
న్యూయార్క్: భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం దేశ ఆర్థికవ్యవస్థను అధ్యయనం చేసి విప్లవాత్మక అభివృద్ధి ఎజెండాను రూపొందించేందుకు నీతిఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ పనగరియా ముందుకొచ్చారు. ‘ఇప్పుడున్న సంక్లిష్ట పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి లోతైన పరిశోధన, అధ్యయనం కోసం కమిటీని ఏర్పాటు చేశామ’ని పనగరియా తెలిపారు.