jaana reddy
-
సాగర్ బరిలో జానారెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: టీపీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపిక విషయంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం కాస్త బ్రేక్ ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి మేరకు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పూర్తయ్యేదాకా పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. గురువారం ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి అధిష్టాన నిర్ణయాన్ని తెలియచేశారు. సాగర్ ఉప ఎన్నికల్లో బరిలో జానారెడ్డి దిగుతున్నట్లు ప్రకటించారు. జానా మొదట తటపటా యించినప్పటికీ, సంప్రదింపుల తర్వాత బరిలో దిగేందుకు అంగీకరించారని మాణిక్యం ఠాగూర్ తెలిపారు. టీíపీసీసీ అధ్యక్ష ప్రకటన నిర్ణయం వాయిదా వేయాలన్న సీనియర్ నేత జానారెడ్డి విజ్ఞప్తిని పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆమోదించారని, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తర్వాతే పీసీసీ నూతన అధ్యక్షుడితో పాటు పూర్తి కార్యవర్గం ప్రకటిస్తామని ఠాగూర్ పేర్కొన్నారు. బుధవారం పార్టీ నాయకులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పీసీసీ ప్రకటనను వాయిదా వేయాలన్న జానారెడ్డి అభిప్రాయంతో దాదాపు అందరూ ఏకీభవించారన్నారు. రాష్ట్ర నాయకుల అభిప్రాయాన్ని అధినేత్రి దృష్టికి తీసుకెళ్ళగా ఆమె అంగీకరించారని ఠాగూర్ తెలిపారు. సాగర్ ఉపఎన్నిక పూర్తయ్యే వరకు ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని కమిటీ పూర్తి స్థాయిలో కొనసాగుతుందని ఠాగూర్ స్పష్టత ఇచ్చారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే.. నూతన పీసీసీ ఎంపికకు సంబంధించి అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో గెలవడమే తమ ముందున్న ఏకైక లక్ష్యమని, అందుకే నూతన కమిటీల ప్రకటన వాయిదా వేశామని తెలిపారు. పార్టీలోని నాయకుల మధ్య పోటీ సహజమే అన్న ఠాగూర్, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని చెప్పారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ వివక్ష చూపిస్తోందన్నది కేవలం అసత్య ప్రచారమేనని, గత 20 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు బీసీ నాయకులే పీసీసీకి సారథ్యం వహించారన్న విషయం గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. ఇతర పార్టీల్లో మాదిరిగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ రబ్బర్ స్టాంప్ నియామ కాలు చేయదని, తెలంగాణ శ్రేయస్సు కోసం సోనియాగాంధీ అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటారని ఆయన వ్యాఖ్యానిం చారు. నూతన పీసీసీ కమిటీల ఎంపిక విషయంలో పార్టీని వీడతానని ఏ నేతా బెదిరించలేదని, సీనియర్ నేతగా వి.హనుమంతరావు తమ అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేశారని ఠాగూర్ పేర్కొన్నారు. -
పగ్గాలు ఎవరికో?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడి మార్పు వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చర్చనీయాంశమవుతోంది. వాయిదాలు పడుతూ వస్తున్న ఈ విషయంలో ఈసారి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఉత్తమ్ స్థానంలో కొత్త నాయకుడిని నియమిస్తారనే ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే పలువురు పేర్లు వినిపిస్తుండగా.. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కె.జానారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. టీపీసీసీతోపాటు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడి మార్పు కూడా ఉంటుందని, ఈ బాధ్యతలు అప్పగించేందుకు హైదరాబాద్ కు చెందిన ముగ్గురు యువనాయకుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. మేడమ్.. నేను వైదొలుగుతా! హుజూర్నగర్ ఉప ఎన్నికల ఫలితం వెలువడిన అనంతరం ఢిల్లీ వెళ్లిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాందీని కలిశారు. రాష్ట్రం లోని రాజకీయ పరిస్థితులు, హుజూర్‌నగర్‌లో ఓటమికి కారణాలను వివరించడం తో పాటు తాను టీపీసీసీ అధ్యక్షుడిగా వైదొలుగుతానని ఆమెకు చెప్పారు. పార్టీని నడిపించేందుకు కొత్త నాయకుడిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఆయనే స్వయంగా అభ్యరి్థంచడంతో టీపీసీసీ విషయంలో నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనకు వచి్చనట్టు తెలుస్తోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉత్తమ్‌కు అవకాశమిచ్చి ఒకట్రెండు రాష్ట్రాలకు ఇంచార్జిగా నియమించాలనే యోచనలో ఢిల్లీ పెద్దలున్నారు. సామాజిక వర్గాలవారీగా సమీకరణలు టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి ఢిల్లీ పెద్దల దృష్టికి ఇప్పటికే చాలామంది నేతల పేర్లు వెళ్లాయి. ఈ జాబితాలో ఎంపీ లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి పేర్లు ముందు వరుసలో వినిపిస్తున్నాయి. హుజూర్నగర్ ఉప ఎన్నిక తర్వాత మాజీ మంత్రి జానారెడ్డి తెరపైకి వచ్చారు. ఆయ న్ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించే అంశా న్ని అధిష్టానం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ కేడర్‌తోపాటు మాస్లో మంచి ఇమేజ్ ఉన్న రేవంత్, కోమటిరెడ్డిల పేర్లు కూడా అదేస్థాయిలో వినిపిస్తున్నాయి. రేవంత్‌కు రాష్ట్రంలో ఉన్న క్రేజ్‌ను బట్టి ఆయన్ను వ్యూహాత్మకంగా ముందుకు తేవాలనే ఆలోచన సోనియా, రాహుల్‌కు ఉందని తెలుస్తోంది. కోమటిరెడ్డిపై కూడా సోనియా, రాహుల్‌కు సానుకూలత ఉందని.. ఇద్దరి సేవలను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై తర్జనభర్జనలు జరుగుతున్నట్టు సమాచారం. సామాజిక వర్గాలవారీగా చూస్తే ఈసారి బీసీ నేతకు అవకాశం ఇవ్వాలనే యోచన అధిష్టానానికి ఉందని, ఆ క్రమంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ లు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీగౌడ్‌ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఎస్సీలకు ఇవ్వాలనుకుంటే మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్‌కుమార్‌లను పరిగణనలోకి తీసుకుంటారని సమాచారం. గ్రేటర్‌లోనూ మార్పు.. టీపీసీసీ అధ్యక్షుడితో పాటు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని కూడా ప్రకటిస్తారని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ స్థానంలో మాజీమంత్రి ముఖేశ్‌గౌడ్ తనయుడు, టీపీసీసీ కార్యదర్శి విక్రమ్‌గౌడ్‌ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విక్రమ్‌తో పాటు పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి, మైనార్టీ నేత ఫిరోజ్‌ఖాన్‌ల పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోంది. -
'కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యలను సీఎల్పీ నేత జానారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించమంటే తన స్ధాయి తగ్గించుకోవడమేనన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఇదే చివరిగా స్పందించడమని జానారెడ్డి స్పష్టం చేశారు. మంత్రిగా తాను అనేక సంస్కరణలు తీసుకువచ్చానని.. తన గురించి మాట్లాడేవారు ఆ విషయాలు తెలుసుకోవాలన్నారు. కొందరు స్ధాయిని మించి మాట్లాడుతున్నారని.. అలా మాట్లాడితే స్థాయి పెరగదని సూచించారు. ఫిరాయింపులను గతంలోనే వ్యతిరేకంచానని.. అందుకే తాను పార్టీ మారినప్పుడు రాజీనామా చేశానని ఆయన వెల్లడించారు. తను ఓ పార్టీ పెట్టి.. దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశానని.. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో కూడా లేదన్నారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు టీఆర్ఎస్ కనుమరుగవడం తప్పదని ఆయన తెలిపారు. కాగా, ‘ఆలీబాబా 40 దొంగలు అన్నట్లు జానాబాబా 40 దొంగలుగా కాంగ్రెస్ నేతలు సిగ్గు, ఎగ్గు లేకుండా బస్సు యాత్ర చేస్తున్నారని, యాత్ర చేస్తున్న వారందరిపై కేసులున్నాయని బుధవారం సూర్యాపేట జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ కాంగ్రెస్‌పై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
టీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొందాం!
సీఎల్పీ అత్యవసర భేటీలో నేతలు సాక్షి, హైదరాబాద్: తమ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై దాడిని కాంగ్రెస్ శాసనసభాపక్షం తీవ్రంగా పరిగణించింది. అధికార టీఆర్ఎస్ను గట్టిగా ఎదుర్కోవాలని, నేరుగా పోరాట పంథాకు దిగాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. సీఎల్పీ నేత కె.జానారెడ్డి అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం జరిగిన అత్యవసర భేటీలో ఈ మేరకు తీర్మానించారు. ప్రజాప్రతినిధులపై దాడులకు తెగబడుతున్న టీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నరుకు వినతిపత్రాన్ని ఇచ్చి, ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమిద్దామని జానా, ఉత్తమ్ తదితరులు అభిప్రాయపడగా... ఇంకా గవర్నర్‌కు, సీఎంకు వినతిపత్రాలంటూ కాలయాపన అనవసరమని పలువురు ఎమ్మెల్యేలన్నారు. వాటి ద్వారా ఒరిగేదేమీ లేదని ఎంపీ వి.హనుమంతరావు వాదించారు. విపక్ష ఎమ్మెల్యేలపై దాడులతో టీఆర్ఎస్ నేతలు రెచ్చిపోతున్నారని మాజీ మంత్రి డి.కె.అరుణ విమర్శించారు. అవసరమైతే టీడీపీతో సహా అన్ని పార్టీలతో కలిసి టీఆర్ఎస్ను ఎదుర్కొందామన్నారు. దానివల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులన్నారు. ఎన్టీఆర్ వంటివారినే ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్‌ను ఎదుర్కోవడం పెద్ద విషయం కాదన్నారు. సౌమ్యులుగా పేరున్న చిన్నారెడ్డి, చిట్టెంలపైనే దాడికి దిగితే తనవంటి వారి పరిస్థితేమిటని ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ప్రశ్నించారు. గవర్నర్‌ను కలవకుండానే నేరుగా సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిద్దామని యువ ఎమ్మెల్యేలన్నారు. అపాయింట్మెంట్ తీసుకున్నాక కలవకపోవడం సరికాదని సీనియర్లు అనడంతో రాజ్‌భవన్‌కు బయల్దేరారు. 7న జిల్లా కేంద్రాల్లో నిరసనలు: ఉత్తమ్ టీఆర్ఎస్ దురాగతాలను నిరసిస్తూ, రైతు సమస్యల పరిష్కారం కోరుతూ ‘రైతును రక్షించండి-ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి’ నినాదంతో 7న సోమవారం జిల్లా కేంద్రాల్లో నిరసనలు, ధర్నాలు నిర్వహించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. సాగును నిర్లక్ష్యం చేయడం, రైతు ఆత్మహత్యలను పట్టించుకోకపోవడం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై టీఆర్ఎస్ భౌతిక దాడులు తదితరాలను నిరసిస్తూ ప్రభుత్వంపై పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
'క్రాస్ ఓటింగ్ జరగనివ్వం'
హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీ ఏ ఉద్దేశంతో ఐదో అభ్యర్థిని ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దింపుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. శాసనసభ్యుల కోటా నుంచి శాసనమండలికి కాంగ్రెస్ అభ్యర్థిగా బీసీ మహిళ అయిన ఆకుల లలితకు అవకాశం ఇచ్చామన్నారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించి, ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకోవాలని టీఆర్ఎస్ చూస్తోందని విమర్శించారు. 'అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు 22 మంది ఉన్నారు, వారంతా మా పార్టీకే ఓటేస్తారు. క్రాస్ ఓటింగ్ జరగకుండా సుప్రింకోర్టు నుంచి డైరెక్షన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము' అని తెలంగాణ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి అన్నారు.