స్విస్ బ్యాంకుల్లో భారతీయుల బ్లాక్ మనీ జాబితా సిద్ధం | Switzerland govt prepares list of Indians with suspected black money | Sakshi
Sakshi News home page

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల బ్లాక్ మనీ జాబితా సిద్ధం

Published Sun, Jun 22 2014 3:31 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల బ్లాక్ మనీ జాబితా సిద్ధం - Sakshi

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల బ్లాక్ మనీ జాబితా సిద్ధం

జురిచ్: నల్లధనం వెలికితీసేందుకు పోరాడుతున్న భారత్కు ఉపకరించేలా స్విట్జర్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లించకుండా స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్నట్టు భావిస్తున్న భారతీయుల జాబితాను స్విట్జర్లాండ్ ప్రభుత్వం తయారు చేసింది. ఈ వివరాలను భారత ప్రభుత్వానికి అందజేయనుంది.

స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులకు నిజమైన యజమానులను గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా భారతీయ ఖాతాదారుల వివరాలపై నిఘా వేసినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. వ్యక్తిగత, ట్రస్టు, కంపెనీల పేరు మీద దాచిన డబ్బుకు పన్ను చెల్లించలేదని భావిస్తున్న వారి జాబితాను తయారు చేశారు. అయితే వారి వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. ఇరు దేశాల మధ్య ఉన్న సమాచార మార్పు దౌత్య ఒప్పందంలో భాగంగా గోప్యంగా ఉంచాలన్న నిబంధన ఉందని తెలిపారు. భారత ప్రభుత్వంలో కలసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని చెప్పారు. నల్లధనం వెలికితీసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)కు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement