బోధన్,న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలకు బుధవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థుల్లో క్రాస్ ఓటింగ్ గుబులు పట్టుకుంది. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో ప్రధానంగా క్రాస్ ఓటింగ్ పై ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు వేరు వేరుగా ఓకే గుర్తుకు వేయాలని అభ్యర్థించారు.బోధన్ నియోజక వర్గంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలో క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది.
క్రాస్ ఓటింగ్ నష్టాల పై అంచనా వేస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి ఓటింగ్ సరళి పై స్పష్టత ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీల అభ్యర్థులు క్రాస్ ఓటింగ్ పై ఆరా తీస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ప్రధాన రాజకీయ పార్టీలు బలసమీకరణ పై దృష్టి సారించి, వలసలను ప్రోత్సహించాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఆధిక్యత చాటే దిశలో ప్యూహప్రతివ్యుహాలతో ప్రచారం కొనసాగించారు. తెరవెనుక బలసమీకరణకు సామ దాన దండోపాయ అస్త్రాలు వినియోగించారు.
ఎంపీ అభ్యర్థుల ప్రభావం
ప్రధాన రాజకీయ పార్టీల ఎంపీ అభ్యర్థుల ఓటింగ్ ప్రభావం ఎమ్మెల్యే అభ్యర్థుల పై ఉంటుందని అంచానా వేస్తున్నారు.క్రాస్ ఓటింగ్‌లో ఏ మాత్రం పొరపాటు జరిగినా కొంప కొల్లెరవుతుందని ఎమ్మెల్యే అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
క్రాస్ ఓటింగ్ గుబులు
Published Wed, Apr 30 2014 2:44 AM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM
Advertisement
Advertisement