కాల్పులు జరిపిన గజరాజ్ సింగ్
హైదరాబాద్ : కుషాయిగూడలోని ఈసీ నగర్‌లో కాల్పులు కలకలం రేగింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ వర్గం వారు, స్థానికంగా ఉన్న ఓ వర్గం వారు ఘర్షణ పడ్డారు. కూరగాయల మార్కెట్ స్థల వ్యవహారంలో ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన వర్గంతో స్థానిక వర్గీయులుతో ఘర్షణకు దిగారు. వివరాలు..ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన గజేందర్ సింగ్ స్థానికంగా వారంతపు సంత నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ వారాంతపు సంత విషయమై హెచ్‌బీ కాలనీకి చెందిన తులసి(41) అనే వ్యక్తితో వాగ్వివాదం జరిగింది. దీంతో ఆవేశం పట్టలేక తన దగ్గర ఉన్న లైసెన్స్‌లేని రివాల్వర్‌తో బెదిరింపులకు గురిచేస్తూ గాలిలోకి కాల్పులు జరిపాడు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. విషయం తెలియగానే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కాల్పులు జరిపిన గజరాజ్ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రెండు తుపాకీలు స్వాధీనం చేసుకున్నారు. ఇరువర్గాల తోపులాటలో గాయపడిన వారిని 108 వాహనంలో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గజేందర్ కాల్పులు జరుపుతుండగా అడ్డుకుని అరెస్ట్ చేసిన కానిస్టేబుల్ చక్రపాణి రెడ్డిని సీపీ మహేష్ భాగవత్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment