‘డ్రిప్’ అర్హత జాబితా సిద్ధం చేయండి
Published Mon, Aug 15 2016 12:33 AM | Last Updated on Sun, Mar 10 2019 8:23 PM
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా 51 వేల హెక్టార్లకు డ్రిప్ కావాలని రైతుల నుంచి దరఖాస్తులు వచ్చాయని, నెలలోగా క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హత జాబితా సిద్ధం చేయాలని ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) పీడీ ఎం.వెంకటేశ్వర్లు, ఏపీడీ ఆర్.విజయశంకరరెడ్డి ఆదేశించారు. ఆదివారం ఏపీఎంఐపీ కార్యాలయంలో ఎంఐడీసీ సత్యనారాయణమూర్తితో కలిసి ఇరిగేషన్ కంపెనీ జిల్లా ప్రతినిధులు (డీసీవో), ఎంఐ ఇంజనీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2016–17లో జిల్లాకు కేటాయించిన 35 వేల హెక్టార్లలో 4,100 హెక్టార్లకు సరిపడా యూనిట్లు మంజూరు చేశామన్నారు. ఇంకా లక్ష్యం ఎక్కువగా ఉండటం, అందుకు అనుగుణంగా రైతుల నుంచి రిజిషే్ట్రషన్లు కూడా భారీగా ఉండటంతో మొదట వాటిని పూర్తీస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హత ఉన్న వాటితో జాబితా తయారు చేస్తే మంజూరు చేయడానికి సులభంగా ఉంటుందని తెలిపారు. అలాగే వేరుశనగ పంటకు రక్షకతడి ఇచ్చేందుకు వీలుగా కేటాయింపుల మేరకు కంపెనీల ద్వారా వెంటనే రెయిన్‌గన్లు, స్ప్రింక్లర్‌సెట్లు, పైపులు మండలాల్లో నిల్వ చేయాలని ఆదేశించారు.
Advertisement