Arvind Panagariya
-
సెస్‌లు, సర్‌చార్జీల్లో రాష్ట్రాలకు వాటా కుదరదు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర పన్నుల వాటా పంపిణీలో పనితీరు బాగా ఉన్న రాష్ట్రాలకు అన్యా యం జరుగుతోందనే ఆరోపణలను 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా తోసిపుచ్చా రు. పంపిణీ చేయదగిన కేంద్ర నిధుల నుంచి రాష్ట్రాలకు 41 శాతాన్ని పంపిణీ చేయాలని 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిందని, చట్టరీత్యా తప్పనిసరిగా కేంద్రం పంపిణీ చేయాల్సిందేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నికర పన్నుల ఆదా యంలో సెస్‌లు, సర్‌చార్జీలు సైతం కలిసి ఉంటాయని, వీటిని రాష్ట్రాలకు పంపిణీ చేయడం కుదరదన్నారు. సెస్‌లు, సర్‌చార్జీలను సైతం లెక్కించి కేంద్రం రాష్ట్రాలకు 31 లేదా 32 శాతం నిధులు మాత్రమే ఇస్తోందని రాష్ట్రాలు అంటున్నాయని తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా మంగళవారం ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడా రు. కేంద్రం వసూలు చేసే సెస్‌లు, సర్‌చార్జీల్లో సైతం రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని సిఫారసు చేస్తారా? అని జర్నలిస్టులు ప్రశ్నించగా, ఈ అంశం ఆర్థిక సంఘం పరిధిలోకి రాదంటూనే.. సెస్‌లు, సర్‌చార్జీలను వసూలు చేసి 100 శాతం తీసుకునే అధికారం కేంద్రానికి రాజ్యాంగం కల్పించిందని చెప్పారు. ఆ విధంగా రాష్ట్రాలకు వాటా ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ పట్టణాభివృద్ధి ప్రణాళికలు భేష్దేశంలో గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యతని స్తుండడంతో పట్టణాభివృద్ధి నిర్లక్ష్యానికి గురవు తోందని, తెలంగాణ ఈ విషయంలో చాలా ముందుచూపుతో వెళ్తోందని అరవింద్ పనగరి యా ప్రశంసించారు. పట్టణాభివృద్ధికి రాష్ట్ర ప్రభు త్వం వేసిన ప్రణాళికలు ఒక ఆర్థికవేత్తగా తనను ఆకట్టుకున్నాయన్నారు. ఆర్థిక ప్రణాళికల విష యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉందని, ప్రభుత్వం వివరించిన రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు తమను బాగా ఆకట్టుకున్నాయని చెప్పారు. రాష్ట్రానికి భారంగా మారిన రుణాల రీస్ట్రక్చరింగ్ అంశం తమ పరిధిలోకి రాదని వివరించారు.జీఎస్డీపీ ఆధారంగా నిధుల పంపిణీని రాష్ట్రం కోరిందిఏ ప్రాతిపదికన కేంద్రం, రాష్ట్రాల మధ్య నిధుల పంపకాలు జరగాలి? ఏ ప్రాతిపదికన రాష్ట్రాల మధ్య నిధుల పంపకాలు జరగాలి? అనే అంశంపై రాష్ట్రం సూచనలు చేసిందని పనగరియా చె ప్పారు. జీడీపీకి ఒక్కో రాష్ట్రం అందిస్తున్న చేయూ త, ఆయా రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీ పీ)ని ప్రామాణికంగా తీసుకుని 28 రాష్ట్రాల మధ్య సమానంగా (హారిజాంటల్గా) నిధుల పంపిణీ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిందని వెల్లడించారు. ఇప్పటివరకు తాము 6 రాష్ట్రాల్లో పర్యటించగా, కర్ణాటక, తెలంగాణ ఈ తరహా డిమాండ్ చేశాయని తెలిపారు. రాష్ట్రం చేసిన విజ్ఞప్తులను పరిశీలిస్తామని చెప్పారు. తాము ఇంకా 20కి పైగా రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉందని తెలిపారు.ఏం సిఫారసులు చేస్తామో ఇప్పుడే చెప్పలేం2026–27 నుంచి 2030–31 మధ్య ఐదేళ్ల కా లంలో కేంద్ర పన్నుల ఆదాయం.. కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపిణీ, రాష్ట్రాల వాటా నిధు లు మళ్లీ రాష్ట్రాల మధ్య పంపిణీ, కేంద్ర సంఘటిత నిధి నుంచి పంచాయతీలు, మున్సిపా లిటీలకు నిధుల పంపిణీ, విపత్తుల నిర్వహణ కు నిధుల పంపిణీ విషయంలో కేంద్రానికి 16వ ఆర్థిక సంఘం సిఫారసులు చేయనుందని పనగరియా వివరించారు. అయితే ఎ లాంటి సిఫారసులు చేస్తామో ఇప్పుడే వెల్ల డించలేమన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫా రసులనే కేంద్రం సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శలున్న నేపథ్యంలో, 16వ ఆర్థిక సంఘం సిఫారసులకు ఏం విలువ ఉంటుందని జర్నలిస్టులు ప్రశ్నించగా.. కేంద్రం, రా ష్ట్రాల మధ్య నిధుల పంపిణీ, స్థానిక సంస్థ లు, విపత్తుల నివారణకు నిధుల పంపిణీ విషయంలో తమ సిఫారసులను కేంద్రం తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ఇతర సిఫారసుల అమలు కేంద్రంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. 16వ ఆర్థిక సంఘం సభ్యులు అజయ్ నారాయణ్ ఝా, జార్జి మాథివ్, మనోజ్ పాండ, సౌమ్య కంటి ఘోష్ సమావేశంలో పాల్గొన్నారు. -
రాష్ట్రానికి సవాలుగా రుణ భారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి సవాలుగా మారిన భారీ రుణాలను రీస్ట్రక్చర్ చేసేందుకు అవకాశం కల్పించాలని, లేనిపక్షంలో రాష్ట్రానికి అదనపు ఆర్థి క సహాయం అందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి 16వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.6.85 లక్షల కోట్లకు చేరిన రుణ భారం రాష్ట్రానికి సవాలుగా మారిందని చెప్పారు. మంగళవారం ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా, ఇతర సభ్యుల బృందంతో సీఎం సమావేశమయ్యారు.రా ష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ ప్రాథమ్యాలు, అభివృద్ధి ప్రణాళికలు, నిధుల అవసరాలను బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లా డుతూ.. బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ రాష్ట్రం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. గత పదేళ్లలో ప్రభుత్వం (గత) భారీగా అప్పులు చేసిందని, రాష్ట్ర ఆదాయంలో అధిక భాగం రుణాలు, వడ్డీ చెల్లించేందుకే వెచ్చించాల్సిన పరిస్థితిని తీసు కొచ్చిందని అన్నారు. రుణాలు, వడ్డీలను సక్రమంగా చెల్లించని పక్షంలో రాష్ట్ర పురోగతిపై భారం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రుణాల సమస్యను పరిష్క రించేందుకు సహాయం చేయాలని కోరారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50 శాతానికి పెంచండిదేశంలోనే తెలంగాణ చిన్న రాష్ట్రమని, రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేట్‌గా పిలుస్తున్నామని రేవంత్‌రెడ్డి ఆర్థిక సంఘానికి తెలిపారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతా మని, రాష్ట్రాని కి తగిన సహాయం అందించాలని కోరారు. రాష్ట్రం దేశాభివృద్ధిలో కీలకపా త్ర పోషిస్తోందని చెప్పారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను నెరవేర్చితే దేశా న్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్య సాధనకు తాము సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పారు. దేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో తమ వంతు బాధ్యతను నెరవే రుస్తామన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్ రావు, సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. నిధులు మళ్లించాల్సి వస్తోంది: డిప్యూటీ సీఎం భట్టితెలంగాణ తీవ్ర సంధికాలంలో ఉందని, రూ.6.85 లక్షల కోట్లకు పైగా అప్పులకు అసలు, వడ్డీలు చెల్లించేందుకు గాను అభివృద్ధి పనులకు కేటాయించాల్సిన నిధులు మళ్లించాల్సి వస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 16వ ఆర్థిక సంఘానికి తెలిపారు. ప్రభుత్వానికి ఉన్న రుణాలను రీస్ట్రక్చర్ చేసేందుకు సాయమందించాలని కోరారు. మంగళవారం ప్రజాభవన్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లు, సూచనలను ఆయన ఆర్థిక సంఘం ముందుంచారు. కేంద్ర ప్రాయో జిత పథకాల (సీఎస్ఎస్) కోసం ఇచ్చే గ్రాంట్లను మూసపద్ధతిలో కాకుండా, ఆంక్షలు, కోత లు లేకుండా ఇవ్వాలని కోరారు. తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో సంపదను సృష్టించే రంగాలు కొద్ది మంది చేతుల్లోనే ఉండిపోయాయని చెప్పారు. ఆర్థిక సంఘంతో భేటీ తర్వాత ప్రజాభవన్‌లో విలేకరులతో మాట్లాడు తూ.. రాష్ట్రంలోని సామాజిక అసమానతలు, భౌగోళిక పరిస్థితులను ఆర్థిక సంఘానికి వివరించినట్టు భట్టి తెలిపారు. రూ.10 వేల కోట్లు అడిగాంరైతు భరోసా, రుణమాఫీ లాంటి కార్యక్రమా ల కు ఆర్థిక సాయం చేయాలని ఆర్థిక సంఘాన్ని కోరామని, అమ్మ ఆదర్శ పాఠశాలలు, ఇంటిగ్రే టెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు రూ.10 వేల కోట్లు ఇవ్వాల్సిందిగా అడిగామని చెప్పారు. స్కి ల్స్ వర్సిటీ, ఐఐటీల అప్‌గ్రెడేషన్, మూసీ ప్రక్షా ళన, ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏర్పాటు, స్పోర్ట్స్ వర్సిటీ లాంటి కార్యక్రమాల కోసం కూడా ఆర్థిక సా యం చేయాలని, రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల అ భివృద్ధికి చేయూతనందించాలని కోరినట్లు తెలి పారు.ఆర్థిక సంఘం సభ్యులు సానుకూలంగా స్పందించారని, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇచ్చిన ప్రజెంటేషన్ల విషయంలో వారు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. రుణాల రీస్ట్ర క్చర్ అంశం తమ పరిధిలోకి రాదని ఆర్థిక సంఘం సభ్యులు అంటున్నారు కదా అని ప్రశ్నిం చగా, తమ అభిప్రాయాన్ని తెలియజేశామని, ప్రధాని, ఆర్థిక మంత్రికి కూడా ఇప్పటికే విన్న వించామని తెలిపారు. ఆర్థిక సంఘం కూడా ఈ విషయంలో తమకు సాయం చేయాలని కోరా మని, అవకాశమున్న ప్రతి చోటా తమ విజ్ఞప్తిని తెలియజేస్తామని భట్టి చెప్పారు. విలేకరుల సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఉన్నతాధికారు లు సందీప్‌కుమార్ సుల్తానియా, కృష్ణభాస్కర్, హరిత పాల్గొన్నారు. -
రేపు సీఎంతో 16వ ఆర్థిక సంఘం భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పర్యటనలో భాగంగా 16వ ఆర్థిక సంఘం బృందం ఆదివారంహైదరాబాద్ చేరుకుంది. చైర్మన్ అరవింద్ పనగరియా నేతృత్వంలోని ఈ బృందంలో అజయ్ నారాయణ్ ఝా, యానీ జార్జి మ్యాథ్యూ, మనోజ్ పాండా, డాక్టర్ సౌమ్య కాంతి ఘోష్ సభ్యులుగా ఉన్నారు. సోమవారం ఉదయం ప్రజాభవన్‌లో పట్టణ స్థానికసంస్థల ప్రతినిధులు, గ్రామీణ స్థానికసంస్థల ప్రతినిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్/సభ్యులు, అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించనుంది. ఆ తర్వాత వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంఘాలు, సంస్థలతోపాటు రాజకీయ పార్టీల ప్రతినిధులతో విడివిడిగా సమావేశం కానుంది. రాత్రి 8 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో ఈ బృందానికి విందు ఇవ్వనున్నారు. రేపు సీఎంతో సమావేశం.. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో ఆర్థిక సంఘం బృందం సమావేశం కానుంది. రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్తున్న ఆదాయంతో పోలిస్తే రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న కేటాయింపులు తక్కువగా ఉంటున్నందున వాటిని పెంచేలా కేంద్రానికి నివేదించాలంటూ 16వ ఆర్థిక సంఘానికి సీఎం విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. అభివృద్ధిలో పురోగమిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు పెంచితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి చెందుతుందని.. తద్వారా కేంద్ర, రాష్ట్రాలకు ఆదాయం పెరుగుతుందని ఆయన సూచించనున్నట్లు తెలిసింది.15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంతోపాటు 16వ ఆర్థిక సంఘం నుంచి ఆశిస్తున్న సహకారంపై ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక, పురపాలక శాఖలు ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనున్నాయి. అనంతరం ప్రజాభవన్‌లో అరవింద్ పనగరియా బృందానికి భట్టి విక్రమార్క విందు ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు అరవింద్ పనగరియా బృందం మీడియా సమావేశంలో తమ పర్యటన వివరాలను వెల్లడించనుంది. 11న ఉదయం 16వ ఆర్థిక సంఘం తిరిగి వెళ్లిపోనుంది. 2025–26 నుంచి 2030–31 మధ్య కేంద్రం, రాష్ట్రాల మధ్య జరగాల్సిన నిధుల పంపకాల విషయంలో 16వ ఆర్థిక సంఘం చేయనున్న సిఫారసులు కీలకం కానున్నాయి. 2025 అక్టోబర్ 31 నాటికి నివేదిక సమరి్పంచాల్సి ఉండగా 2026 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. రాష్ట్రాల ఆర్థిక వనరులను అంచనా వేసి ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీలు, మున్సిపాలిటీలకు అదనపు నిధులను సమకూర్చడానికి తీసుకోవాల్సిన చర్యలనూ సిఫారసు చేయనుంది. పీహెచ్‌సీని సందర్శించనున్న 16వ ఆర్థిక సంఘం 16వ ఆర్థిక సంఘం సభ్యుడు అజయ్ నారాయణ్ ఝా మంగళవారం మధ్యాహ్నం ప్రజాభవన్‌లో పురపాలక శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. 15వ ఆర్థిక సంఘం కింద జీహెచ్ఎంసీకి మంజూరైన నిధుల వినియోగంపై సంస్థ అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఆయన మధ్యాహ్నం 3 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని అనంతారం గ్రామాన్ని సందర్శించనున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) పనితీరును, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య రంగానికి కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగాన్ని పరిశీలించనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. -
ఆర్థిక సంఘం నూతన చైర్మన్‌గా అరవింద్ పనగరియా
న్యూఢిల్లీ: నీతీ ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియాను 16వ ఆర్థిక సంఘం నూతన చైర్మన్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థికశాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రితి్వక్ రంజనం పాండేను ఆర్థికసంఘం కార్యదర్శిగా నియమించారు. పనగరియా గతంలో కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా సేవలందించారు. నూతన ఆర్థిక సంఘం 2026–27 నుంచి 2030–31 కాలానికి సంబంధించిన ఐదేళ్ల నివేదికను 2025 అక్టోబర్ 31వ తేదీకల్లా రాష్ట్రపతికి నివేదించనుంది. 16వ ఆర్థిక సంఘం ఏర్పాటు, విధి విధానాలు, కార్యచరణను నవంబర్ నెలలో ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రిమండలి ఆమోదించింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల పంపకం, రెవిన్యూ వాటా తదితరాలపై ఆర్థిక సంఘం సూచనలు, సలహాలు ఇవ్వనుంది. విపత్తు నిర్వహణ చట్టం,2005 కింద మంజూరైన నిధులు కేంద్ర, రాష్ట్రాల్లో ఏ మేరకు సది్వనియోగం అవుతున్నాయనే అంశాలపై సంఘం సమీక్ష చేపట్టనుంది. 14వ ఆర్థిక సంఘం సలహా మాదిరే 2021–22 నుంచి 2025–26 ఐదేళ్లకాలానికి కేంద్రం పన్ను రాబడుల్లో 41 శాతం వాటా రాష్ట్రాలకు దక్కాలని ఎన్కే సింగ్ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం సిఫార్సుచేయడం తెల్సిందే. ఫైనాన్స్ కమిషన్ కేంద్ర,రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై సూచనలు ఇచ్చే రాజ్యాంగబద్ధ సంస్థ. -
చైనాతో వాణిజ్య బంధం తెంచుకోవాలనడం సరికాదు
న్యూఢిల్లీ: సరిహద్దులో అతిక్రమనలకు ప్రతీకారంగా చైనాతో భారత్ వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేసుకోవలన్న డిమాండ్ సరికాదని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ పనగారియా స్పష్టం చేశారు. అలాచేయడం వల్ల భారత్ ఆర్థిక వృద్ధి వేగమూ మందగిస్తుందని హెచ్చరించారు. అందుకు బదులుగా ముందు భారతదేశం తన వాణిజ్యాన్ని విస్తరించడానికి బ్రిటన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) వంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ)కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన సూచించారు. ‘‘ రెండు దేశాలు వాణిజ్య ఆంక్షలు విధించుకోవచ్చు. అయితే 17 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ (చైనా)కు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ (భారతదేశం)ని దెబ్బతీసే సామర్థ్యమే అధికంగా ఉంటుంది’’ అని ఆయన విశ్లేషించారు. ‘‘మనం చైనాను శిక్షించాలని ప్రయత్నిస్తే, అది వెనక్కి తగ్గదు. అమెరికా ఆంక్షల విషయంలో చైనా ఎలా ప్రతిస్పందించిందన్న విషయాన్ని, ఇందుకు సంబంధించి అమెరికాలో పరిణామాలను మనం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి’’ అని ఆయన అన్నారు. ఆంక్షల విధింపు వల్ల లాభంకన్నా నష్టాలే ఎక్కువనే అన్నారు. రష్యాపై ఆంక్షల విధింపు ద్వారా అమెరికా, యూరోపియన్ యూనియన్లు ఎలాంటి ప్రతికూల పర్యవసానాలను ఎదుర్కొంటున్నాయో కూడా మనం గమనించాలని అన్నారు. చౌక కాబట్టే కొంటున్నాం... భారతదేశం దిగుమతి చేసుకునే అనేక ఉత్పత్తులకు చైనా చౌకైన సరఫరాదారు కాబట్టే భారత్ బీజింగ్ నుండి కొనుగోలు చేస్తోందని పనగారియా చెప్పారు. భారతదేశం ఎగుమతి చేయాలనుకుంటున్న వస్తువులకు చైనా మంచి ధరను అందించబోదని అన్నారు. ఇక్కడే మనం అమెరికా వంటి వాణిజ్య భాగస్వాములకు మన వస్తువులను భారీగా అమ్మడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. దీని ఫలితంగా చైనాతో వాణిజ్య లోటు– అమెరికాతో వాణిజ్య మిగులుతో భర్తీ అవుతుందని అన్నారు. వెరసి చైనాతో వాణిజ్యలోటు తీవ్రత వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదన్నారు. ఏటేటా భారీ వాణిజ్యలోటు భారత్– చైనాల మధ్య వాణిజ్య లోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం) ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో 51.5 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. 2021–22లో ఈ లోటు 73.31 బిలియన్ డాలర్లు. 2020–21లో 44.03 బిలియన్లతో పోల్చితే వాణిజ్యలోటు భారీగా పెరగడం గమనార్హం. తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–అక్టోబర్ మధ్య చైనా దిగుమతులు 60.27 బిలియన్ డాలర్లు. ఎగుమతులు 8.77 బిలియన్ డాలర్లు. క్యాడ్‌పై ఇప్పటికి ఓకే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) భారత్ కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) 2 నుండి 3 శాతం (జీడీపీ విలువతో పోల్చి) మధ్య ఉండవచ్చని అన్నారు. ఇది భారత్ తట్టుకునే పరిమితిలో ఉందని పేర్కొన్నారు. ఈ స్థాయి క్యాడ్‌తో స్థూల ఆర్థిక స్థిరత్వానికి ఎటువంటి ముప్పు ఉండబోదని స్పష్టం చేశారు. 2020–21లో భారతదేశం జీడీపీలో 0.9 శాతం కరెంట్–ఖాతా మిగులు నమోదయ్యింది. 2021–22లో 1.2 శాతం కరెంట్–ఖాతా లోటు ఏర్పడింది. ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. -
ఎకానమీ 7 శాతం వృద్ధి సాధ్యమే
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా అభిప్రాయపడ్డారు. రానున్న బడ్జెట్లో ఆశ్చర్యకమైన ప్రతికూల అంశాలు ఏవీ లేకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సైతం జీడీపీ ఇదే స్థాయిలో వృద్ధి చెందే అవకాశాలున్నట్టు చెప్పారు. మాంద్యానికి సంబంధించిన భయాలు కొంత కాలంగా వినిపిస్తున్నప్పటికీ.. ఇప్పటి వరకు అమెరికా కానీ, యూరప్ కానీ మాంద్యంలోకి జారలేదన్నారు. భారత్‌కు సంబంధించి గడ్డు పరిస్థితులు ముగిసినట్టేనన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను ఇటీవలి సమీక్షలో ఆర్బీఐ 7 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గించడం తెలిసిందే. ప్రపంచబ్యాంకు కూడా భారత్ జీడీపీ 6.9% వృద్ధిని సాధిస్తుందన్న అంచనాలను వ్యక్తం చేసింది. రూపాయిపై ఒత్తిడి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ 7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని తాను ఇప్పటికీ భావిస్తున్నట్టు పనగరియా స్పష్టం చేశారు. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు కారణంగా విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళుతుండడం రూపాయిపై ఒత్తిడికి దారితీసినట్టు వివరించారు. నవంబర్ నెల నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ ఆగి, నికర పెట్టుబడులకు దారితీసిన విషయాన్ని పనగరియా గుర్తు చేశారు. దీనికితోడు అమెరికాలో ద్రవ్యోల్బణం దిగొస్తుండడంతో అక్కడ కూడా గడ్డు పరిస్థితులు ముగిసినట్టేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు రూపాయి ఇదే కాలంలో యూరో, యెన్ తదితర కరెన్సీలతో బలపడిన విషయాన్ని ప్రస్తావించారు. దీనికంటే ముందు నాటికే రూపాయి అధిక వ్యాల్యూషన్లో ఉన్నట్టు చెప్పారు. కనుక సమీప కాలంలో డాలర్‌తో రూపాయి విలువ మరింత తగ్గడం పట్ల తాను సానుకూలంగా ఉన్న ట్టు తెలిపారు. లేబర్ ఫోర్స్ సర్వే గణాంకాలను గమనిస్తే దేశంలో నిరుద్యోగం ఏమంత అధికంగా లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. -
పటిష్టంగా ఎకానమీ పునాదులు
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉన్నాయని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికాల్లో వాస్తవ జీడీపీ గణాంకాలు.. కరోనా పూర్వ స్థాయిని అధిగమించడం ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. కోవిడ్–19 మహమ్మారి సమస్యను సాధ్యమైన వేగంగా, నిర్మయాత్మకంగా దేశం అధిగమించాలని పనగారియా పేర్కొన్నారు. దేశీయంగా ప్రైవేట్ పెట్టుబడులు ఇప్పటికే పుంజుకున్నాయని ఆయన వివరించారు. మరోవైపు, సంపన్న దేశాలు అమలు చేస్తున్న ఉపశమన ప్యాకేజీల (క్యూఈ) వల్లే భారత్‌లోకి విదేశీ పెట్టుబడులు వస్తున్నాయన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. భారత్‌లోకి పెట్టుబడులకు క్యూఈతో పాటు అనేక కారణాలు ఉన్నాయన్నారు. ‘క్యూఈ అనేది సంపన్న దేశాల నుంచి ఇతర దేశాలకు పెట్టుబడులు మరలడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ నిధులన్నీ ఇతర వర్ధమాన మార్కెట్లలోకి కాకుండా మొత్తం భారత్‌లోకే వస్తాయన్న హామీ లేదు. అత్యధికంగా రాబడులు వస్తాయన్న భరోసా కారణంగానే ఇన్వెస్టర్లు భారత్‌ను ఎంచుకుంటున్నారు‘ అని పనగారియా చెప్పారు. సంపన్న దేశాలు క్రమంగా ప్యాకేజీలను ఉపసంహరించే కొద్దీ పెట్టుబడుల్లో కొంత మొత్తం వెనక్కి వెళ్లడం సాధారణమేనన్నారు. అయితే, ఆయా సంపన్న దేశాల్లో వచ్చే రాబడులకన్నా ఎంత అధికంగా అందించగలదన్న అంశంపైనే భారత్‌లో పెట్టుబడుల కొనసాగింపు ఆధారపడి ఉంటుందని పనగారియా చెప్పారు. హేతుబద్ధంగానే స్టాక్ మార్కెట్ల తీరు .. వాస్తవ పరిస్థితులతో సంబంధం లేనట్లుగా ఆర్థిక వృద్ధి మందగించిన తరుణంలో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లిపోతుండటం అసాధారణమేమీ కాకపోవచ్చని పనగారియా చెప్పారు. భవిష్యత్ రాబడుల అంచనాలపైనే స్టాక్ మార్కెట్ ధరలు ఆధారపడి ఉంటాయని వివరించారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాలు భారీగా ఉన్న నేపథ్యంలో షేర్ల రేట్ల విషయంలో ఈక్విటీ ఇన్వెస్టర్లు హేతుబద్ధంగానే వ్యవహరిస్తున్నారని భావించవచ్చన్నారు. -
కేంద్రం సంస్కరణలు కొనసాగించాలి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్న ద్రవ్య లోటు లక్ష్య సాధనకు కేంద్రం కట్టుబడి ఉండాలని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా చెప్పారు. మరోవైపు గత నాలుగేళ్లుగా ప్రవేశపెట్టిన సంస్కరణలను కూడా కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. వస్తు, సేవల పన్నుల విధానం, దివాలా చట్టం వంటి సంక్లిష్టమైన చట్టాలను ప్రవేశపెట్టడంలో గత ప్రభుత్వాలు ఇబ్బందిపడ్డాయని, అయితే ప్రస్తుత ప్రభుత్వం వాటిని ప్రవేశపెట్టడంతో పాటు అమలు చేయడంలోనూ గణనీయంగా పురోగతి సాధించిందని అరవింద్ అభిప్రాయపడ్డారు. ‘ఆర్థిక స్థిరీకరణనేది ప్రస్తుత ప్రభుత్వం సాధించిన విజయాల్లో ఒకటి. ఇది స్థూల ఆర్థిక స్థిరత్వ సాధనలో కీలకపాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ద్రవ్య లోటు లక్ష్యాలను మార్చుకోరాదు‘ అని ఆయన పేర్కొన్నారు. -
భారత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలకు కమిటీ
న్యూయార్క్: భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం దేశ ఆర్థికవ్యవస్థను అధ్యయనం చేసి విప్లవాత్మక అభివృద్ధి ఎజెండాను రూపొందించేందుకు నీతిఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ పనగరియా ముందుకొచ్చారు. ‘ఇప్పుడున్న సంక్లిష్ట పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి లోతైన పరిశోధన, అధ్యయనం కోసం కమిటీని ఏర్పాటు చేశామ’ని పనగరియా తెలిపారు. -
అర్వింద్ ఎందుకు రాజీనామా చేశారు?
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణియన్ బుధవారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. వ్యక్తిగత కారణాల వల్లనే తాను రాజీనామా చేస్తున్నానని ఆయన చెప్పుకున్నారు. అందులో అంతగా నిజం లేదని, అమెరికా అకాడమీ పదవి వదిలి వచ్చి మళ్లీ అక్కడికే వెళ్లడం సూచిస్తోంది. ఈ ప్రభుత్వం నుంచి ముఖ్యమైన సలహాదారు పదవి నుంచి తప్పుకున్న మొదటి వ్యక్తి కూడా అర్వింద్ కాకపోవడం ఈ విషయాన్ని మరింత ధ్రువీకరిస్తోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా రఘురామ్ రాజన్ 2016లో తప్పుకున్నారు. ఆయన తనకు రెండో పర్యాయం పదవీకాలాన్ని పొడిగించని కారణంగా పదవికి రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక విధాన నిర్ణాయక మండలిగా వ్యవహరిస్తున్న ‘నీతి ఆయోగ్’ చైర్మన్ పదవికి అర్వింద్ పణగారియా రాజీనామా చేశారు. ఇప్పుడు అర్వింద్ సుబ్రమణియన్ రాజీనామా చేయడం కూడా చర్చ నీయాంశం అయింది. కీలక ఆర్థిక పదవుల్లో ఉన్న వ్యక్తులు ఎందుకు రాజీనామా చేస్తున్నారు. పాలకపక్ష బీజేపీకే కాకుండా ఆరెస్సెస్ లాంటి అనుబంధ హిందూత్వ శక్తులకు కూడా విధేయులుగా ఉన్న వారే పదవుల్లో మనుగడ సాగించగలరని, లేకపోతే తప్పుకోవడం తప్పనిసరి అవుతుందని అర్థం అవుతోంది. సమాజంలో హిందువులు, ముస్లింలు అంటూ విభజన తీసుకరావడం దేశ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తోందంటూ 2016లో అర్వింద్ సుబ్రమణియన్ చేసిన వ్యాఖ్యలు ఆరెస్సెస్‌కు రుచించలేదు. గోవధ నిషేధంపై తాను ఆనాడే తన అభిప్రాయాలను వెళ్లడించినట్లయితే ఆనాడే తన ఉద్యోగం పోయేదని సుబ్రమణియన్ ఇటీవలనే వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల కారణంగానే ఆయన తన పదవిని కోల్పోయి ఉండవచ్చు! సుబ్రమణియన్‌తోపాటు ర ఘురామ్ రాజన్ అభిప్రాయాలు జాతి వ్యతిరేకమైనవని బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి బహిరంగంగా విమర్శించడం కూడా ఇక్కడ గమనార్హమే. పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి, రాత్రి వేళల్లో మహిళలు పనిచేయడానికి వీలుగా తీసుకోవాల్సిన చర్యల గురించి నీతి అయోగ్‌లో పనగారియా చేసిన ప్రతిపాదనలకు కూడా ఆరెస్సెస్ తీవ్రంగా విమర్శించింది. ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని రఘురామ్ రంజన్ పదవికి రాజీనామా చేసిన అనంతరం బహిరంగంగానే తప్పుపట్టారు. ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాలనే ప్రశ్నించే ధైర్యమున్న సుబ్రమణియన్ లాంటి అధికారులు నానాటికి దిగజారిపోతున్న దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టానికి ఎంతో అవసరం. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు దేశ ఆర్థిక విధానంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. అయితే అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. 1991లో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు ఫలించినప్పుడు ఇప్పుడు తీసుకుంటున్న సంస్కరణలు ఎందుకు ఫలించడం లేవన్నది మరో ప్రశ్న. ప్రభుత్వ విధానాలకు విధేయులు కాదంటూ ముఖ్య ఆర్థిక సలహాదారులను తీసేస్తూ పోతుంటే ఫలితాల ప్రశ్న అలాగే ఉండి పోతుంది. -
ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించాలి
న్యూఢిల్లీ: నీతిఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా ప్రభుత్వరంగంలో ఎస్బీఐ మినహా మిగిలిన అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించాలని గట్టిగా సూచించారు. 2019లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉన్న అన్ని పార్టీలు ఈ అంశాన్ని ముందుగానే తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని కోరారు. కొలంబియా యూనివర్సిటీలో ప్రస్తుతం పనగరియా ఆర్థిక శాస్త్ర అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్బీ) ప్రైవేటీకరణకు కుంభకోణాలు, మొండి బకాయిలు (ఎన్పీఏ) పెరిగిపోవడం అన్న ఒక్క కారణం చాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలి పీఎన్బీ రూ.13,000 కోట్ల కుంభకోణం నేపథ్యంలో పనగరియా ఇలా స్పందించారు. భారీ స్థాయిలో డిపాజిట్లు ఉండి కూడా సమర్థతలేమితో మార్కెట్ విలువను కోల్పోతున్నందున ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కేంద్రం తనకున్న వాటాను వదిలిపెట్టుకోవాలని పనగరియా సూచించారు. రుణ అవసరాలను తీర్చే సామాజిక లక్ష్యాల కోసం ప్రభుత్వరంగంలో రెండు డజన్ల బ్యాంకులు ఉండాలని వాదించడం అసమంజసంగా ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు రంగ బ్యాంకులు ప్రాధాన్య రంగాలకు రుణాలందిస్తూనే మెరుగ్గా పనిచేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వాణిజ్య విధానాన్ని సరళించడమే మార్గం ఇటీవలి వాణిజ్య ఘర్షణలు, భారత్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లక్ష్యంగా చేసుకుని మాట్లాడడంపై పనగరియా స్పందిస్తూ... భారత సరుకులకు అమెరికా ద్వారాలు మూయకముందే భారత్ తన వాణిజ్య విధానాన్ని మరింత స్వేచ్ఛాయుతంగా మార్చేందుకు వెనుకాడరాదని సూచించారు. -
నీతి ఆయోగ్‌కు పనగడియా బై.. బై!!
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పదవి నుంచి వైదొలగనున్నట్లు అరవింద్ పనగడియా ప్రకటించారు. ఆగస్ట్ 31న బాధ్యతల నుంచి తప్పుకొని తిరిగి కొలంబియా యూనివర్సిటీకి వెళ్లనున్నట్లు తెలిపారు. ఇండో–అమెరికన్ అయిన అరవింద్ పనగడియా 2015 జనవరిలో నీతి ఆయోగ్ తొలి వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తర్వాత భారత్‌లో ఒక ఉన్నత స్థాయి పదవిని వదులుకొని మళ్లీ టీచింగ్ ప్రొఫెషన్‌కు వెళుతున్న ఆర్థిక వేత్త పనగడియానే. కొలంబియా యూనివర్సిటీలో ఇండియన్ పొలిటికల్ ఎకానమీ ప్రొఫెసర్ అయిన ఈయనకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా నిర్ణీత పదవీ కాలం అంటూ ఏమీ లేదు. ‘యూనివర్సిటీ వారు నాకు పొడిగింపు ఇవ్వలేదు. అందుకే ఆగస్ట్ 31న నీతి ఆయోగ్‌ను వదిలి వెళ్తున్నా. ఈ విషయాన్ని రెండు నెలల ముందే ప్రధాని మోదీకి తెలియజేశాను’ అని పనగడియా తెలిపారు. -
పనాగరియా అనూహ్య నిర్ణయం
-
పనాగరియా అనూహ్య నిర్ణయం
న్యూడిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆర్థిక సలహాదారుగా ఉన్న నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగరియా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ నెలాఖరుకు వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ప్రభుత్వ ప్రధాన విధాన థింక్ ట్యాంక్ లో కీలకంగా ఉన్న పనాగరియా రాజీనామా ప్రభుత్వానికి పెద్ద షాక్ అని ఎనలిస్టులు అభిప్రాయపడ్డారు. పానగారియా రాజీనామాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదించారు. మరోవైపు రాజీనామా అనంతరం పనాగరియా న్యూయార్క్ కొలంబియా విశ్వవిద్యాలయానికి తిరిగి వెళ్లనున్నారు. అక్కడ తన బోధనను కొనసాగించనున్నారు. విలేఖరులతో మాట్లాడిన పనాగరియా కొలంబియా యూనివర్సిటీ తనకు మరింత పొడిగింపు ఇవ్వడం లేదని అందుకే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తనను రిలీవ్ చేయాల్సిందిగా ప్రధానిని కోరినట్టు తెలిపారు. ఆగస్టు 31 న తాను నీతి ఆయోగ్‌ను వీడే అవకాశం ఉందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఈ వయసులో యూనివర్శిటీలో తాను చేస్తున్న పని చాలా కష్టం కావచ్చని పానాగారియా వ్యాఖ్యానించారు. కాగా భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడిన సరికొత్త వ్యవస్థ నీతి ఆయోగ్. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా పేరు యొక్క సంక్షిప్త రూపమే నీతి ఆయోగ్. ఇండియన అమెరికన్ ఎకనమిస్ట్ అయిన పనాగరియా కొలంబియా యూనివర్సిటీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2015లో పనాగరియా నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా నియమి తులయ్యారు. 2012 లో దేశీయ ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును దక్కించుకున్నారు. -
ప్రజలందరికీ ఇళ్లు, కార్లు, ఏసీలు
న్యూఢిల్లీ : అందరికీ అందుబాటులో గృహాలు అనే ధృడసంకల్పంతో ముందుకెళ్తున్న కేంద్రప్రభుత్వం, భారత్ కు కొత్త రూపు తీసుకురావాలని యోచిస్తోంది. వచ్చే 15 ఏళ్లలో ప్రజలందరికీ గృహాలు, టూ-వీలర్స్ లేదా కార్లు, పవర్, ఎయిర్ కండీషనర్లు, డిజిటల్ కనెక్టివిటీ ఉండేలా ప్లాన్ వేస్తోంది. ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్ ఈ మేరకు ఓ విజన్ ను రూపొందించింది. 2031-32 పేరుతో తీసుకొచ్చిన ఈ విజన్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా గవర్నింగ్ కౌన్సిల్ ముందు ఉంచారు. ప్రధాని మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆదివారం జరిగిన భేటీలో అరవింద్ పనగారియా దీన్ని ప్రజెంట్ చేశారు. పూర్తిస్థాయి అక్షరాస్యత గల సమాజాన్ని ఏర్పాటుచేసి, ఆరోగ్య సంరక్షణ వరకు అన్ని ప్రజలకు అందించాలని నీతి ఆయోగ్ ఈ విజన్ ను రూపొందించింది. ప్రజలు నివసించే ప్రాంతాల్లో నాణ్యతమైన గాలి, నీటి సదుపాయాలను అందుబాటులో ఉంచేలా.. రోడ్డులు, రైల్వేలు, వాటర్ వేస్, ఎయిర్ కనెక్టివిటీ, క్లీన్ ఇండియా విస్తరింపజేయాలని నీతి ఆయోగ్ విజన్ పేర్కొంది. 2031-32 వరకు ఒక్కొక్కరి తలసరి ఆదాయం కూడా మూడింతలు పెంచి 3.14 లక్షలకు చేర్చాలని ప్రతిపాదించింది. అంతేకాక, స్థూల దేశీయోత్పత్తి లేదా ఎకానమీ 2031-32 లోపల 469 లక్షల కోట్లకు పెంచాలన్నది లక్ష్యంగా నీతి ఆయోగ్ నిర్దేశించింది. కేంద్ర, రాష్ట్రాల వ్యయాలను 92 లక్షల కోట్లకు పెంచాలని తన విజన్ లో పేర్కొంది. ''మనం కచ్చితంగా భారత్ ను సంపన్నవంతగా, ఆరోగ్యకరంగా, సురక్షితంగా, అవినీతి రహితంగా, శక్తి సామర్థ్య దేశంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రభావశీలి దేశంగా, క్లీన్ ఎన్విరాన్మెంటల్ గా తీర్చిదిద్దాల్సి ఉందని'' ఈ విజన్ లో నీతి ఆయోగ్ తెలిపింది. -
అభివృద్ధితోనే పేదరిక నిర్మూలన
నీతి ఆయోగ్ చైర్మన్ పనగారియా సాక్షి, హైదరాబాద్: అభివృద్ధితోనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియా పేర్కొన్నారు. సరళీకరణ విధానాలతో విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరవడంతో దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు. జాతీయ పోలీస్ అకాడమీలో సోమవారం వల్లభాయ్‌పటేల్ సంస్మరణ ఉపన్యాసం చేశారు. కొన్నేళ్లుగా దేశం ఆర్థికాభివృద్ధి సాధించడంతో పేదరికం కొంతమేర తగ్గుముఖం పట్టిందన్నారు. పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 109 మంది ఐపీఎస్, 15 మంది విదేశీయులను ఉద్దేశించి మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలతో దేశం ఆర్థికంగా పురోగమిస్తోందన్నారు. గ్లోబల్ మార్కెట్‌పై పట్టు సాధిస్తేనే దేశంలో సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అకాడమీ డెరైక్టర్ అరుణ బహుగుణతో కలసి సర్దార్ పటేల్ చిత్ర పటానికి పనగారియా నివాళులర్పించారు. -
ప్రారంభమైన నీతి ఆయోగ్ జాతీయ సదస్సు
న్యూఢిల్లీ : కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపు అంశాలను చర్చించేందుకు నీతి ఆయోగ్ జాతీయ సదస్సు బుధవారమిక్కడ ప్రారంభమైంది. ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. ఇందులో ప్రణాళిక, ప్రణాళికేతర బడ్జెట్, కేంద్ర ప్రాయోజిత పథకాలు, సుస్థిర అభివృద్ధి ప్రణాళికలు, ఎఫ్ఆర్బీఎం వంటి అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య హాజరయ్యారు. ప్రతి ఆరు నెలలకోసారి ఈ సమావేశాన్ని నిర్వహించే ఆనవాయితీని నీతి ఆయోగ్ కొనసాగిస్తోంది. కాగా ఇండియా విజన్ డాక్యుమెంట్ కోసం నీతి ఆయోగ్ రాష్ట్రాల నుంచి సలహాలు తీసుకుంటోంది. -
రాజన్ వారసుడిగా.. పనగరియా?
ఈ వారంలోనే ఆర్బీఐ కొత్త గవర్నర్ ప్రకటన! న్యూఢిల్లీ: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ వారసుడిగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా నియమితులు కానున్నారా? దీనికి సంబంధించిన ప్రకటన ఈ వారంలోనే వెలువడనున్నదా? అవుననే అంటున్నాయి ఆర్థిక వర్గాలు. విశ్వసనీయ సమాచారం మేరకు.. రాజన్ తర్వాత ఆర్బీఐ గవర్నర్‌గా అరవింద్ పనగరియా పేరు దాదాపు ఖరారయింది. ఈయనతోపాటు ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్లు సుబీర్ గోకర్ణ్, రాకేశ్ మోహన్, ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య వంటి ప్రముఖులు కూడా పోటీలో ఉన్నా... పనగరియావైపే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ప్రధాని మోదీ విదేశీ పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగొచ్చాక ఈ మేరకు ప్రకటన ఉంటుందని సమాచారం. రాజన్ పదవీ కాలం సెప్టెంబర్ 4న ముగుస్తుంది. ఏడీబీ చీఫ్ ఎకనమిస్టుగానూ.... ♦ అరవింద్ పనగరియా గతేడాది జనవరి 5న నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ♦ అంతకు ముందు ఆయన ఆసియా అభివృద్ధి బ్యాంకు చీఫ్ ఎకనమిస్ట్‌గా పనిచేశారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థల్లో విధులు నిర్వహించారు. ♦ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంశంలో పనగరియాకు అపార అనుభవం ఉంది. ♦ 2012 మార్చిలో పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు. స్వస్థలం రాజస్థాన్. ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌లో పీహెచ్డీ పొందారు. -
నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల అధికారులతో నీతి ఆయోగ్ సమావేశం హైదరాబాద్ లో బుధవారం ప్రారంభమైంది. నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగరియా అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. దేశంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వ పథకాల అమలు తీరుపై రాష్ట్రాల అధికారులతో ఆయన చర్చించనున్నారు. ఈ సమావేశానికి పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్ష్యదీప్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ఈ నెల 30న ఏపీకి రానున్న అరవింద్ పనగారియా
విజయవాడ: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. పలు ఆర్ధిక సంస్కరణలపై పనగారియా ముఖ్యమంత్రితో చర్చించనున్నారు. రాత్రి విజయవాడలోనే బస చేయనున్న ఆయన డిసెంబర్ 31న ఢిల్లీకి తిరిగి వెళ్తారు. -
స్వచ్ఛభారత్ నిర్వహణ భేష్
- ఎంతటి అభివృద్ధి అయినా ప్రణాళికతో సాధ్యం - పల్లెల ప్రగతికి ప్రధాని మోదీ ప్రాధాన్యం - జిల్లాలో పర్యటించిన నీతి ఆయోగ్ జాతీయ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లా ప్రజలు స్వచ్ఛభారత్ కార్యక్రమానికి ఇస్తున్న ప్రాధాన్యం అందరికీ ఆదర్శమని నీతిఆయోగ్ జాతీయ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా కితాబిచ్చారు. ఎంతటి అభివృద్ధి అయినా ప్రణాళికతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పల్లెల ప్రగతి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వివరించారు. గురువారం ఆయన జిల్లాలోని వివిధ ప్రాం తాల్లో విసృ్తతంగా పర్యటించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి అబ్బురపడ్డారు. షాద్‌నగర్ మండలంలోని కిసన్నగర్లో ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మించుకున్న తీరును తెలుసుకున్న ఆయన గ్రామస్తులను అభినందించారు. స్థానిక ఉన్నతపాఠశాలలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. అంతకుముందు ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా జిల్లాలోని కొత్తూరు మండలం నందిగామకు చేరుకున్న అరవింద్ పనగారియాకు రాష్ర్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి, కలెక్టర్ టీకే శ్రీదేవి, జేసీ రాంకిషన్ ఘనస్వాగతం పలికారు. నందిగామలో మిషన్‌కాకతీయ పథకం కింద దాదాపు రూ.86లక్షలతో మరమ్మతు చేపట్టిన చిన్నయ్య చెరువును పరిశీలించారు. ఆయకట్టు వివరాలను కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. చెరువులకు మరమ్మతులు చేయడం ద్వారా రైతులకు అవసరమైన సాగునీరు అందుతుందని ఎస్.నిరంజన్‌రెడ్డి వివరించారు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ పథకాల ప్రయోజనాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు. షాద్‌నగర్ మండలం రాయికల్‌లో ఉద్యానవన నర్సరీని సందర్శించి.. మొక్కలు పెంచుతున్న తీరును పరిశీలించారు. రైతులకు వస్తున్న లాభాలు, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ, మార్కెట్ సౌకర్యం తదితర వాటిపై అధికారులు వివరిస్తున్నంత సేపు ఆసక్తిగా ఆలకించారు. ప్రభుత్వం మంజూరుచేసిన రూ.8లక్షల చెక్కును కిషన్‌నగర్ గ్రామసర్పంచ్‌కు అరవింద్ పనగారియా అందించారు. కార్యక్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర సమాచారశాఖ కమిషనర్ బీపీ ఆచార్య తదితరులు పాల్గొన్నారు. -
‘నీతి’ వైస్ చైర్మన్ పదవి గౌరవంగా భావిస్తున్నా: అరవింద్ పనగడియా
న్యూయార్క్: ప్రణాళికా సంఘం స్థానంలో తీసుకొచ్చిన నీతి ఆయోగ్‌కు తొలి ఉపాధ్యక్షుడిగా తనను నియమించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని ప్రముఖ భారతీయ-అమెరికన్ ఆర్థికవేత్త అరవింద్ పనగడియా అన్నారు. ‘నియమాకంతో నన్ను గౌరవించారు. ప్రధాని మోదీతోపాటు భారత్‌లోని విధానకర్తలతో పనిచేసేందుకు ఎదురు చూస్తున్నా’ అని పేర్కొన్నారు. ఆయన ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కొలంబియా వర్సిటీ ఈమేరకు ఓ ప్రకటనలో తెలిపింది.