16వ ఆర్థిక సంఘంతో భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి
గత ఆర్థిక సంవత్సరంలో రూ.6.85 లక్షల కోట్లకు చేరిన అప్పులు
రాష్ట్ర ఆదాయంలో అధిక భాగం అప్పులు, వడ్డీల చెల్లింపులకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి సవాలుగా మారిన భారీ రుణాలను రీస్ట్రక్చర్ చేసేందుకు అవకాశం కల్పించాలని, లేనిపక్షంలో రాష్ట్రానికి అదనపు ఆర్థి క సహాయం అందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి 16వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.6.85 లక్షల కోట్లకు చేరిన రుణ భారం రాష్ట్రానికి సవాలుగా మారిందని చెప్పారు. మంగళవారం ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా, ఇతర సభ్యుల బృందంతో సీఎం సమావేశమయ్యారు.
రా ష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ ప్రాథమ్యాలు, అభివృద్ధి ప్రణాళికలు, నిధుల అవసరాలను బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లా డుతూ.. బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ రాష్ట్రం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. గత పదేళ్లలో ప్రభుత్వం (గత) భారీగా అప్పులు చేసిందని, రాష్ట్ర ఆదాయంలో అధిక భాగం రుణాలు, వడ్డీ చెల్లించేందుకే వెచ్చించాల్సిన పరిస్థితిని తీసు కొచ్చిందని అన్నారు. రుణాలు, వడ్డీలను సక్రమంగా చెల్లించని పక్షంలో రాష్ట్ర పురోగతిపై భారం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రుణాల సమస్యను పరిష్క రించేందుకు సహాయం చేయాలని కోరారు.
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50 శాతానికి పెంచండి
దేశంలోనే తెలంగాణ చిన్న రాష్ట్రమని, రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేట్‌గా పిలుస్తున్నామని రేవంత్‌రెడ్డి ఆర్థిక సంఘానికి తెలిపారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతా మని, రాష్ట్రాని కి తగిన సహాయం అందించాలని కోరారు. రాష్ట్రం దేశాభివృద్ధిలో కీలకపా త్ర పోషిస్తోందని చెప్పారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను నెరవేర్చితే దేశా న్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్య సాధనకు తాము సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పారు. దేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో తమ వంతు బాధ్యతను నెరవే రుస్తామన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్ రావు, సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
నిధులు మళ్లించాల్సి వస్తోంది: డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణ తీవ్ర సంధికాలంలో ఉందని, రూ.6.85 లక్షల కోట్లకు పైగా అప్పులకు అసలు, వడ్డీలు చెల్లించేందుకు గాను అభివృద్ధి పనులకు కేటాయించాల్సిన నిధులు మళ్లించాల్సి వస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 16వ ఆర్థిక సంఘానికి తెలిపారు. ప్రభుత్వానికి ఉన్న రుణాలను రీస్ట్రక్చర్ చేసేందుకు సాయమందించాలని కోరారు. మంగళవారం ప్రజాభవన్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లు, సూచనలను ఆయన ఆర్థిక సంఘం ముందుంచారు. కేంద్ర ప్రాయో జిత పథకాల (సీఎస్‌ఎస్) కోసం ఇచ్చే గ్రాంట్లను మూసపద్ధతిలో కాకుండా, ఆంక్షలు, కోత లు లేకుండా ఇవ్వాలని కోరారు. తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో సంపదను సృష్టించే రంగాలు కొద్ది మంది చేతుల్లోనే ఉండిపోయాయని చెప్పారు. ఆర్థిక సంఘంతో భేటీ తర్వాత ప్రజాభవన్‌లో విలేకరులతో మాట్లాడు తూ.. రాష్ట్రంలోని సామాజిక అసమానతలు, భౌగోళిక పరిస్థితులను ఆర్థిక సంఘానికి వివరించినట్టు భట్టి తెలిపారు.
రూ.10 వేల కోట్లు అడిగాం
రైతు భరోసా, రుణమాఫీ లాంటి కార్యక్రమా ల కు ఆర్థిక సాయం చేయాలని ఆర్థిక సంఘాన్ని కోరామని, అమ్మ ఆదర్శ పాఠశాలలు, ఇంటిగ్రే టెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు రూ.10 వేల కోట్లు ఇవ్వాల్సిందిగా అడిగామని చెప్పారు. స్కి ల్స్ వర్సిటీ, ఐఐటీల అప్‌గ్రెడేషన్, మూసీ ప్రక్షా ళన, ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏర్పాటు, స్పోర్ట్స్ వర్సిటీ లాంటి కార్యక్రమాల కోసం కూడా ఆర్థిక సా యం చేయాలని, రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల అ భివృద్ధికి చేయూతనందించాలని కోరినట్లు తెలి పారు.
ఆర్థిక సంఘం సభ్యులు సానుకూలంగా స్పందించారని, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇచ్చిన ప్రజెంటేషన్‌ల విషయంలో వారు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. రుణాల రీస్ట్ర క్చర్ అంశం తమ పరిధిలోకి రాదని ఆర్థిక సంఘం సభ్యులు అంటున్నారు కదా అని ప్రశ్నిం చగా, తమ అభిప్రాయాన్ని తెలియజేశామని, ప్రధాని, ఆర్థిక మంత్రికి కూడా ఇప్పటికే విన్న వించామని తెలిపారు. ఆర్థిక సంఘం కూడా ఈ విషయంలో తమకు సాయం చేయాలని కోరా మని, అవకాశమున్న ప్రతి చోటా తమ విజ్ఞప్తిని తెలియజేస్తామని భట్టి చెప్పారు. విలేకరుల సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఉన్నతాధికారు లు సందీప్‌కుమార్ సుల్తానియా, కృష్ణభాస్కర్, హరిత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment