Center Revealed That State Debt Increased Significantly After The Formation of Telangana State - Sakshi
Sakshi News home page

Telangana State Debts: తెలంగాణ ఆవిర్భావం తర్వాతే.. భారీ అప్పులపై కేంద్రం ప్రకటన

Published Mon, Feb 13 2023 6:03 PM | Last Updated on Mon, Feb 13 2023 6:56 PM

Finance Ministry Announced Huge Telangana debts - Sakshi

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అప్పులు గణనీయంగా పెరిగాయని కేంద్రం వెల్లడించింది. అంతేకాదు.. ప్రతీ ఏటా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏటా పెరుగుతూనే ఉన్నాయని పూర్తి వివరాలు వెల్లడించిన కేంద్ర ఆర్ధిక శాఖ. ఈ మేరకు కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు లోకసభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి. 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అయిన నాటికి అప్పు రూ.  రూ. 75,577 కోట్లు. 2021-22 నాటికి అవి రూ. 2,83,452 కోట్లకు చేరాయి. 2022 అక్టోబర్‌ నాటికి తెలంగాణ మొత్తం అప్పులు.. రూ. 4,33,817.6 కోట్లు ఉందని కేంద్ర ఆర్ధిక శాఖ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కలిపి చేసిన అప్పుగా పేర్కొంది కేంద్రం. 

సంవత్సరాల వారీగా తెలంగాణ అప్పులు  
2014-15లో రూ. 8,121 కోట్లు
2015-16లో రూ. 15,515 కోట్లు
2016-17లో రూ. 30,319 కోట్లు
2017-18లో రూ. 22,658 కోట్లు
2018-19లో రూ. 23,091 కోట్లు
2019-20లో  రూ. 30,577 కోట్లు
2020-21లో రూ. 38,161 కోట్లు
2021-22లో రూ. 39,433 కోట్లు

ఇవి కాకుండా..
రాష్ట్ర  ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చినట్లు కేంద్ర ఆర్ధిక శాఖకు నివేదించిన ప్రభుత్వ రంగ బ్యాంకులు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డు, ఇతర కార్పొరేషన్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు.. రూ. 1,50,365.60 కోట్లు తీసుకున్నట్లు వివరాల్లో పేర్కొంది కేంద్రం. దాదాపు 12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు.. రూ. 1,30,365.60 కోట్లు. రూరల్‌ ఇన్ఫ్రాస్టక్చర్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి రూ. 8,871 కోట్లు మంజూరు కాగా.. రూ. 7,144 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్న కేంద్రం. వేర్‌ హౌస్‌ ఇన్ఫ్రాస్టక్చర్‌ ఫండ్‌ నుంచి రూ. 972 కోట్లు మంజూరు కాగా.. రూ. 852 కోట్లు విడుదల చేశారని, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఫండ్‌ నుంచి 2015-16, 2016-17లో రూ. 28 కోట్లు మంజూరు కాగా.. రూ. 10 కోట్లు విడుదల అయ్యాయని నాబార్డ్‌ ఇన్ఫ్రాస్టక్చర్‌ డవలప్‌మెంట్‌ అసిస్టెన్స్‌ నుంచి  వివిధ పథకాల అమలు కోసం రూ. 14,516.65 కోట్లు మంజూరు కాగా.. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 11,424.66 కోట్లు వినియోగించుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement