ప్రారంభమైన నీతి ఆయోగ్ జాతీయ సదస్సు | PM Modi To Hold Meeting With Niti Aayog On 15-Year Vision Document | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన నీతి ఆయోగ్ జాతీయ సదస్సు

Published Wed, Jul 27 2016 10:59 AM | Last Updated on Wed, Oct 17 2018 6:01 PM

PM Modi To Hold Meeting With Niti Aayog On 15-Year Vision Document

న్యూఢిల్లీ : కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపు అంశాలను చర్చించేందుకు నీతి ఆయోగ్ జాతీయ సదస్సు బుధవారమిక్కడ ప్రారంభమైంది. ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. ఇందులో ప్రణాళిక, ప్రణాళికేతర బడ్జెట్, కేంద్ర ప్రాయోజిత పథకాలు, సుస్థిర అభివృద్ధి ప్రణాళికలు, ఎఫ్‌ఆర్‌బీఎం వంటి అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు.

ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య హాజరయ్యారు. ప్రతి ఆరు నెలలకోసారి ఈ సమావేశాన్ని నిర్వహించే ఆనవాయితీని నీతి ఆయోగ్ కొనసాగిస్తోంది. కాగా ఇండియా విజన్ డాక్యుమెంట్ కోసం నీతి ఆయోగ్ రాష్ట్రాల నుంచి సలహాలు తీసుకుంటోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement