సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యలను సీఎల్పీ నేత జానారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించమంటే తన స్ధాయి తగ్గించుకోవడమేనన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఇదే చివరిగా స్పందించడమని జానారెడ్డి స్పష్టం చేశారు. మంత్రిగా తాను అనేక సంస్కరణలు తీసుకువచ్చానని.. తన గురించి మాట్లాడేవారు ఆ విషయాలు తెలుసుకోవాలన్నారు.
కొందరు స్ధాయిని మించి మాట్లాడుతున్నారని.. అలా మాట్లాడితే స్థాయి పెరగదని సూచించారు. ఫిరాయింపులను గతంలోనే వ్యతిరేకంచానని.. అందుకే తాను పార్టీ మారినప్పుడు రాజీనామా చేశానని ఆయన వెల్లడించారు. తను ఓ పార్టీ పెట్టి.. దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశానని.. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో కూడా లేదన్నారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు టీఆర్‌ఎస్ కనుమరుగవడం తప్పదని ఆయన తెలిపారు.
కాగా, ‘ఆలీబాబా 40 దొంగలు అన్నట్లు జానాబాబా 40 దొంగలుగా కాంగ్రెస్ నేతలు సిగ్గు, ఎగ్గు లేకుండా బస్సు యాత్ర చేస్తున్నారని, యాత్ర చేస్తున్న వారందరిపై కేసులున్నాయని బుధవారం సూర్యాపేట జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ కాంగ్రెస్‌పై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment