సాక్షి, రంగారెడ్డి జిల్లా: తొలివిడత ప్రాదేశిక పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల్లో ఊహలపల్లకిలో విహరిస్తున్నారు. ప్రస్తుతం ఓటింగ్ సరళిని పరిశీలిస్తూ అంచనాల్లో బిజీ అయ్యారు. తొలివిడతలో భాగంగా జిల్లాలో 16 మండలాల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇందులో 16 జెడ్పీటీసీ స్థానాలు, 300 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు సార్వత్రిక ఎన్నికల పూర్తయ్యే వరకు చేపట్టొద్దని న్యాయస్థానం తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. దీంతో కనీసం నెలరోజుల పాటు ఫలితాల కోసం నిరీక్షణ తప్పదు. ఈనేపథ్యంలో ముందస్తుగా ఫలితాలు ఎలా ఉం టాయనే కోణంలో అభ్యర్థులు అంచనాలకు ఉపక్రమించారు. అనుచరగణంతో కలిసి లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.
అనుకున్నట్లే జరిగిందా..?
ప్రాదేశిక ప్రచారంలో తమ పరిధిలోని అన్ని వర్గాలను కలుపుకొని సాగిన నేతలు.. పోలింగ్ వరకు అదే పంథాను
అమలుచేశారు. దీంతో ఓటింగ్ ప్రక్రియ అనుకున్నట్లే జరిగిందా..లేదా అనే అంశాన్ని నిశితంగా పరిశీలి స్తున్నారు. కొందరు ఓటర్లతో పరోక్షంగా ఓటు ఎవరికి వేశావంటూ విషయాన్ని రాబడుతున్నారు.
క్రాస్ ఓటింగ్‌తో ఎవరికి లాభం..?
ఆదివారం జరిగిన ప్రాదేశిక పోలింగ్‌లో చాలావరకు క్రాస్ ఓటింగ్ జరిగిందనే ప్రచారం సాగుతోంది. ఈనేపథ్యంలో ఓటర్ల మాటల్లోనూ ఇదే తరహాలో సమాధానాలు వస్తున్నాయి. దీంతో అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ గుబులు పట్టుకుంది. ముఖ్యంగా ఇటీవల జిల్లాలో పేరున్న బడానేతలు పార్టీలు మారడం ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం పడినట్లు కనిపిస్తోంది.
దీంతో తమ పరిధిలో ఏ పార్టీకి ఓట్లు వచ్చే అవకాశం ఉంది.. క్రాస్ ఓటింగ్ ఎవరికి అనుకూలం కాబోతోంది..? అనే కోణంలో అభ్యర్థుల అంచనాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాంగంగా కొందరు అభ్యర్థులు తమ అనుచరగణాన్ని క్షేత్రస్థాయిలోకి పంపి సమాచారాన్ని రాబడుతున్నారు. ఏదైతేనేం ఎన్నికల ఫలితాలు వస్తేగాని అసలు సంగతి బయటపడదు.
ఎవరి లెక్కలు వారివి..!
Published Mon, Apr 7 2014 11:50 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement