై స్పష్టమైన అవగాహన కల్పించకపోవడంతో క్రాస్ ఓటింగ్ పెద్ద ఎత్తున్నే జరిగి ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా క్రాస్ ఓటింగ్‌తో ఆధారంగా సదరు నాయకుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని రాజ కీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఎవరి లెక్క వారిదే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎన్నికల సమరం ముగిసింది. ఇక కౌంటింగ్ తేదీ వరకు నిరీక్షణ మిగిలింది. మధ్యలో వివిధ పార్టీల అభ్యర్థులు రకరకాల లెక్కల్లో మునిగితేలుతున్నారు. విజయావకాశాలపై ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు. ‘ఓటర్లు మాకే మొగ్గు చూపారు.. విజయం మాదే’ అని అన్ని పార్టీల అభ్యర్థులు బయటకు చెబుతున్నా..లోలోపల ఓటమి భయం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాము భావించిన వారంతా తమకే ఓటేశారా? వెనుక నడిచినవారు మద్దతిచ్చారా? క్రాస్ ఓటింగ్ కొంపముంచుతుందా? అని తెగ కంగారు పడిపోతున్నారు. కూడికలు.. తీసివేతలు. ఏ బూత్‌లో మైనస్.. ఏ బూత్‌లో ప్లస్ అనే గణాంకాలపై కుస్తీపడుతున్నారు. తమ బంధుమిత్రులు, అనుచరులతో కలిసి బూత్‌లవారీగా పోలింగ్ వివరాలు తెప్పించుకుని మధిస్తున్నారు. విజయావకాశాలపై బేరీజు వేసుకుంటున్నారు. దాదాపు నెలరోజుల పాటు రేయిం బవళ్లు విశ్రాంతి లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు ఇప్పుడు ఇళ్లు, గెస్ట్‌హౌస్‌ల్లో కూర్చుని బుధవారం నాటి పోలింగ్ ట్రెండ్‌ను పసిగట్టే పనిలో పడ్డారు. సమీకరణలు మారిపోయి పరిస్థితి ఎక్కడైనా ప్రత్యర్థులకు అనుకూలంగా మారిందా? నమ్మినవారెవరైనా వెన్నుపోటు పొడిచారా? అని ఆరా తీస్తున్నారు. అంతుపట్టని ఓటరు నాడి! మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి బహుముఖ పోటీ నెలకొనడం, అన్ని పార్టీలు హోరాహోరీగా తలపడిన నేపథ్యంలో ఓటరు నాడిని అభ్యర్థులు పసిగట్టలేకపోతున్నారు. గతం లో ఎన్నడూ లేనంత కొత్తగా ఓటర్లు తీర్పు ఇవ్వనున్నారనే ప్రచారం కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులలో ఆందోళన కలిగిస్తోంది. గెలుపుపై మేక పోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా అంతర్గతంగా ఓటమి భయం వెన్నాడుతోంది. పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగినందున ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతోనే అని అభ్యర్థులు భావిస్తున్నారు. క్రాస్.. చెక్: క్రాస్ ఓటింగ్ అభ్యర్థుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఏ పార్టీవైపు మొగ్గు చూపాలో తేల్చుకోవడంలో ఓటర్లు చతురతను ప్రదర్శించారు. అభ్యర్థుల గుణగణాలు, సామాజిక నేపథ్యం, పార్టీ వ్యవహారశైలిపై ఒక అంచనాకొచ్చిన ఓటర్లలో చాలావరకు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. ఈ పరిణామం అభ్యర్థులను కలవరపరుస్తోంది. బలమైన ఎంపీ అభ్యర్థి ఉన్నందున.. ఎమ్మెల్యే స్థానాలు కూడా మావేననే విశ్వాసం వ్యక్తం చేయలేని పరిస్థితి అన్ని పార్టీల్లో తలెత్తింది. ఓట్ల బదలాయింపు ఏ మేరకు జరిగిందనేదానిపైనే అభ్యర్థులు విజయావకాశాలు ఆధారపడ్డాయి. ఈ నేపథ్యంలో క్రాస్ ఓటింగ్‌పై బూత్‌లవారీగా ఆరా తీస్తున్నారు. ఎంపీ అభ్యర్థులకు పరీక్ష: ఓట ర్ల వ్యవహారశైలి లోక్‌సభ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఒకే పార్టీకి అటు పార్లమెంటు, అసెంబ్లీలోనూ ఓటేస్తారని ఆశించిన అభ్యర్థులకు ఈసారి ఎదురు దెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. శాసనసభలో ఒక అభ్యర్థికి మొగ్గు చూపిన ఓటర్లు.. పార్లమెంటు విషయానికి వచ్చేసరికి మరో పార్టీని ఆదరించినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. అటు చేవెళ్ల, ఇటు మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల్లో ఇదే పరిణామం చోటుచే సుకున్నట్లు స్పష్టమవుతోంది. వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ పరిస్థితి స్పష్టంగా క నిపించింది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటేసే విషయంలో ఓటర్లు పరస్పర విరుద్ధంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో దేశంలో అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజిగిరిలో బహుముఖ పోటీ నెలకొనడంతో ఇక్కడ కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు క్రాస్ ఓటింగ్ వేశారు. కొన్ని నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాలలో ఒక పార్టీకి మొగ్గు కనిపిస్తున్నా.. పార్లమెంటుకు పడే ఓట్లలో భారీ తేడా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో పోటీచేసిన ఓ ప్రధాన పార్టీకి ఒక్క అసెంబ్లీ సెగ్మెంటు కూడా వచ్చే సంకేతాలు లేన ప్పటికీ, పార్లమెంటు విషయానికి వచ్చేసరికి మొగ్గు కనిపించడం విలక్షణంగా పేర్కొంటున్నారు. చేవెళ్ల భవితవ్యం.. ఈ ఓటర్లపైనే: ఓటింగ్ శాతంపైనా అభ్యర్థులు మేధోమథనం జరుపుతున్నారు. పట్టణ సెగ్మెంట్లలో ఓటింగ్ శాతం తగ్గడంపై విజయావకాశాలను బేరీజు వేసుకుంటున్న పార్టీలు... పెరిగిన ఓటర్ల నేపథ్యంలో అవి ఎవరిని ప్రభావితం చేస్తాయోనని భయపడుతున్నారు. ఉదాహరణకు చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో గెలుపోటములను నిర్ధేశించేది శివార్లలోని రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి నియోజకవర్గాలు. తాజాగా జరిగిన ఎన్నికల్లో శేరిలింగంపల్లిలో 49.50 శాతం కాగా, గత ఎన్నికలతో పోలిస్తే 4 శాతం పోలింగ్ తగ్గింది. అలాగే రాజేంద్రనగర్‌లో 2009 ఎన్నికల్లో 60.55 శాతం కాగా, ఈసారి కూడా దాదాపుగా అంతేస్థాయిలో పోలింగ్ జరిగింది. మహేశ్వరంలో గత ఎన్నికలతో పోలిస్తే ఏడు శాతం తక్కువ ఓటింగ్ నమోదైంది. 2009లో 60.93 శాతం కాగా, తాజా ఎన్నికల్లో 53.82 శాతం పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ మూడు నియోజకవర్గాల్లో 7,30,386 ఓట్లు పోల్‌కాగా, వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్లలో 5,83,526 ఓట్లు పోలయ్యాయి. ఈ క్రమంలోనే చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గెలుపోటములు ఈ పట్టణ నియోజకవర్గాల్లో పెరిగిన ఓటర్లు నిర్దేశించనున్నారు. -
క్రాస్ ఓటింగ్ గుబులు
బోధన్,న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలకు బుధవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థుల్లో క్రాస్ ఓటింగ్ గుబులు పట్టుకుంది. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో ప్రధానంగా క్రాస్ ఓటింగ్ పై ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు వేరు వేరుగా ఓకే గుర్తుకు వేయాలని అభ్యర్థించారు.బోధన్ నియోజక వర్గంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలో క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. క్రాస్ ఓటింగ్ నష్టాల పై అంచనా వేస్తున్నారు. వైఎస్సార్సీపీకి ఓటింగ్ సరళి పై స్పష్టత ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీల అభ్యర్థులు క్రాస్ ఓటింగ్ పై ఆరా తీస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ప్రధాన రాజకీయ పార్టీలు బలసమీకరణ పై దృష్టి సారించి, వలసలను ప్రోత్సహించాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఆధిక్యత చాటే దిశలో ప్యూహప్రతివ్యుహాలతో ప్రచారం కొనసాగించారు. తెరవెనుక బలసమీకరణకు సామ దాన దండోపాయ అస్త్రాలు వినియోగించారు. ఎంపీ అభ్యర్థుల ప్రభావం ప్రధాన రాజకీయ పార్టీల ఎంపీ అభ్యర్థుల ఓటింగ్ ప్రభావం ఎమ్మెల్యే అభ్యర్థుల పై ఉంటుందని అంచానా వేస్తున్నారు.క్రాస్ ఓటింగ్‌లో ఏ మాత్రం పొరపాటు జరిగినా కొంప కొల్లెరవుతుందని ఎమ్మెల్యే అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
టీఆర్ఎస్లో ‘రెండోట్ల’ కలకలం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో ‘రెండు ఓట్లు’ కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు వచ్చేసరికి క్రాస్ ఓటింగ్ జరుగుతుందేమోననే భయం వారిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదలు అభ్యర్థులు ఇదే అంశం ప్రధానంగా భావించి ప్రచారం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. జిల్లా లో రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. తె లంగాణ నినాదం, సెంటిమెంట్ బలంగా చూపించిన బీజేపీ సైతం ఈ ‘సార్వత్రిక’ ఎన్నికలలో ఎంపీ సీట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం టీఆర్ఎస్ అభ్యర్థులలో కలకలం రేపుతోంది. అందరికీ ప్రతిష్టాత్మకమే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ఈసారి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ, యూపీఏ కాకుండా మూడో ప్రత్యామ్నాయం ఖాయమని టీఆర్ఎస్ బలంగా ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలతోపాటు ఎంపీలను మెజార్టీ స్థానాల్లో గెలిపించుకునేందుకు సర్వశక్తులొడ్డుతోంది. అయితే, తెలంగా ణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన బీజేపీ సైతం నరేంద్రమోడి ప్రధాని కావాలంటే ఎంపీల ను గెలిపించాలని తెలంగాణవాదులు, యువతను కోరుతోంది. జిల్లాలో కొత్త ఓటర్లు, ప్రధానంగా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే యువత ఎమ్మెల్యేకు టీఆర్ఎస్ అభ్యర్థికి, ఎంపీకొచ్చేసరికి కమలానికి వేయాలన్న ధోరణి ప్రదర్శించడాన్ని ఆ పార్టీ పసిగట్టింది. దీనిని నివారించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఏకంగా ప్రచార సభలలోనే విషయాన్ని ప్రస్తావిస్తూ, క్రాస్‌ఓటింగ్ జరగకుండా చూడాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీలకు వేసే ఓట్లు కూడ టీఆర్ఎస్కే పడాలని పదే పదే చెబుతున్నారు. ఇక్కడ పరిస్థితులు భిన్నం నిజామాబాద్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాలకు వచ్చేసరికి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. జహీరాబాద్ పరిధిలో జిల్లాలోని బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పల్లెల్లో ప్రచారం ఉధృతంగా నిర్వహించాల్సిన ఎంపీ అభ్యర్థి భీమ్రావ్ బస్వంత్‌రావు పాటిల్‌కు భాష ప్రతిబంధకంగా మారింది. దీనికి తోడు వ్యాపారపరంగా మహారాష్ట్రలో స్థిరపడిన ఆయన ఏకంగా ఎంపీ అభ్యర్థిగా దిగడాన్ని కూడా ఎవరూ అంగీకరించడం లేదు. దీనికి తోడు, క్రాస్‌ఓటింగ్ జరిగితే పరిస్థితి ఏమిటన్న చర్చ ఉంది. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి నాయకురాలిగా ప్రజలతో సంబంధాలున్నా, జిల్లాలోని ఐదు సెగ్మెంట్లలో ఒక్క సిట్టింగ్ ఎమ్మెలే కూడా లేరు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గా లలో ఆమె ఎంపీ అభ్యర్థిగా ఓట్లడిగే పరిస్థితి. ఎమ్మెల్యే, ఎంపీలుగా టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని ఆమె ఆయా సెగ్మెంట్లలో బలంగా ప్రచారం చేస్తున్నారు. -
కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో తీవ్రస్థాయిలో నెలకొన్న గ్రూపు విభేదాలు ఆ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి నరేశ్ జాదవ్‌కు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. రెండు గ్రూపుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే స్థాయిలో ఉంది. ఈ వర్గపోరు కారణంగా క్రాస్ ఓటింగ్ జరిగే ప్రమాదం ఉందని, దీనిని నివారించేందుకు నరేశ్‌జాదవ్ పడరాని పాట్లు పడుతున్నారు. ఇందులో భాగంగా వ్యతిరేక వర్గీయులైన ప్రేంసాగర్‌రావును కలిసి ఎన్నికల్లో తనకు సహకరించాలని అభ్యర్థించారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి ఇతర పార్టీ అభ్యర్థుల మద్దతు దేవుడెరుగు.. సొంత పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థుల మద్దతునే కూడ గట్టుకోవాల్సిన పరిస్థితి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రేంసాగర్‌రావు వర్గీయుల నుంచి సానుకూలంగా స్పందన వచ్చిందని నరేష్ జాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నా, అంతర్గత ఆందోళన వీడటం లేదు. వర్గపోరు ప్రభావం ఆదిలాబాద్ ఎంపీ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో ఒక్క నిర్మల్ స్థానం తనకు అనుకూలమైన ఎ.మహేశ్వర్‌రెడ్డికి దక్కింది. మిగిలిన ఆరు నియోజకవర్గాలు నరేష్ జాదవ్‌కు వ్యతిరేకవర్గమైన మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు వర్గీయులకే దక్కాయి. సిర్పూర్ నుంచి ప్రేంసాగర్‌రావు బరిలో దిగారు. ఆత్రం సక్కు(ఆసిఫాబాద్), అజ్మీరా హరినాయక్ (ఖానాపూర్), విఠల్‌రెడ్డి(ముథోల్), అనీల్‌జాదవ్(బోథ్), భార్గవ్‌దేశ్‌పాండే(ఆదిలాబాద్)లు అంతా ప్రేంసాగర్‌రావు వర్గీయులే. ఎంపీ అభ్యర్థి అయిన నరేష్‌జాదవ్ మాత్రం మహేశ్వర్‌రెడ్డి, సి.రాంచంద్రారెడ్డి వర్గీయుడు. ఈ రెండు వర్గాల మధ్య చాలాకాలంగా ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం విధితమే. ఇప్పుడు వర్గపోరు నరేష్‌జాదవ్ గెలుపు అవకాశాలను దెబ్బతిసే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వ్యతిరేక వర్గం.. వ్యూహాత్మక ప్రచారం.. ఎంపీ అభ్యర్థి విజయావకాశాలపై ఆ నియోజకవర్గ పరిధిలో ని ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రభావం ఉంటుంది. ఎంపీ అభ్యర్థి గె లుపు సునాయసం కావాలన్నా ఆయా నియోజకవర్గాల్లోని ప్రచారం తీరులో ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రేంసాగర్‌రావు వర్గీయులైన ఎమ్మెల్యే అభ్యర్థులు వ్యూహాత్మకంగా ప్ర చారం నిర్వహిస్తున్నారు. ఆదివారమే ప్రచారం ప్రారంభించి న ప్రేంసాగర్‌రావు వర్గీయులు ఎక్కడా ఎంపీ అభ్యర్థి నరేష్ జాదవ్ ప్రస్తావన పెద్దగా తీసుకురావడం లేదు. ఈ ఎన్నిక ల్లో తనను గెలిపించాలని, కాంగ్రెస్ మద్దతివ్వాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారే తప్ప, ఎంపీ అభ్యర్థి ప్రస్తావన లేకపోవడం నరేష్‌జాదవ్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. ఖానాపూర్ అ భ్యర్థి హరినాయక్ ఆదివారం జన్నారంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి ప్రస్తావన ఏ మాత్రం రాకపోవడం గమనార్హం. పైగా ఈ సమావేశానికి ఏపీపీఎస్సీ డెరైక్టర్ రవీందర్రావు వర్గీయులు, ఖానాపూర్ బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సయ్యద్ ఇసాఖ్ వంటి నాయకులు దూరంగా ఉండటం గమనార్హం. ప్రేంసాగర్రా వు సిర్పూర్లో చేస్తున్న ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడా ఎంపీ అభ్యర్థి ప్రస్తావనే లేకపోవడం విశేషం. ఆదిలాబాద్ బరిలో ఉన్న భార్గవ్‌దేశ్‌పాండే కూడా ప్రేంసాగర్ వర్గీయుడిగానే ముద్ర పడినా, ఆయనకు మద్దతుగా డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి ప్రచారం నిర్వహిస్తుండటంతో నరేష్‌జాదవ్‌కు ప్రచారానికి ఇక్కడ ప్రస్తుతానికి అంతగా ఇబ్బంది లేదు. ఏడు నియోజకవర్గాల్లో ఐదింటిలోనూ నరేష్‌జాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రచారంపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఎవరి లెక్కలు వారివి..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తొలివిడత ప్రాదేశిక పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల్లో ఊహలపల్లకిలో విహరిస్తున్నారు. ప్రస్తుతం ఓటింగ్ సరళిని పరిశీలిస్తూ అంచనాల్లో బిజీ అయ్యారు. తొలివిడతలో భాగంగా జిల్లాలో 16 మండలాల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇందులో 16 జెడ్పీటీసీ స్థానాలు, 300 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు సార్వత్రిక ఎన్నికల పూర్తయ్యే వరకు చేపట్టొద్దని న్యాయస్థానం తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. దీంతో కనీసం నెలరోజుల పాటు ఫలితాల కోసం నిరీక్షణ తప్పదు. ఈనేపథ్యంలో ముందస్తుగా ఫలితాలు ఎలా ఉం టాయనే కోణంలో అభ్యర్థులు అంచనాలకు ఉపక్రమించారు. అనుచరగణంతో కలిసి లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. అనుకున్నట్లే జరిగిందా..? ప్రాదేశిక ప్రచారంలో తమ పరిధిలోని అన్ని వర్గాలను కలుపుకొని సాగిన నేతలు.. పోలింగ్ వరకు అదే పంథాను అమలుచేశారు. దీంతో ఓటింగ్ ప్రక్రియ అనుకున్నట్లే జరిగిందా..లేదా అనే అంశాన్ని నిశితంగా పరిశీలి స్తున్నారు. కొందరు ఓటర్లతో పరోక్షంగా ఓటు ఎవరికి వేశావంటూ విషయాన్ని రాబడుతున్నారు. క్రాస్ ఓటింగ్‌తో ఎవరికి లాభం..? ఆదివారం జరిగిన ప్రాదేశిక పోలింగ్‌లో చాలావరకు క్రాస్ ఓటింగ్ జరిగిందనే ప్రచారం సాగుతోంది. ఈనేపథ్యంలో ఓటర్ల మాటల్లోనూ ఇదే తరహాలో సమాధానాలు వస్తున్నాయి. దీంతో అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ గుబులు పట్టుకుంది. ముఖ్యంగా ఇటీవల జిల్లాలో పేరున్న బడానేతలు పార్టీలు మారడం ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం పడినట్లు కనిపిస్తోంది. దీంతో తమ పరిధిలో ఏ పార్టీకి ఓట్లు వచ్చే అవకాశం ఉంది.. క్రాస్ ఓటింగ్ ఎవరికి అనుకూలం కాబోతోంది..? అనే కోణంలో అభ్యర్థుల అంచనాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాంగంగా కొందరు అభ్యర్థులు తమ అనుచరగణాన్ని క్షేత్రస్థాయిలోకి పంపి సమాచారాన్ని రాబడుతున్నారు. ఏదైతేనేం ఎన్నికల ఫలితాలు వస్తేగాని అసలు సంగతి బయటపడదు.