సాక్షి, హైదరాబాద్: ఇరవై రోజులుగా చెప్పిందే చెప్పుకుంటూ కాంగ్రెస్ నాయకులు కాలం గడుపుతున్నారని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ వచ్చింది కరెంట్ ఆగిపోతుంది అని ఇప్పటికే జనంలో చర్చ మొదలైందన్నారు. బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో జగదీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే పథకాలు ఇస్తామని చెప్పటం సరికాదన్నారు.
‘కేసీఆర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని జనం అనుకుంటున్నారు. చేతకాకపోతే చేతకాదు అని చెప్పాలి. అప్పుల గురించి కాంగ్రెస్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. భారత దేశంలో అప్పులు లేని రాష్ట్రం లేదు. విద్యుత్ సంస్థల్లో కూడా అప్పులు లేని రాష్ట్రం లేదు. వీళ్లు పాలించిన రాజస్థాన్ రాష్ట్రంలోనూ అప్పులున్నాయి.
పదే పదే భట్టి విక్రమార్క అప్పులున్నాయని చెప్తున్నారు. 24 గంటల కరెంట్ ఇవ్వటం చేతకాక అప్పులు గురించి మాట్లాడుతున్నారు. 2014కు ముందు 20 వేల కోట్లు అప్పు చేసి 3నుంచి 4 గంటల కరెంట్ మాత్రమే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ మేము 60 వేల కోట్లు అప్పు చేసి 24 గంటల కరెంట్ ఇచ్చాం’ అని జగదీష్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment