టీఆర్‌ఎస్ పార్టీకి కరీంనగర్ జిల్లా జన్మను, పునర్జన్మను ఇచ్చిందని ఆపధర్మ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యాంచారు. కేసీఆర్ చొప్పదండి అల్లుడని.. అక్కడ మరోసారి గెలిచి ఆయనకు కానుక ఇవ్వాల్సిన బాధ్యత అక్కడి ప్రజలపై ఉందని ఆయన అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో చొప్పదండి నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన నేతలు కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.