నీళ్లు, నిధులు, నియామకాల గురించి కలలుకన్న తెలంగాణ ప్రజలకు కన్నీళ్లు తప్ప ఏమీ మిగల్లేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం గద్వాలలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బంగారు తెలంగాణ పేరుతో సీఎం పీఠమెక్కిన కేసీఆర్ కేవలం ఆయన కుటుంబాన్ని మాత్రమే బంగారు కుటుంబంగా మార్చుకున్నారని రాహుల్ ధ్వజమెత్తారు.