నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు.
విజయవాడ: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. పలు ఆర్ధిక సంస్కరణలపై పనగారియా ముఖ్యమంత్రితో చర్చించనున్నారు. రాత్రి విజయవాడలోనే బస చేయనున్న ఆయన డిసెంబర్ 31న ఢిల్లీకి తిరిగి వెళ్తారు.