నియంతృత్వ, నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడిన ఉత్తమ్... సరైన కారణం లేకుండా అసెంబ్లీని రద్దు చేశారని మండిపడ్డారు. గడువు ముగియకముందే అసెంబ్లీని రద్దు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) అధినేత కె. చంద్రశేఖర్ రావు తన గొయ్యి తానే తవ్వుకున్నారని వ్యాఖ్యానించారు.