స్థానిక’ ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితా విడుదల
Published Wed, Mar 1 2017 11:15 PM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM
– మొత్తం ఓటర్లు 1476 మంది
కాకినాడ సిటీ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఓటర్ల తుది జాబితాను అధికారులు బుధవారం విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం స్థానిక సంస్థల నియోజకవర్గ పరిధిలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, నగర పంచాయతీ వార్డు సభ్యులతోపాటు స్థానిక సంస్థల్లో ఎక్స్‌అఫిషియో సభ్యులైన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు 1476 మంది ఓటర్లుగా ఉన్నారు. వీరిలో పురుషులు 632 మంది, మహిళలు 844 మంది ఉన్నారు. జిల్లాలోని ఏడు డివిజన్ కేంద్రాలలోని పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్లు ఈ విధంగా ఉన్నారు. రంపచోడవరంలో 66 మంది, పెద్దాపురంలో 317, రాజమండ్రిలో 185, రామచంద్రపురంలో 221, అమలాపురంలో 385, కాకినాడలో 261, ఎటపాక డివిజన్‌లో 41 మంది ఓటర్లు ఉన్నారు. ఆయా స్థానిక సంస్థల వారీగా ఓటర్లను పరిశీలిస్తే రాజమహేంద్రవరం కార్పొరేటర్లు 50 మంది, మున్సిపల్ కౌన్సిలర్లు పిఠాపురం 30, సామర్లకోట 30, పెద్దాపురం 28, తుని 30, అమలాపురం 29, రామచంద్రపురం 24, మండపేట 29, నగర పంచాయతీల వార్డు సభ్యులు గొల్లప్రోలు 20, ఏలేశ్వరం 20, ముమ్మిడివరం 20 మంది, జెడ్పీటీసీలు 60, ఎంపీటీసీలు 1091 మంది ఉన్నారు. ఎక్స్‌అఫీషియో మెంబర్లు 15 మంది మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీలు తోట నరసింహం, పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు, సోము వీర్రాజు, ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ, దాడిశెట్టి రాజా, వరుపుల సుబ్బారావు, ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, అయితాబత్తుల ఆనందరావు, దాట్ల బుచ్చిరాజు, తోట త్రిమూర్తులు, వేగుళ్ళ జోగేశ్వరరావు ఓటర్లుగా ఉన్నారు. ఈ ఓటర్ల జాబితాలను కలెక్టరేట్, జిల్లాపరిషత్ సీఈఓ కార్యాలయం, మున్సిపాల్టీలతో పాటు డివిజన్ కేంద్రాల్లోని ఏడు పోలింగ్ కేంద్రాలలో అందుబాటులో ఉంచారు.
Advertisement
Advertisement